వాస్తవ తనిఖీ: నూతన సంవత్సరమున రాహుల్ గాంధి విదేశీ యాత్ర గురించిన వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది
- By: Ashish Maharishi
- Published: Dec 30, 2022 at 01:18 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): కాంగ్రెస్ పార్టీ చేస్తున్న భారత్ జోడో యాత్ర నేపథ్యములో, రాహుల్ గాంధిని లక్ష్యంగా పెట్టుకొని ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో, తాను కుటుంబము మరియు స్నేహితులతో కలిసి క్రిస్టమస్ మరియు నూతన సంవత్సరాది పండుగలను జరుపుకొనుటకు రాహుల్ గాంధి డిసెంబరు 24 మరియు జనవరి 2 మధ్యలో తన యాత్రకు తాత్కాలికంగా నిలిపివేశారన క్లెయిమ్ చేయబడింది.
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు ‘భారత్ యాత్రీకుల’ కు వసతి అందించే కంటెయినర్ల నిర్వహణ కొరకు కొన్ని రోజులు ఈ యాత్ర వాయిదా వేయబడింది అని కనుగొనింది. దీని కొరకు తేదీలు ఇదివరకే ప్రకటించబడాయి మరియు ఈ వైరల్ వీడియో తప్పుదోవపట్టించేది అని తేలింది.
క్లెయిమ్
డిసెంబరు 12 న, ఒక ఫేస్బుక్ యూజర్ అయిన మనీష్ కుమార్ హిందు, తన గ్రూప్ ‘కంగనా రనౌత్’ (ఆంగ్ల అనువాదము) లో ఇలా వ్రాశారు, “భారత్ జోడో యాత్ర తరువాత, రాహుల్ గాంధి భారత్ చోరో యాత్ర. ప్రతి సంవత్సరం మాదిరిగానే, రాహుల్ గాంధి క్రిస్టమస్ మరియు నూతన సంవత్సరాది పండుగలను తన ప్రియతములతో విదేశాలలో జరుపుకుంటారు. అందుచేత, రాహుల్ గాంధి యొక్క వినోదము మరియు ఫోటో సెషన్ కార్యక్రమాలు డిసెంబరు 24 నుండి జనవరి 2 వరకు నిలిపివేయబడతాయి. అసౌకర్యానికి క్షమించండి.”
దర్యాప్తు
క్లెయిమ్ గురించి మరిన్ని వివరాలను సేకరించుటకు, విశ్వాస్ న్యూస్ ముందుగా ‘గూగుల్ ఓపెన్ సెర్చ్ టూల్’ ఉపయోగించింది. విరామము గురించి రాజకీయ వర్గాలలో చాలా చర్చలు జరుగుతున్నాయని మేము కనుగొన్నాము. అయితే, జరుగుతున్న చర్చలలో, ప్రశ్న ఏమిటంటే: ఈ విరామములో రాహుల్ గాంధి ఎక్కడ విడిది చేయబోతున్నారు?
రాహుల్ గాంధి కార్యక్రమము గురించి ఏ నాయకుడైనా ఏమైనా చెప్పారా అని విశ్వాస్ న్యూస్ తెలుసుకోవాలని అనుకుంది. కాంగ్రెస్ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ స్కాన్ చేయబడింది. డిసెంబరు 9న అప్లోడ్ చేయబడిన ఒక వీడియో లో, యాత్ర డిసెంబరు 24 నాటికి ఢిల్లీకి చేరుకుంటుందని, యాత్ర యూపి, హర్యాణా, జమ్ము మరియు కాశ్మీర్ వైపుకు కదులుతుందని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ జైరాం రమేష్ చెప్పడం చూడవచ్చు.
కంటెయినర్ యొక్క నిర్వహణ అవసరం ఉందని మరియు శీతాకాలము కొరకు ఏర్పాట్లు చేయవలసి ఉందని ఆయన చెప్పడం వీడియోలో వినవచ్చు.
ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానము చెప్తూ, భారత్ జోడో యాత్ర యొక్క నిలుపుదల సమయములో రాహుల్ గాంధి ఢిల్లీలో విడిదిచేస్తారని జైరాం అన్నారు. ఆయన పార్లమెంట్ సెషన్ కు కూడా హాజరు అవుతారని కూడా ఆయన చెప్పారు.
కంటెయినర్ల నిర్వహణ మరియు మరమ్మత్తు కొరకు భారత్ జోడో యాత్ర కొన్ని రోజుల వరకు వాయిదా పడుతుందని కాంగ్రెస్ పత్రికా ప్రకటనలో పేర్కొనింది.
విశ్వాస్ న్యూస్ తో మాట్లాడుతూ, భారత్ జోడో యాత్ర డిసెంబరు 24 నుండి జనవరి 2 వరకు తాత్కాలికంగా నిలిపివేయబడిందని జైరాం రమేష్ గారు ఇదివరకే స్పష్టం చేశారు అని. రవాణాలో ఉపయోగించే కంటెయినర్ల నిర్వహణ మరియు మరమ్మత్తుల కొరకు ప్రయాణము కొన్ని రోజు తాత్కాలికంగా నిలిపివేయబడింది. ప్రధాన సమస్యల నుండి ప్రజల దృష్టి మరల్చుటకు బిజేపి ఇటువంటి అబద్ధాలను ప్రచారము చేస్తుంది, కాని ప్రజలు వారి వల్ల తప్పుదారిపట్టరు. అని కాంగ్రెస్ సెక్రెటరీ వినీత్ పూనియా తెలిపారు.
ఈ పోస్ట్ షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ రాయ్ బరేలి నివాసి. ఈ యూజర్ గురించి ఎలాంటి సమాచారము లేదు.
ముగింపు: వైరల్ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు అది తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. ‘భారత్ యాత్రీకుల’ కు వసతి అందించే కంటెయినర్ల నిర్వహణ కొరకు కొన్ని రోజులు ఈ యాత్ర వాయిదా వేయబడింది అని కనుగొనింది. దీని కొరకు తేదీలు కూడా ఇదివరకే ప్రకటించబడ్డాయి.
- Claim Review : రాహుల్ గాంధి యొక్క విదేశీ యాత్ర కొరకు భారత్ జోడో యాత్ర నిలుపుదల
- Claimed By : మనీష్ కుమార్ హిందు
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.