X
X

వాస్తవ తనిఖి: వైరల్ లింక్ పై క్లిక్ చేయడము ద్వారా జారా తన 46వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత బహుమతులను అందిస్తోంది అని క్లెయిం చేసే పోస్ట్ తప్పుదోవపట్టించేది

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేది అని కనుగొనింది. ఈ బ్రాండ్ 1975లో ప్రారంభించబడి ఇటీవల తన 46వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కాని వైరల్ పోస్ట్ లో ఉన్న లింక్ చట్ట సమ్మతమైనదికాదు.

  • By: Urvashi Kapoor
  • Published: Sep 30, 2021 at 11:58 AM
  • Updated: Jul 11, 2023 at 11:38 AM

కొత్త ఢిల్లి (విశ్వాస్ న్యూస్): జారా తన 46వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని మరియు వినియోగదారులకు ఉచిత బహుమతులను అందింస్తోందని వాట్సాప్ పై ఒక పోస్ట్ చక్కర్లు కొడుతోంది. ఈ పోస్ట్ వెంబడి ఒక లింక్ కూడా షేర్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేది అని కనుగొనింది. ఈ బ్రాండ్ 1975లో స్థాపింపబడి, ఇటీవల తన 46వ వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. కాని వైరల్ పోస్ట్ లో ఉన్న లింక్ చట్టసమ్మతమైనది కాదు.

క్లెయిం

వాట్సాప్ పై చక్కర్లు కొడుతున్న పోస్ట్ జారా తన 46వ వార్షికోత్సవం జరుపుకుంటోందని మరియు వినియోగదారులకు ఉచిత బహుమతులను అందింస్తోందని క్లెయిం చేస్తోంది. ఈ పోస్ట్ వెంబడి ఒక లింక్ కూడా షేర్ చేయబడింది.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ ఈ ప్రచారము యొక్క ప్రామాణికతను తనిఖీ చేయడము ద్వారా తన దర్యాప్తును ప్రారంభించింది. మేము జారా యొక్క చట్టబద్దమైన ఫేస్ బుక్ పేజ్ ను సందర్శించాము. ఆ పేజ్ పై మాకు అటువంటి ప్రచారము ఏది కనిపించలేదు.

మేము జారా యొక్క అధికారిక వెబ్సైట్ www.zara.com ను కూడా సందర్శించాము మరియు వైరల్ పోస్ట్ లో క్లెయిం చేసిన విధంగా ఎటువంటి ప్రచారము కనిపించలేదు.

అలాగే మేము జారా యొక్క Instagram పై కూడా శోధించాము మరియు అక్కడ కూడా అటువంటి ప్రచారాలు ఏవి చేయబడలేదు.

వైరల్ పోస్ట్ లో ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసినప్పుడు, అది “ఈ పేజ్ లో సంభావ్య చట్టవిరుద్ధ కంటెంట్ ఉండవచ్చు కాబట్టి ప్రాప్యత నిరాకరించబడింది” అనే ఒక సందేశం ఉన్న పేజీకి రీడైరెక్ట్ చేసింది.

వైరల్ పోస్ట్ లో ఉన్న లింక్ ఏ పేజీలలో కూడా జారా వెబ్సైట్ యొక్క అధికారిక లింక్ కాదు.

మేము జారా స్టోర్ నుండి అధికారి అయిన సోఫియాతో మాట్లాడాను, ఆయన ఇలా అన్నారు, “ఇది ఒక స్కాం. ఈ ప్రచారము జారా నుండి చేయబడినది కాదు”.

జారా అనేది స్పెయిన్ లోని ఒక ఫ్యాషన్ బట్టల బ్రాండ్, దీని శాఖలు మరియు దుకాణాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈ బ్రాండ్ 1975లో ప్రారంభించబడి ఇటీవల తన 46వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కాని వైరల్ పోస్ట్ లో ఉన్న లింక్ చట్ట సమ్మతమైనదికాదు.

निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేది అని కనుగొనింది. ఈ బ్రాండ్ 1975లో ప్రారంభించబడి ఇటీవల తన 46వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. కాని వైరల్ పోస్ట్ లో ఉన్న లింక్ చట్ట సమ్మతమైనదికాదు.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext page

Post saved! You can read it later