Fact Check: షేక్ హసీనా బంగ్లాదేశ్ ను వదిలిన తరువాత పోలీస్ స్టేషన్ పై దాడికి సంబంధించిన వీడియో మతపరమైన వాదనలతో తప్పుగా చూపించబడింది
ఈ వైరల్ వీడియో ఢాకాలోని పోలీస్ స్టేషన్ పై దాడిని చూపుతుందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలిన తరువాత, జన సమూహము పోలీసు అధికారిపై దాడి చేసింది. ఆ వీడియో మతపరమైన వాదనలతో తప్పుగా షేర్ చేయబడింది.
- By: Sharad Prakash Asthana
- Published: Aug 30, 2024 at 03:21 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). బంగ్లాదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యములో సోషల్ మీడియాపై ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పెద్ద జన సమూహము ఒక భవనాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని చూపుతుంది. ఇది బంగ్లాదేశ్ లో హిందువులపై దాడిని చూపుతుందని క్లెయిమ్ చేస్తూ కొంతమంది యూజర్స్ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.
ఈ వైరల్ వీడియో ఢాకాలోని పోలీస్ స్టేషన్ పై దాడిని చూపుతుందని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలిన తరువాత, జన సమూహము పోలీసు అధికారిపై దాడి చేసింది. ఆ వీడియో మతపరమైన వాదనలతో తప్పుగా షేర్ చేయబడింది.
వైరల్ పోస్ట్ లో ఏముంది?
ఆగస్ట్ 20, 2024 నాడు, ఫేస్బుక్ యూజర్ ‘రాం జానె’ (ఆర్కైవ్ లింక్) ఒక వీడియోను పోస్ట్ చేస్తూ ఇలా వ్రాశారు, “బంగ్లాదేశ్ లో హిందువులపై ఇటువంటి దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఛాందసవాదులచే హిందువులు ఇంకా దాడికి గురి అవుతున్నారు. క్రూరత్వం ఇంకా కొనసాగుతోంది మరియు హిందువులు పారిపోవటానికి ఇళ్ళ పైకప్పు మీది నుండి బలవంతంగా దూకవలసి వచ్చింది. #హిందువులనుకాపాడండి విజ్ఞప్తి”
దర్యాప్తు
వైరల్ వీడియో నుండి ముఖ్యమైన ఫ్రేమ్స్ తీసుకొని గూగుల్ లెన్స్ ఉపయోగించి సెర్చ్ చేశాము. ఈ వీడియోను ఆగస్ట్ 12, 2024 నాడు ఒనొన్నా యాసిన్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో ఆ సంఘటన గురించి లేదా దాని ప్రాంతము గురించి ఎలాంటి సమాచారము లేదు.
ఈ వీడియోలో, కొంతమంది ఒక బోర్డును చింపుతూ కనిపించారు. అక్కడి టెక్స్ట్ ను అనువదించిన తరువాత, అది ‘బంగ్లాదేశ్ పోలీస్’ అని వ్రాయబడిందని తెలిసింది.
పోలీసులపై దాడిని ఈ వీడియో చూపుతుందని యూట్యూబ్ ఛానల్స్ బిడి న్యూస్ 24 మరియు ఎఫ్‌కే వ్లోగ్స్ రిపోర్ట్ చేసింది.
“డిబి కార్యాలయము కూల్చివేయబడింది” అనే శీర్షికతో ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ ‘షాం ఆలం సాగర్’ పై కూడా ఆగస్ట్ 6, 2024 నాడు అప్లోడ్ చేయబడింది.
గూగుల్ మ్యాప్స్ పై సెర్చ్ చేసినప్పుడు ఆ ప్రాంతము కెరానిగంజ్, ఢాకా, బంగ్లాదేశ్ అని మేము గుర్తించాము.
మేము బంగ్లాదేశ్ యొక్క ప్రోబాష్ టైమ్స్ వార్తా సంపాదకుడు అరాఫత్ ను కలిశాము. షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిన తరువాత ఒక సమూహము కెరానిగంజ్, ఢాకాలోని పోలీస్ కార్యాలయముపై దాడి చేశారు మరియు ఈ వీడియో మతపరమైన కోణములో ఉద్దేశపూర్వకంగా షేర్ చేయబడిందని ఆయన ధృవీకరించారు.
మేము తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ను కూడా స్కాన్ చేశాము. యూజర్ నిర్దిష్ట భావజాలముచే ప్రభావితం అయినట్లు కనిపిస్తుంది.
హిందీలో ఈ వాస్తవ తనిఖీని చదువుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ముగింపు: షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిన తరువాత, దుండగులు ఢాకాలోని పోలీస్ కార్యాలయముపై దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో తప్పుదోవపట్టించే మతపరమైన క్లెయిమ్ తో షేర్ చేయబడింది.
- Claim Review : ఫేస్బుక్ యూజర్ రాం జానె
- Claimed By : Facebook user ‘Ram Jane’
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.