X
X

Fact Check: ప్రధాని మోడి పార్లమెంట్ పార్టీ సమావేశములో యూపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీపు తట్టడం గురించిన వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతున్న వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. ఎన్‎డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశము యొక్క పూర్తి వీడియోలో ప్రధాని మోడి ముఖ్యమంత్రి యోగి వీపు తట్టడం చూపుతుంది. సంఘటన యొక్క అసంపూర్ణ వీడియోను షేర్ చేయడం ద్వారా ఒక తప్పుదోవపట్టించే క్లెయిమ్ చేయబడుతోంది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). లోక్‎సభ ఎన్నికలు 2024లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలిచి కేంద్రములో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత, న్యూస్ 24 యొక్క ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడి పార్లమెంట్ భవనములో (సంవిధాన్ సదన్) ఎన్‎డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశములో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను నిర్లక్ష్యం చేశారు అనే క్లెయిమ్‎తో ఈ క్లిప్ షేర్ చేయబడుతోంది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతున్న వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. ఎన్‎డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశము యొక్క పూర్తి వీడియోలో ప్రధాని మోడి ముఖ్యమంత్రి యోగి వీపు తట్టడం చూపుతుంది. సంఘటన యొక్క అసంపూర్ణ వీడియోను షేర్ చేయడం ద్వారా ఒక తప్పుదోవపట్టించే క్లెయిమ్ చేయబడుతోంది.

ఏది వైరల్ అవుతోంది

జూన్ 9, 2024 నాడు ఫేస్‎బుక్ యూజర్ ఆదిత్య గుప్త (ఆర్కైవ్ లింక్) వీడియోను పోస్ట్ చేశారు మరియు ఇలా వ్యాఖ్యానించారు, “దేశములోని అతిపెద్ద రాష్ట్రము యొక్క ముఖ్యమంత్రి, యోగి గారిని ఖాతరు చేయడం అవసరమని కూడా మోడిగారు అనుకోలేదు. యోగి చేతులు జోడించి నిలబడ్డారు, ఎంత అహంకారము.”

దర్యాప్తు

News 24’ వైరల్ క్లెయిమ్ ను దర్యాప్తు చేయుటకు మేము ముందుగా వీడియో న్యూస్ కొరకు సెర్చ్ చేశాము. వైరల్ వీడియో న్యూస్ 24 యొక్క యూట్యూబ్ ఛానల్ పై జూన్ 7, 2024 నాడు, పార్లమెంట్ లో నరేంద్ర మోడిగారు యోగి ఆదిత్యనాథ్ ను నిర్లక్ష్యం చేశారా? యూపిలో ఓటమితో మోడి కోపంగా ఉన్నారా? అనే శీర్షికతో అప్లోడ్ చేయబడింది (ఆర్కైవ్ లింక్). 

తదనంతరం, ఈ కార్యక్రమము యొక్క మరొక వీడియో మాకు డిడి న్యూస్ యొక్క యూట్యూబ్ ఛానల్ పై లభించింది. ఇది కూడా జూన్ 7, 2024 నాడు అప్లోడ్ చేయబడింది. ఈ వీడియోలో, 1:50 నిమిషాల మార్క్ వద్ద, ముఖ్యమంత్రి యోగి ప్రధాని మోడికి స్వాగతం పలకటానికి వెళ్ళినప్పుడు ఆయన యోగిగారి వీపు తట్టడం స్పష్టంగా ఉంది.

ప్రధాని మోడి ముఖ్యమంత్రి యోగి వీపు తట్టడం జీ బీహార్ జార్ఖండ్ మరియు టైమ్స్ నౌ నవభారత్ యొక్క యూట్యూబ్ ఛానల్స్ పై కూడా చూడవచ్చు.

జూన్ 7, 2024 దైనిక్ జాగరణ్ యొక్క వెబ్సైట్ పై ప్రచురించబడిన వార్త ప్రకారము, ఎన్‎డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశములో నేతలు అందరు ప్రధానిని అభినందించారు. యూపి ముఖ్యమంత్రి నరేంద్ర మోడి గారిని అభినందించినప్పుడు, ఆయన యోగిగారి వీపు తట్టారు అని ఏఎన్‎ఐను ప్రస్తావించిన ఒక నివేదిక పేర్కొనింది. 

PM Modi and CM Yogi in NDA Meeting in Parliament

యూపి బీజేపి విలేఖరి అవినాష్ త్యాగి కూడా ఈ వైరల్ క్లెయిమ్ ను ఖండించారు మరియు ప్రధాని ముఖ్యమంత్రి యోగిగారి వీపు తట్టారు అని చెప్పారు.

తప్పుదోవపట్టించే క్లెయిమ్ ను షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్‎బుక్ ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము. బడౌన్ లో నివాసం ఉండే ఈ యూజర్ ఒక రాజకీయ పార్టీచే ప్రభావితం అయ్యారు.

ముగింపు: లోక్ సభ ఎన్నికల తరువాత, పార్లమెంట్ భవనములో ఎన్‎డిఏ పార్లమెంటరీ పార్టీ సమావేశము జరిగింది. అక్కడ ప్రధాని మోడి యూపి ముఖ్యమంత్రి యోగిగారి వీపు తట్టారు. ఈ సంఘటన యొక్క అసంపూర్ణ వీడియోను షేర్ చేస్తూ ఒక తప్పుదోవపట్టించే క్లెయిమ్ చేయబడింది.

  • Claim Review :  ప్రధాని మోడి అహంకారముతో ముఖ్యమంత్రి యోగిగారిని నిర్లక్ష్యం చేశారు.
  • Claimed By : ఫేస్‎బుక్ యూజర్ ఆదిత్య గుప్త
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later