X
X

వాస్తవ తనిఖీ: కోవిడ్ ఎక్స్‎బిబి వేరియంట్ పై వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది

  • By: Devika Mehta
  • Published: Dec 30, 2022 at 12:17 PM
  • Updated: Dec 30, 2022 at 01:47 PM

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): వార్తా రిపోర్ట్స్ ప్రకారము, దేశములో పెరుగుతున్న కోవిడ్ కేసుల నడుమ భారతదేశము మళ్ళీ మహమ్మారి భయముతో పెనుగులాడుతోంది. ఇటువంటి సమయములో, తప్పుడు/తప్పుదోవపట్టించే సమాచారము మెరుపు వేగముతో వ్యాప్తి చెందుతుంది.

చైనాలో కోవిడ్ భయాల మధ్య, ఒమిక్రాన్ యొక్క ఉప వేరియంట్ ఎక్స్‎బిబి, ముందుగా ఆగస్ట్ లో కనుగొనబడింది, ఇది డెల్టా వేరియంట్ కంటే ‘అయిదు రెట్లు శక్తివంతమైనది’ మరియు ప్రాణాంతకమైనది అనే ఒక సందేశము ఫేస్‎బుక్ మరియు వాట్సాప్ లలో చక్కర్లు కొడుతోంది

అయితే, విశ్వాస్ న్యూస్, తన దర్యాప్తులో, ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమము మంత్రిత్వశాఖ (ఎంఓహెచ్‎ఎఫ్‎డబ్ల్యూ) డిసెంబరు 22, 2022 నాటి ఒక ట్వీట్ లో ఈ పోస్ట్ ‘నకిలీది మరియు తప్పుదోవపట్టించేది’ అని పేర్కొనింది.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ రాధా రాణి ఫేస్‎బుక్ పై ఒక సుదీర్ఘ సోషల్ మీడియా పోస్ట్ ను షేర్ చేశారు. ఇది “కోవిడ్-ఒమిక్రాన్ ఎక్స్‎బిబి వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే అయిదు రెట్లు ఎక్కువ విషపూరితమైనది మరియు డెల్టా కంటే అధిక మరణాల రేటు కలిగి ఉంది” అని క్లెయిమ్ చేసింది.

వైరల్ సందేశము వాట్సాప్ గ్రూప్స్ లో కూడా చక్కర్లుకొడుతోంది.

దర్యాప్తు:

చైనాలో కోవిడ్ భయాల మధ్య, ఒమిక్రాన్ యొక్క ఉపవేరియంట్ ఎక్స్‎బిబి డెల్టా కంటే ప్రమాదకరమైనదని ఫేస్‎బుక్ మరియు వాట్సాప్ లలో ఒక సందేశము సర్క్యులేట్ చేయబడింది.

ఎక్స్‎బిబి, ఒమిక్రాన్ యొక్క బిఏ.2 వర్షన్ యొక్క రెండు ఉత్పన్నాల హైబ్రిడ్ భారతదేశములో పెరిగిన ఆందోళనలకు దారితీసింది. దాని ‘మాతృ’ వంశముతో పోలిస్తే, దాని తీవ్రతలో ప్రముఖమైన వ్యత్యాసాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి రుజువు లేదు. అయితే, ఒమిక్రాన్ యొక్క ఇదివరకటి వర్షన్స్ కంటే ఈ వేరియంట్ మరింతగా వ్యాప్తి చెందుతుందని వాషింగ్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ మరియు ఇవాల్యుయేషన్ విశ్వవిద్యాలయము (ఐహెచ్‎ఎంఈ) యొక్క పరిశోధన సూచిస్తుంది. ఇది తక్కువ తీవ్రత కలిగిన వ్యాధులను కలిగిస్తుంది అని కూడా కనుగొనబడింది.

విశ్వాస్ న్యూస్ ముందుగా పోస్ట్ నుండి కీవర్డ్స్ తీసుకొని సోషల్ మీడియాపై సెర్చ్ చేయడం ప్రారంభించింది మరియు ఫేస్‎బుక్ పై ఇక్కడఇక్కడ, మరియు ఇక్కడ అనేక పునరుక్తాలను కనుగొనింది

అక్టోబరు 27, 2022 ఎక్స్‎బిబి పై పత్రికా ప్రకటనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‎ఓ) ఇలా పేర్కొనింది, “మరిన్ని అధ్యయనాలు అవసరమైనప్పటికీ, ఎక్స్‎బిబి ఇన్ఫెక్షన్స్ యొక్క వ్యాధి తీవ్రతలలో గణనీయమైన మార్పులు ఉన్నాయని ప్రస్తుత సమాచారము సూచించదు. వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఉప ఉత్పన్నాలతో పోలిస్తే అధిక రీఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని సూచిస్తూ ప్రాథమిక రుజువు ఉంది.”

తరువాత, విశ్వాస్ న్యూస్ పోస్ట్ ను క్లెయిమ్స్ తో విభజించి దేశములోని నిపుణులైన వైద్యుల దృష్టికోణములో దశలవారిగా విశ్లేషించాలని నిర్ణయించుకుంది.

వైరల్ సందేశము యొక్క మొదటి భాగము కొరకు, మేము డా. నిఖిల్ మోడి, క్రిటికల్ కేర్ మెడిసిన్ మరియు పల్మనాలజిస్ట్ ను సంప్రదించాము. ఆయన సరిత విహార్, ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో ప్రాక్టీస్ చేస్తారు. ఆయన ఇలా అన్నారు, “ఇది తప్పుడు సమాచారము యొక్క భాగము. దీనికి సంబంధించి, ఈ వేరియంట్ కు అధిక ట్రాన్స్మిబిలిటి ఉండవచ్చు అని నేను చెప్తాను, కాని ప్రస్తుతానికి, సమాచారము లేదా కేసులు తీవ్రతరమైన వ్యాధిని చూపలేదు. వీటిల్లో ఎక్కువ దగ్గు, జ్వరము మరియు కారుతున్న ముక్కు వంటి లక్షణాలను ప్రదర్శించాయి.

రెండవ దశలో మేము, డా. రాజీవ్ జయదేవన్, ఎండి, డిఎన్‎బి, ఎంఆర్‎సిపి (యూకే), ఏబిఐఎం (మెడిసిన్, న్యూయార్క్) మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యొక్క కొచ్చిన్ చాప్టర్ యొక్క మాజీ అధ్యక్షుడితో మాట్లాడాము. ఆయన ఈ వైరల్ సందేశాన్ని నకిలీది అని పేర్కొన్నారు మరియు తన వాట్సాప్ గ్రూప్స్ లో తాను అందుకున్న సందేశము యొక్క ఒక స్క్రీన్ షాట్ ను షేర్ చేశారు.

ఆయన ఇలా అన్నారు, “ఈ పోస్ట్ తూర్పు దేశాలలో ఉద్భవించి ఉండవచ్చు మరియు ప్రజలు ఇప్పుడు దీనిని భారతదేశములో షేర్ చేస్తున్నారు. దయచేసి తెలుసుకోండి, అనవసరంగా భయపడకండి. ఈ పోస్ట్ ప్రజలను తప్పుదోవపట్టిస్తుంది”

“తొలినాళ్ళలో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ కేసులు చాలా యాంటిజన్ టెస్టింగ్ పై నెగెటివ్ అని వచ్చాయి అనేది నిజము. ఇది ఎక్స్‎బిబి వర్షన్ తో మాత్రమే కాదు. ఈ ఉప ఉత్పన్నముతో మాత్రమే నిమోనియా పెరిగినట్లు ఎలాంటి రుజువు లేదు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తో నిమోనియా చాలా అరుదు. ఇది వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో కూడా చాలా అరుదుగా వస్తుంది,” అని ఆయన అన్నారు.

వైరల్ సందేశములో చేయబడిన క్లెయిమ్స్ తప్పుదోవపట్టించేవి అని వైద్యులు చెప్తున్నప్పటికీ, వారు మాస్కులు ఉపయోగించాలని మరియు కోవిడ్-సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మైక్రోబయాలజిస్ట్, డా. లావణ్య జగదీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, మైక్రోబయాలజీ విభాగము, చిక్కమంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కర్ణాటక, ఇలా అన్నారు, “మరణాలకు సంబంధించి మాకు ఇంకా సమాచారము అందవలసి ఉంది. కాని ఇది అత్యధిక రెసిస్టెన్స్ కలిగి ఉండుటకు మరియు వ్యాక్సిన్ వేయించుకున్న వారికి కూడా రీఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యము కలిగి ఉండుటకు అవకాశాలు ఉన్నాయి. కొత్త వేరియంట్ ఉద్భవిస్తోంది మరియు పునరుద్భవిస్తోంది. దీనికి అతి స్వల్పకాలిక పొదుగుదల కాలం కలిగి ఉంటుంది మరియు వ్యాక్సిన్ వేయించుకున్న వారిని కూడా ఇన్ఫెక్ట్ చేయవచ్చు. బిఎఫ్.7 బిఏ.5 వేరియంట్ యొక్క ఉపఉత్పన్నము; భారతదేశములో సుమారు 4 కేసులు కనుగొనబడ్డాయి, ఒడిశా నుండి రెండు మరియు గుజరాత్ నుండి రెండు. ఇది ప్రతి ఒక్కరు కోవిడ్-అనుగుణ్యమైన ప్రవర్తనను అనుసరించవలసిన సమయం, అంటే మాస్క్ ధరించడం, ఆరు గజాల దూరం పాటించడం మరియు చేతుల పరిశుభ్రత వంటివి.”

అనురాగ్ అగ్రవాల్, ఎండి పిహెచ్‎డి, డీన్ బయోసైన్సెస్ మరియు హెల్త్ రిసెర్చ్, త్రివేది స్కూల్ ఆఫ్ బయోసైన్సెస్, అశోకా విశ్వవిద్యాలయము, హర్యాణా, ఒక ఈమెయిల్ కు సమాధానము ఇస్తూ ఈ ఆలోచనకు మద్ధతును ఇచ్చారు. “ఇది తప్పుడు సమాచారము అందువలన నకిలీది”.

డా ఎడ్మండ్ ఫర్నాండిస్, ఒక ఫిజీషియన్ మరియు ఎడ్వర్డ్ & సింథియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యొక్క సిహెచ్‎డి గ్రూప్ & డైరెక్టర్, ఇలా వ్యాఖ్యానించారు, “వైరస్ శక్తివంతమైనది అని యూజర్లు క్లెయిమ్ చేయడము గాలిలో కట్టిన మేడ. వైద్యులు లేదా ఆరోగ్య సంరక్షణ పరిశ్రమలో పనిచేసే వృత్తినిపుణులను సంప్రదించకుండా సోషల్ మీడియా పోస్ట్స్ లను విశ్వసించకపోవడం చాలా ముఖ్యమైనది. వేరొక దేశములో ప్రభావము చూపించేది భారతదేశము లేదా దక్షిణ ఆసియాలో కూడా ప్రభావము చూపుతుంది అని నిర్ణయించుటకు కారకం కావలసిన పనిలేదు.”

సోషల్ మీడియా పై సందేశము వైరల్ అయిన తరువాత, ఎంఓహెచ్‎ఎఫ్‎డబ్ల్యూ కూడా ట్విట్టర్ పై ఒక ప్రకటనను జారీ చేసింది: #నకిలీ వార్త. #కోవిడ్ 19 యొక్క ఎక్స్‎బిబి వేరియంట్ కు సంబంధించిన ఈ సందేశము కొన్ని వాట్సాప్ గ్రూప్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సందేశము #నకిలీది మరియు #తప్పుదోవపట్టించేది.”

భారతదేశములో రిపోర్ట్ చేయబడిన కోవిడ్ కేసులపై ప్రస్తుత డేటాను మీరు ఇక్కడ చూడవచ్చు.

సామాజిక స్కాన్ నిర్వహించిన తరువాత, యూజర్ ఒక డిజిటల్ క్రియేటర్ అని మరియు ఫేస్‎బుక్ పై 19వేల ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.

ముగింపు: కోవిడ్-19 ఉప వేరియంట్ ఒమిక్రాన్ ఎక్స్‎బిబి, డెల్టా వేరియంట్ కంటే ‘అయిదు రెట్లు శక్తివంతమైనది’ మరియు ప్రాణాంతకమైనది అని హెచ్చరిస్తున్న పోస్ట్ తప్పుదోవపట్టించేది.

  • Claim Review : కోవిడ్-ఒమిక్రాన్ ఎక్స్‎బిబి వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే అయిదు రెట్లు ఎక్కువ విషపూరితమైనది మరియు డెల్టా కంటే అధిక మరణాల రేటు కలిగి ఉంది
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ రాధా రాణి ఫేస్‎బుక్
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later