వాస్తవ తనిఖీ: గుండె నొప్పి వచ్చిన సమయములో ‘దగ్గు సిపిఆర్’ ప్రభావవంతమైన నివారణ కాదు, వైరల్ అయిన సందేశము నకిలీది

అకస్మాత్ అత్యవసరం ఏర్పడిన వారిలో దీనిని ఫేస్‎బుక్ పోస్ట్ లు సిఫారసు చేస్తున్నప్పటికీ, ‘గుండెపోటు’ వచ్చిన రోగులలో ‘దగ్గు సిపిఆర్” సహాయపడదు, అని వైద్యులు చెప్తున్నారు.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): గుండె నొప్పి వచ్చినప్పుడు ఆ వ్యక్తి స్పృహలో ఉండేందుకు దగ్గు సిపిఆర్ (కార్డియోపల్మనరీ రిససిటేషన్) సహాయం చేస్తుంది అనే ఒక పోస్ట్ సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది.

తన దర్యాప్తులో, విశ్వాస్ న్యూస్ కు, ‘దగ్గు సిపిఆర్’ కు మద్ధతుగా ఎలాంటి వైద్యపరమైన రుజువు లభించలేదు, అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు గుండె నొప్పి వచ్చింది అని మీకు అనిపిస్తే తీవ్రంగా దగ్గడం ద్వారా మీకు మీరే సహాయం చేసుకోవచ్చు. నిపుణుల ప్రకారం ‘దగ్గు సిపిఆర్’ గుండె పోటును నివారించలేదు.

క్లెయిమ్

ఫేస్‎బుక్ యూజర్ నజీర్ తరీన్ సోషల్ మీడియా పై ఒక వైరల్ పోస్ట్ ను షేర్ చేసి ఇలా వ్రాశారు, ‘దగ్గు సిపిఆర్ అనేది ఒక రకమైన స్వీయ సిపిఆర్. దగ్గు వలన ఇంట్రాథొరాసిక్ ఒత్తిడి పెరుగుతుంది మరియు రక్తాన్ని గుండె నుండి బృహద్దమనిలోకి పంపుతుంది. సిద్ధాంతపరంగా, గుండె పోటు వచ్చినప్పుడు దగ్గుతూ ఉంటే ఎవరైనా స్పృహలో ఉండవచ్చు (గుండెపోటు కాకుండా గుండె నొప్పి – అన్ని గుండె నొప్పులు గుండెపోటు కలిగించవు).”

పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

క్లెయిమ్ యొక్క యథార్థతను పరీక్షించుటకు విశ్వాస్ న్యూస్ సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ పై సెర్చ్ చేసింది మరియు ఫేస్‎బుక్ పై ఇటువంటి క్లెయిమ్స్ చాలా వైరల్ అయి ఉండడం గమనించింది.

ఈ సమస్యపై స్పష్టీకరణ కోసం మేము అనేక ఆరోగ్య పరిశోధన వ్యాసాలను సమీక్షించాము. కాని, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు గుండె నొప్పి వచ్చింది అని మీకు అనిపిస్తే తీవ్రంగా దగ్గడం ద్వారా మీకు మీరే సహాయం చేసుకోవచ్చు అని సూచించే ‘దగ్గు సిపిఆర్’ కు మద్ధతుగా ఎలాంటి వైద్యపరమైన రుజువు మాకు లభించలేదు..

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా ఇంటర్నెట్ పై విస్తృతంగా ప్రచురించబడుతున్న విధానమైన ‘దగ్గు సిపిఆర్’ ను ఆమోదించదు.

దగ్గు సిపిఆర్ పై రిససిటేషన్ కౌన్సిల్, యూకే యొక్క ప్రకటన, “సరికాని “సలహా’ బహుశా అకస్మాత్ గుండె నొప్పి వచ్చినప్పటికీ, ‘దగ్గు సిపిఆర్’ అని పిలువబడే తీవ్రంగా దగ్గడం ద్వారా హృదయస్పందనను, తద్వారా ప్రసరణను నిలిపి ఉంచగలిగిన కొంత మంది ప్రచురించబడిన కేస్ రిపోర్ట్స్ పై ఆధారపడి ఉంటుంది”.

సైన్స్ అండ్ సొసైటి కొరకు మెక్‎గిల్ విశ్వవిద్యాలయ కార్యాలయము వ్యాసము, “ఇది అర్ధంలేని ఒక ఆలోచన ఎందుకంటే సిపిఆర్ అనేది నాడి కొట్టుకోని స్పృహకోల్పోయిన వ్యక్తిపై మాత్రమే నిర్వహించబడాలి. మీరు స్పృహలో ఉండి దగ్గగలిగినప్పుడు, మీరు సిపిఆర్ నిర్వహించకూడదు.

బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ వ్యాసము ఇలా పేర్కొనింది, “మీరు కాని ఇతరులు ఎవరైనా కాని గుండె నొప్పితో బాధపడుతున్నారు అని మీరు అనుకుంటే, మొదటి ప్రాధాన్యత ఒక ఆంబులెన్స్ ను పిలవడం అవుతుంది”.

ప్రాథమిక సమాచారం కొరకు మేము డా. ముఖేష్ గోయల్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియోవాస్క్యులార్ సర్జరీ, అపోలో ఆసుపత్రి, ఢిల్లీ, ని సంప్రదించాము, ఆయన ఇలా వివరించారు, “ఇది తప్పు సమాచారము. గుండె నొప్పి (మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్) అనేది గుండెలోని ధమనులలో ఒకదానిలో రక్తము గడ్డకట్టుకొనడము వలన ఒక భాగానికి రక్తం సరఫరాలో అవాంతరం ఏర్పడినప్పుడు ఏర్పడే ఒక పరిస్థితి. తరువాతి 15 నుండి 30 నిమిషాలలో రక్తం సరఫరా పునరుద్ధరించబడకపోతే, ఆ ప్రదేశములోని గుండె కండరాలు నిర్జీవం కావడం ప్రారంభిస్తాయి. ఎవరైనా తనకు గుండె నొప్పి వచ్చింది అని అనుమానిస్తే, అతను ప్రశాంతంగా పడుకొని సమీపములో ఉన్నవారికి వైద్య సహాయము కొరకు కాల్ చేయాలి”.

“గుండెపోటు అనేది గుండె పంప్ చేయనప్పుడు ఏర్పడే స్థితి మరియు కొన్ని క్షణాలలో ఆ వ్యక్తి స్పృహకోల్పోతారు. అయన చుట్టూ ఉండే వారు ఆ పరిస్థితిని గుర్తించాలి, సిపిఆర్ ప్రారంభించాలి (ఒకవేళ వారికి తెలిసి ఉంటే మరియు శిక్షణ తీసుకొని ఉంటే) మరియు వైద్య సహాయము కొరకు కాల్ చేయాలి. అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె నొప్పి లేదా మరొక కారణంగా గుండె రక్తాన్ని సాధారణంగా పంప్ చేయలేనందువలన ఊపిరితిత్తులు ద్రవాలతో నిండిపోతాయి. అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ తో బాధపడే వ్యక్తికి ఊపిరితీసుకోవడములో ఇబ్బంది, చమటలు మరియు అసౌకర్యము ఉంటాయి. అతను గట్టిగా మరియు వేగంగా ఊపిరి తీసుకుంటాడు మరియు ఊపిరితిత్తులలో నిండిన ద్రవాల కారణంగా దగ్గుతారు. అతనికి తక్షణ వైద్య సహాయం మరియు బైపాప్ లేదా వెంటిలేటర్ ద్వారా శ్వాసకోశ సహకారం అవసరం ఉంటుంది.”

డా. రాజీవ్ జయదేవన్, వైస్ చెయిర్మన్, పరిశోధన విభాగము, ఐఎంఏ కేరళ ఇలా అన్నారు, “’దగ్గు సిపిఆర్’ సందేశము ఎందుకు నకిలీది అనేది నేను వివరిస్తాను. ఎవరికైనా కార్డియాక్ అరెస్ట్ ఉంటే, వాళ్ళు స్పృహలో ఉండరు. అప్పుడు వారికి దగ్గాలి అని ఎలా గుర్తుచేసుకుంటారు? డ్రైవింగ్ సమయములో గుండె నొప్పి వస్తే మనం చేయవలసిన సరైన పని ఏమిటి అంటే, చేతనైతే ఆసుపత్రికి డ్రైవ్ చేసుకొని వెళ్ళడం. ఇటువంటి పరిస్థితులలో ‘దగ్గడం’ అనేది ఉపయోగం లేనిది. ఛాతిలో నొప్పి అంటే గుండె నొప్పి కావచ్చు, ఇది కార్డియాక్ అరెస్ట్ వంటిది కాదు. గుండె నొప్పిలో పంప్ ఇంకా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి స్పృహలో ఉంటారు. కార్డియాక్ అరెస్ట్ అనేది భిన్నమైనది మరియు గుండె పూర్తిగా నిలిచిపోయినప్పుడు సంభవిస్తుంది. ఇది గుర్తుంచుకోండి: గుండె నొప్పి – స్పృహ ఉంటుంది, కార్డియాక్ అరెస్ట్ – స్పృహ ఉండదు”.

అయినప్పటికీ, అత్యవసర పరిస్థితిలో మీ వైద్యుడిని సంప్రదించి అతని/ఆమె సలహాను పొందాలని సూచించబడుతుంది. ముఖ్యంగా, వరల్డ్ హార్ట్ డే అనేది ప్రతి సెప్టెంబరు 29 నాడు వచ్చే ఒక విశ్వవ్యాప్త సంఘటన.

సోషల్ స్కాన్ చేయడము వలన, మేము ఈ వైరల్ క్లెయిమ్ ను షేర్ చేసిన ఫేస్‎బుక్ యూజర్ ముల్తాన్ లో నివసిస్తారని మరియు సొషల్ మీడియా యాప్ పై 168 మంది ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము.  

निष्कर्ष: అకస్మాత్ అత్యవసరం ఏర్పడిన వారిలో దీనిని ఫేస్‎బుక్ పోస్ట్ లు సిఫారసు చేస్తున్నప్పటికీ, ‘గుండెపోటు’ వచ్చిన రోగులలో ‘దగ్గు సిపిఆర్” సహాయపడదు, అని వైద్యులు చెప్తున్నారు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు