కొత్త ఢిల్లీ, విశ్వాస్ న్యూస్: ఎన్నికల డ్యూటీపై ఉన్న ప్రభుత్వ అధికారులు పోస్టల్ బ్యాలట్స్ ఉపయోగించి వోట్ చేయలేరు అని సూచించే ఒక క్లెయిమ్ సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది. ఈ మెసేజ్ ముందుగా వాట్సాప్ వంటి క్లోస్డ్ మెసేజింగ్ ప్లాట్ఫార్మ్స్ పై షెర్ చేయబడింది. ధృవీకరణ కోసం మా రీడర్స్ లో ఒకరు చాట్‌బోట్ ద్వారా విశ్వాస్ న్యూస్ ను సంప్రదించారు.
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఇది నకిలీది అని కనుగొనింది. ఎన్నికల డ్యూటీపై ఉన్న అధికారులు తమ వోటును నియమిత వోటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద పోస్టల్ బాలెట్ ద్వారా వేయవచ్చు అని పేర్కొంటూ ఎన్నికల కమిషన్ ఈ క్లెయిమ్ ను ఖండించింది.
విశ్వాస్ న్యూస్ చాట్‌బోట్ నంబరు +91 95992 99372 పై ఒక యూజర్ వాట్సాప్ యొక్క ఒక స్క్రీన్‌షాట్ ను షేర్ చేశారు. ఇందులో సందేశము ఇలా ఉంది “ఇప్పుడు ఏ ప్రభుత్వ అధికారి పోస్టల్ బాలెట్ ద్వారా తన వోటును వేయలేరు”.
ఈ పోస్ట్ ను ధృవీకరించుటకు, మేము వైరల్ పోస్ట్ నుండి వచనాన్ని తీసుకొనుటకు గూగుల్ లెన్స్ ను ఉపయోగించాము మరియు గూగుల్ ఓపెన్ సెర్చ్ ఉపయోగించి సెర్చ్ చేశాము. దీని ద్వారా మేము ఎన్నికల కమిషన్ క్లెయిమ్ ను ఖండించిన అధికారిక ఫేస్బుక్ పోస్ట్ ను చేరుకున్నాము.
అదనంగా, డీబంక్డ్ పోస్ట్ ఎన్నికల కమిషన్ యొక్క అధికారిక X (ఇదివరకు ట్విట్టర్) హ్యాండిల్ పై కూడా లభించింది మరియు ఇది DD News లైవ్ ద్వారా ఫేస్బుక్ పై షేర్ చేయబడింది.
మేము అనుజ్ చందక్, జాయింట్ డైరెక్టర్, భారత ఎన్నికల సంఘం, ను కలిశాము. వైరల్ పోస్ట్ అసత్యము అని ఈయన ధృవీకరించాము.
పోస్టల్ బాలెట్ అంటే ఏమిటి:
ఒక పోస్టల్ బాలెట్ ఉద్యోగ బాధ్యతల కారణంగా తమ నియోజకవర్గములో వ్యక్తిగతంగా వోటు వేయలేని వారు మెయిల్ ద్వారా వోటు వేసే అవకాశాన్ని కలిగిస్తుంది.
లోక్‌సభ ఎన్నికలు (లోక్‌సభ ఎన్నికలు 2024) 2024. ఏప్రిల్ 19, 2024 మొదలుకొని ఏడు దశలలో షెడ్యూల్ చేయబడ్డాయి మరియు జూన్ 4, 2024 నాడు ఫలితాలు ప్రకటించబడతాయి.
ముగింపు: వైరల్ క్లెయిమ్ అసత్యమని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వెల్లడి అయ్యింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు నియమిత వోటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ వద్ద తమ వోటును పోస్టల్ బాలెట్స్ ద్వారా వేసే అవకాశం ఉందని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923