కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్)। మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్, తెలంగాణ మరియు మిజోరాంలలో జరగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యములో సోషల్ మీడియా యూజర్లు ఎన్డిటీవి చేసినట్లుగా ఆరోపించబడుతున్న పోల్ ఆఫ్ ది పోల్స్ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ లభించనుంది అని క్లెయిమ్ చేయబడుతోంది. సోషల్ మీడియా యొక్క వేరు వేరు ప్లాట్ఫార్మ్స్ పై అనేకమంది యూజర్లు ఈ పోల్ వంటి క్లెయిమ్ తో పాటు షేర్ చేశారు.
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ క్లెయిమ్ తప్పు అని కనుగొనింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 కు సంబంధించి ఎన్డిటీవి ఎక్కడా పోల్ ఆఫ్ ది పోల్స్ నిర్వహించలేదు.
సోషల్ మీడియా యూజర్ ‘అష్ఫక్ జోయియా’ వైరల్ పోస్ట్ (ఆర్కైవ్ लिंक) షేర్ చేస్తూ ఇలా వ్రాశారు, “BREAKING NOW – NDTV Poll of Polls gives Majority to Congress in TELANGANA” Most Opinion Polls are predicting that in Telangana, BRS is staring at their biggest defeat due to huge anti-incumbency against KCR govt.”
మహారాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ తో కలిసి అనేక ఇతర ఎక్స్ హ్యాండిల్ (ఆర్కైవ్ లింక్) తరఫున ఈ పోల్ ను షేర్ చేశారు.
మిజోరాం, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు తెలంగాణలతో కలిసి అయిదు రాష్ట్రాలలో నవంబరు ఏడు నుండి నవంబరు 30 మధ్యలో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నవంబరు 30, 2023 న ఎన్నికలు జరుగుతాయి.
న్యూస్ रिपोर्ट ప్రకారము, ఎన్నికల సంఘం సూచనల ప్రకారం 30 నవంబరు వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం విధించింది. నవంబరు ఏడవ తేదీ ఉదయం ఏడు గంటల నుండి నవంబరు 30 సాయంత్రం 6.30 వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయకూడదు.
సోషల్ మీడియా సెర్చ్ లో మాకు ఎన్డిటీవి ఎక్స్ హ్యాండిల్ పై చేయబడిన ఒక పోస్ట్ లభించింది, ఇందులో వైరల్ అయిన పోల్ ఆఫ్ ది పోల్స్ ఖండించబడ్డాయి. పోస్ట్ లో ఇవ్వబడిన సమాచారము ప్రకారం, “తెలంగాణ 2023 ఎన్నికలను పురస్కరించుకొని ఎన్డిటీవి ఎలాంటి పోల్ ఆఫ్ ది పోల్స్ ప్రసారం చేయలేదు. దయచేసి ఎలాంటి నకిలీ వార్తలను వ్యాప్తి చేయకండి”
ఎన్డిటీవి పేరున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని ప్రసారం చేయబడినట్లుగా చెప్పబడుతున్న పోల్ ఆఫ్ ది పోల్స్ అసత్యము అని మా విచారణలో స్పష్టం అయ్యింది. వైరల్ పోల్ కు సంబంధించి మేము ఎన్డిటీవి యొక్క సీనియర్ విలేఖరిని సంప్రదించాము. ఆయన ఎన్డిటీవి తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ పై దీనిని అసత్యము అని తెలిపిందని ఆయన ధృవీకరించారు.
మిజోరాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి, తెలంగాణలో నవంబరు 30 న ఎన్నికలు జరుగుతాయి, వీటి ఫలితాలు డిసెంబరు 3న వెలువడతాయి.
వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ ను ఎక్స్ పై సుమారు 24 వేలమంది ఫాలో చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లతో సహా అయిదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల సందర్భములో సోషల్ మీడియా పై ఎన్నికల తప్పుడు-సమాచారం విచక్షణారహితంగా షేర్ చేయబడుతోంది. వీటి ఫ్యాక్ట్ చెక్ రిపోర్ట్స్ ను విశ్వాస్ న్యూస్ వెబ్సైట్ యొక్క ఎన్నికల తనిఖీ సెక్షన్ లో చదవవచ్చు.
ముగింపు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు గురించిన క్లెయిమ్ తో ఎన్డిటీవి పేరున వైరల్ అవుతున్న పోల్ ఆఫ్ ది పోల్స్ నకిలీవి. ఎన్డిటీవి వారు ఇటువంటి పోల్ ఆఫ్ ది పోల్స్ నిర్వహించలేదు. తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి, వీటి ఫలితాలు డిసెంబరు 3న వెలువడుతాయి.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923