కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాపై ఒక వీడియో వైరల్ అవుతోంది, ఇందులో ఒక బీడు భూమిలో ఒక నీటి ప్రవాహం ఉండడం మరియు ప్రజలు దానికి పూజలు చేయడం కనిపిస్తుంది. ఇది దక్షిణ భారతదేశములో ఉన్న ఒక నది అని, ఇది ప్రతి సంవత్సరం పితృ పక్షాలలో కనిపిస్తుందని మరియు దీపావళి నాటికి ఎండిపోతుందని ఈ పోస్ట్ లో క్లెయిమ్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఇది అద్భుతమైన నది కాదని కనుగొనింది. ఈ వైరల్ క్లెయిమ్ నకిలీది.
పరీక్షించవలసిన ఈ వీడియోను విశ్వాస్ న్యూస్ తన టిప్‌లైన్ చాట్‌బోట్ +95992 99372 పై అందుకుంది, దీని వెంట ఈ క్యప్షన్ ఉంది: “అనువదించబడింది: దక్షిణ భారతదేశములోని ఈ నది పితృపక్షాలలో పాడ్యమి నాడు కనిపిస్తుంది మరియు దీపావళి మరుసటి పాడ్యమి రోజున అదృశ్యం అవుతుంది. ఈ నది కేవలం ఒక నెల రోజులు మాత్రమే కనిపిస్తుంది, తరువాత ప్రకృతిలో కలిసిపోతుంది – ఇది ప్రకృతి యొక్క అద్భుతం కదూ!
ఇదే క్లెయిమ్ తో ఈ వీడియో Facebook పై కూడా వైరల్ అయ్యింది. ఈ పోస్ట్స్ కు ఆర్కైవ్ లింక్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఈ వీడియో యొక్క స్క్రీన్ గ్రాబ్స్ ను మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ పై సెర్చ్ చేశాము. ఈ వీడియో 2017 లో బి ప్రభు అనే ప్రున ఉన్న యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిందని మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, “కావేరి నీరు తమిళనాడులోని మాయవరం జిల్లాకు చేరుకున్నాయి” అని ఉంది.
హిందు ప్యాడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై 2017లో అప్లోడ్ చేయబడిన ఇదే వీడియోను మేము చూశాము. ఈ వీడియో వెంబడి క్యాప్షన్ ఇలా ఉంది “కావేరి నది తమిళనాడులోని మాయవరం గ్రామానికి ఎలా చేరుకుంటుందో చూడండి. కావేరి మాత దీవెనలు”.
కావేరి మహా పుష్కరం అని ఈ వీడియో వెంబడి ఉన్న వివరణలో చాలాచోట్ల పేర్కొనబడింది. కావేరి మహా పుష్కరం అనేది కావేరి నదికి చెందిన వేడుక ఇది సాధారణంగా 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2017లో జరిగిన ఈ వేడుక గురించి మరింత సమాచారం వ్యాసము లో చదవవచ్చు.
సెర్చ్ చేసిన తరువాత, మాయవరాన్ని మయిలాదుథురై అని కూడా అంటారని మాకు తెలిసింది.
మహా పుష్కరం,కావేరి నది, మాయవరం మరియు మయిలాదుథురై వంటి కీవర్డ్స్ తో సెర్చ్ చేసిన తరువాత, మాకు deccan chronicle పై సెప్టెంబరు 10, 2017 నాటి ఒక వార్తా నివేదిక లభించింది. ఇందులో “కావేరి నదికి తిరిగి నీటిని నింపటానికి కల్లనై డ్యాం నుండి నీటిని విడుదల చేస్తారని ఎదురుచూస్తూ మరియు వరుణదేవుడిని ప్రార్థిస్తూ, కావేరి పుష్కరం 2017 నిర్వాహకులు మయిలాదుథురైలో భక్తులు కనీసం నీటిని తీసుకొని తలపై చల్లుకునేందుకు వీలుగా ఒక స్నానాల ఘాట్ ను నిర్మించారు. అలాగే, నిర్వాహకులు ఈ వేడుకకు సెప్టెంబరు 12 – 24 వరకు అయిదు లక్షలమంది భక్తులు వస్తారని ఆశిస్తున్నారు.”
సెప్టెంబరు 19, 2017 నాటి The Hindu లోని ఒక నివేదిక ప్రకారము, మహా పుష్కరం కొరకు మెట్టూర్ డ్యాం నుండి నీరు విడుదల చేయబడింది.
ధృవీకరణ కోసం మయిలాదుథురై వద్ద ఉన్న మయూర్‌నాథర్ దేవాలయానికి కాల్ చేశాము, అక్కడ మహా పుష్కరం అనేది 12 సంవత్సరాల కుంభ్ అని, ఈ సమయములో కావేరి నదిలో మునగడము ఎంతో పవిత్రంగా పరిగణించబడుతుందని, మహా పుష్కరం 2017 కోసం మెట్టూర్ డ్యాం నుండి విడుదల చేయబడిందని, అది మాయవరం చేరుకుందని మాకు చెప్పారు. ఈ వీడియోను మేము దేవాలయ మేనేజర్ కిశోర్ ఉన్లి గారికి షేర్ చేశాము. ఆయన ఈ వీడియో మయిలాదుథురై కు చెందినదా కాదా అని చెప్పలేనని, దక్షిణ భారతదేశములో ప్రతి సంవత్సరం ఒక నెలరోజులు కనిపించి అదృశ్యం అయ్యే ఇటువంటి అద్భుతమైన నది ఏది లేదనేది వాస్తవమని ఆయన చెప్పారు.
మేము తమిళనాడు వార్తాపత్రిక దినమలార్ లో సీనియర్ విలేఖరి అయిన ఎంఎస్ దండపాణి గారిని ఈ సందర్భంగా సంప్రదించాము. ఆయన “ఇది ఒక అద్భుతం కాదు. మెట్టూర్ డ్యాం నుండి నీరు విడుదల చేయబడితే, అది తమిళనాడుకు వస్తుంది. ఇందులో సంవత్సరములో కేవలం ఒక నెల మాత్రమే కనిపించే ఎలాంటి వింత లేదు.” అని అన్నారు.
ది హిందూ యొక్క తమిళనాడు విలేఖరి రమ్య కన్నన్ ఇలా అన్నారు, “దీనిలో ఎలాంటి అద్భుతం లేదు. అధిక ప్రవాహం లేదా మరే కారణం చేత అయినా కర్నాటక నుండి కావేరీ నీరు విడుదల చేయబడితే, అది తమిళనాడుకు చేరుకుంటుంది. ఇది ఇంచుమించు ప్రతి సంవత్సరం జరుగుతుంది”.
అలాగే మేము జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను కూడా ఈ విషయమై సంప్రదించాము. మా మెయిల్ కు స్పందిస్తూ, జియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి నిపుణులు ఇలా అన్నారు, “వైరల్ పోస్ట్ లో ఇవ్వబడిన సమాచారము తప్పు. ఒక నది శూన్యములో నుండి పుట్టింది అనే ఇటువంటి సహజ ప్రక్రియ ఏది లేదు. ఇది డ్యాం నుండి నీరు విడుదల చేసినప్పుడు మాత్రమే జరుగుతుంది. వైరల్ వీడియోలో కనిపించే సంఘటన కూడా ఇటువంటి డ్యాం నుండి విడుదల చేయబడిన నీరే.”
ఈ వీడియోను శివం తివారి అనే పేరున ఉన్న ఫేస్బుక్ పేజ్ ద్వారా షేర్ చేయబడింది. ఈ పేజ్ కు 1.5కే ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: తన దర్యాప్తులో ఇలాంటి అద్భుతమైన నది ఏది లేదు అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923