కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): అయోధ్యలో నిర్మాణములో ఉన్న రామ మందిరానికి సంబంధించి సోషల్ మీడియాలో ఏదో ఒక నకిలీ మరియు తప్పుదోవపట్టించే పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు భారతీయ కరెన్సీపై అయోధ్యలో ఉన్న రామమందిరం ఫోటో ముద్రించబడుతుందని క్లెయిమ్ చేయబడుతోంది. ఈ క్లెయిమ్ సత్యమని అనేకమంది యూజర్లు దీనిని సోషల్ మీడియా యొక్క వేరు వేరు ప్లాట్ఫార్మ్స్ పై వైరల్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు ఇది పూర్తిగా ఆధారరహితమని రుజువు అయ్యింది.
ఇన్స్టాగ్రాం యూజర్ mavala_96k_officiial మే 3వ తేదీన ఒక పోస్ట్ లో భారతీయ కరెన్సీపై రామమందిరం ఫోటో ముద్రించబడుతుంది అని క్లెయిమ్ చేశారు.
పోస్ట్ నిజమని భావించి ఇతర యూజర్స్ కూడా దీనిని వైరల్ చేస్తున్నారు. దీని ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
భారతీయ కరెన్సీపై అయోధ్యలోని రామమందిరం ఫోటో ముద్రించబడుతుంది అనే క్లెయిమ్ కు సంబంధించిన దర్యాప్తు కోసం విశ్వాస్ న్యూస్ ముందుగా గూగుల్ ఓపెన్ సెర్చ్ టూల్ ఉపయోగించింది. కీవర్డ్ సహాయముతో సెర్చ్ చేసినప్పుడు, వైరల్ క్లెయిమ్ ను నిర్ధారించుటకు మాకు ఎలాంటి వార్త లభించలేదు. ఇటువంటి నిర్ణయము ఏదైనా తీసుకోబడితే, అది తప్పకుండా వెలుగులోకి వచ్చేది.
ఒకవేళ ఇటువంటి నిర్ణయం తీసుకోబడితే, అది వార్తలలోనే కాకుండా, ఆర్బిఐ వెబ్సైట్ పై కూడా ఉంటుంది. మేము అక్కడ కూడా కరెన్సీపై రామమందిరం యొక్క ఫోటోకు సంబంధించి ఏదైనా ప్రకటన, ఆదేశము, సూచనల కొరకు శోధించాము. సెర్చ్ లో అటువంటి సమాచారము ఏది లభించలేదు.
దర్యాప్తును ముందుకు తీసుకెళ్తూ విశ్వాస్ న్యూస్ ఆర్బిఐ ప్రతినిధిని సంప్రదించింది. సమాచారము ఇస్తూ వైరల్ పోస్ట్ లో చేయబడిన క్లెయిమ్ పూర్తిగా ఆధార రహితమైనది అని ఆయన తెలిపారు.
విశ్వాస్ న్యూస్ ముందుగా భారతీయ కరెన్సీ మాత్రమే కాకుండా నేపాల్ యొక్క నోట్లు మరియు అమెరికా డాలర్ కు సంబంధించిన నకిలీ పోస్ట్ ల గురించి దర్యాప్తు చేసింది. దీని గురించి ఈ దిగువన క్లిక్ చేసి చదవవచ్చు.
దర్యాప్తు చివరిలో విశ్వాస్ న్యూస్ ఒక నకిలీ క్లెయిమ్ షేర్ చేసిన ఇన్స్టాగ్రాం యాండిల్ mavala_96k_officiial యొక్క సోషల్ స్కానింగ్ చేసింది. ప్రొఫైల్ పై ఇవ్వబడిన సమాచారము ప్రకారము, యూజర్ కు 1388 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు : విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తులో ‘భారతీయ కరెన్సీపై అయోధ్యలోని రామమందిరం ఫోటో’ అనే క్లెయిమ్ నకిలీది అని తేలింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923