వాస్తవ తనిఖీ: స్వామీ యోగానంద యొక్క వీడియో స్వామీ వివేకానంద పేరున షేర్ చేయబడింది; వైరల్ క్లెయిమ్ అసత్యము

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై ఒక 11-క్షణాల వీడియో క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ఒక వ్యక్తి రోడ్డు వెంబడి కొంతమందితో కలిసి నడుస్తూ వెళ్ళడం చూడవచ్చు. సోషల్ మీడియా పై కొంతమంది యూజర్లు ఈ వీడియోను స్వామీ వివేకానంద యొక్క అరుదైన వీడియోగా వైరల్ చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో, ఈ క్లెయిమ్ తప్పు అని నిరూపించబడింది. వీడియోలో ఉన్న వ్యక్తి స్వామీ యోగానంద, స్వామీ వివేకానంద కాదు.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ మధుసూదన్ బొజ్జ ఈ వీడియో క్లిప్పింగ్ ను ఏప్రిల్ 13 నాడు పోస్ట్ చేసి ఇలా వ్రాశారు: Rare స్వామీ వివేకానంద యొక్క అరుదైన వీడియో.

ఇతర యూజర్లు కూడా ఈ వైరల్ వీడియో స్వామీ వివేకానందకు చెందినది అని అనుకుంటూ షేర్ చేస్తున్నారు. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు:

విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలించింది. ఈ వీడియో చూసిన తరువాత, అక్కడ కనిపించే వ్యక్తి స్వామీ వివేకానంద కాదని అర్థం అయ్యింది. వీడియో క్లిప్పింగ్ లో, మాకు mirc@scedu అని కనిపించింది. దీని ఆధారంగా, మేము గూగుల్ ఓపెన్ సెర్చ్ లో కీవర్డ్స్ సృష్టించి సెర్చ్ చేశాము, తద్వారా మేము దక్షిణ కరోలిన విశ్వవిద్యాలయము యొక్క వెబ్సైట్ కు చేరుకున్నాము.

ఇక్కడ ఆన్లైన్ సేకరణలో మాకు అనేక అరుదైన వీడియోలు, ఫోటోలు మరియు దస్తావేజులు కనిపించాయి. ఇక్కడే మాకు అసలైన వీడియో కూడా కనిపించింది. ఇది స్వామీ యోగానందకు ఆపాదించబడిన 48-క్షణాల ఒక వీడియో . ఈ వీడియోలో, మాకు స్వామి వివేకానంద పేరున షేర్ చేయబడిన వైరల్ క్లిప్పింగ్ కూడా కనిపించింది. ఇంతవరకు జరిగిన దర్యాప్తులో అసలైన వీడియోలో కనిపించే వ్యక్తి స్వామీ యోగానంద అని నిర్ధారించబడింది. స్వామీజి న్యూయార్క్ వీధులలో నడుస్తున్నారు అని వీడియోలో చెప్పబడింది.

మరింత దర్యాప్తు నిర్వహించుటకు విశ్వాస్ న్యూస్ పశ్చిమ బెంగాల్ లోని రామకృష్ణ పరమహంస మఠాన్ని సంప్రదించింది. వాళ్ళు కూడా వైరల్ వీడియోలో కనిపించే వ్యక్తి స్వామీ వివేకానంద కాదని, ఆయన స్వామీ యోగానంద పరమహంస అని ధృవీకరించారు.

చివరిగా, ఫేస్‎బుక్ యూజర్ మధుసూదన్ బొజ్జ గురించి విచారించాము. ఆయన స్వామీ వివేకానంద పేరున క్లిప్పింగ్ ను వైరల్ చేశారు. ఈ యూజర్ కు 4,000 పైగా ఫేస్‎బుక్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఖాతా నవంబరు 2008లో సృష్టించబడింది. యూజర్ హైదరాబాదు నివాసి.

ముగింపు: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేది అని కనుగొనింది. స్వామి యోగానంద యొక్క వీడియో స్వామీ వివేకానంద పేరున వైరల్ చేయబడింది.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు