Fact Check: బెట్టింగ్ యాప్ ను ప్రోత్సహించే రావిష్ కుమార్ వీడియో నకిలీది

Fact Check: బెట్టింగ్ యాప్ ను ప్రోత్సహించే రావిష్ కుమార్ వీడియో నకిలీది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): టివి విలేఖరి రావిష్ కుమార్ ఒక బెట్టింగ్ యాప్ కు మద్దతును ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాపై విస్తృతంగా ప్రచారం అవుతోంది. వీడియోలో, ఆయన ఏవియేటర్ యాప్ 1విన్ ఉపయోగించాలని, వారు ఒక జాక్‎పాట్ గెలుచుకునే అవకాశం ఉంటుందని ప్రజలను ప్రోత్సహిస్తూ కనిపిస్తారు.

దర్యాప్తు చేసిన తరువాత, బెట్టింగ్ యాప్ కు మద్ధతు ఇస్తూ రావిష్ కుమార్ చేసిన వీడియో డీప్ ఫేక్ వీడియో అని, రావిష్ కుమార్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి రూపొందించబడిందని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. సచిన్ టెండూల్కర్ గేమింగ్ యాప్ ను ప్రోత్సహిస్తూ చేసిన ఒకటి ఇలాంటి డీప్ ఫేక్ వీడియో ఒకటి కొంతకాలం క్రితం వైరల్ అయ్యింది.

ఏది వైరల్ అవుతోంది?

వీడియో ను విశ్వాస్ న్యూస్ యొక్క టిప్‎లైన్ +91 9599299372 కు చాలామంది యూజర్స్ పంపించారు మరియు దాని వాస్తవాన్ని కనుక్కోవాలని అభ్యర్ధించారు. సోషల్ మీడియా యూజర్ “ఏవియేటర్ ప్లే”, బెట్టింగ్ యాప్ ను ప్రోత్సహిస్తూ రావిష్ కుమార్ కనిపిస్తున్న ఈ వీడియోను షేర్ చేశారు. ఈ 

దర్యాప్తు:

ఏవియేటర్ యాప్ 1విన్ అనే బెట్టింగ్ యాప్ కు మద్ధతును ఇస్తున్నట్లు వైరల్ అయిన వీడియో కొన్ని క్షణాలపాటు ఉంటుంది. ఆ క్లిప్ లో, ఒక ట్రక్ డ్రైవర్ ఈ యాప్ ద్వారా సుమారు రూ. 800 మిలియన్లు గెలుచుకున్నట్లు క్లెయిమ్ చేస్తారు. వీడియోలో రావిష్ కుమార్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పేర్కొనబడినప్పటికీ, మా సెర్చ్ లో ఆయన ఛానల్ పై అటువంటి వీడియో ఏది లభించలేదు.

రావిష్ కుమార్ యొక్క ఫేస్‎బుక్ page పై ఆగస్ట్ 2023 నాటి ఒక పోస్ట్ ఇటువంటి సంఘటననే ప్రస్తావించింది. ఇందులో ఆయన గేమింగ్ యాప్స్ లో తన చిత్రాని మోసపూరితంగా ఉపయోగించడము గురించి ఫాలోయర్స్ ను హెచ్చరించారు. ఆయన ఇలా వ్రాశారు. “నా ఫోటో ఉపయోగించి ఇది మరొక మోసము. చాలామంది వీక్షకులు మరియు రీడర్స్ డబ్బును కోరటానికి నా ముఖాన్ని ఉపయోగిస్తూ గేమింగ్ యాప్స్ యొక్క స్క్రీన్ షాట్స్ ను పంపించారు. దయచేసి జాగ్రత్తగా ఉండండి. నేను అని చెప్పబడుతున్న ఎవరికి డబ్బు ఇవ్వకండి.”

వైరల్ వీడియోకు సంబంధించి విశ్వాస్ న్యూస్ రావిష్ కుమార్ ను సంప్రదించింది. “ఇది డీప్ ఫేక్ వీడియో.” ఇటీవల సచిన్ టెండూల్కర్ ఉన్న ఒక డీప్ ఫేక్ వీడియో కూడా వైరల్ అయ్యింది. 

security.virginia.edu వెబ్సైట్ పై అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, డీప్ ఫేక్ అంటే ప్రత్యేక మెషీన్-లెర్నింగ్ టెక్నిక్స్ తో సృష్టించబడిన ఒక కృత్రిమ చిత్రము లేదా వీడియో. ఈ వీడియోలు ఆల్గోరిథమ్స్ తో అసలు ఫుటేజ్ ను తారుమారు చేయడం ద్వారా, తరచూ ప్రామాణీకరణను అందించుటకు సెలెబ్రిటీల ముఖాలను చొప్పించి, తయారు చేయబడతాయి.

ముగింపు: టివి విలేఖర్ రావిష్ కుమార్ ఒక బెట్టింగ్ యాప్ కు మద్ధతు ఇస్తున్నట్లు ఉన్న వైరల్ వీడియో ఒక డీప్ ఫేక్ వీడియో, ఇందులో యాప్ యొక్క నకిలీ ప్రచారము కొరకు అతని స్వరం ఆడియో క్లోనింగ్ ద్వారా తారుమారు చేయబడింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు