Fact Check: ముందునుండి వెళ్ళమని ప్రధాని మోడి ముఖ్యమంత్రి యోగికి మర్యాదగా సైగచేశారు, వైరల్ క్లెయిమ్ అసత్యము

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యములో, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక కుర్చీలో కూర్చోవాలని ప్రయత్నించినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆయనను తోసారు అని ఆరోపిస్తూ ఒక ర్యాలీ నుండి తీసిన వీడియో ఒకటి బయటపడింది. ఇటువంటి క్లెయిమ్స్ తో ఈ వీడియో, విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది.

విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ వీడియోను పరీక్షించింది మరియు ఈ క్లెయిమ్స్ పూర్తిగా నిరాధారమైనది అని కనుగొనింది. ప్రస్తావనలో ఉన్న వీడియో పిలిభిట్, ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ నుండి తీసుకోబడింది. మార్చ్ 9 నాడు జరిగిన ర్యాలీలో, ప్రధాని మోడి ముందు నుండి వేదికపైకి వెళ్ళటానికి బదులు, ముఖ్యమంత్రి యోగి తన కుర్చీని తీసిన తరువాత వెనుక నుండి వెళ్ళే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడి ముందు నుండి వెళ్ళమని ఆయనకు సైగ చేశారు, కాని కొంతమంది వ్యక్తులు ఈ వీడియోను అసత్యపు క్లెయిమ్స్ తో సోషల్ మీడియాపై షేర్ చేస్తూ తప్పు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

ఏది వైరల్ అవుతోంది?

 ఫేస్‎బుక్ యూజర్ మనోజ్ యాదవ్  ఏప్రిల్ 9 నాడు ఒక వీడియోను పోస్ట్ చేస్తూ, ఇలా ఆరోపించారు, “బాబాకు జరిగిన ఈ అవమానం దుష్ప్రవర్తనకు పరాకాష్ట. బాబాకు జరిగిన ఈ అవమానం ఇకపై సాగదు. హిందుస్తాన్ మోడిని బహిష్కరిస్తుంది, ఉత్తర్ ప్రదేశ్.” ఈ పోట్ లో ఇలా క్లెయిమ్ చేయబడింది “పిలిభిట్ లో జరిగిన ఒక బహిరంగ సభలో వేదికపై, మోడిగారు చాలా కోపంగా, దురుసుగా మరియు అసంబద్ధంగా ఒక కుర్చీ లాక్కుని కూర్చున్నారు. యోగి గారు పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు, ఆయనను తోసివేశారు. ఇది ఖండించదగినది మరియు అవమానకరమైనది, మేము దీనిని ఖండిస్తున్నాము.”

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ జాగ్రత్తగా ఈ వైరల్ వీడియోను విశ్లేషించింది మరియు న్యూస్ 24 న్యూస్ ఛానల్ యొక్క లోగోను గుర్తించింది. దీని ద్వారా మేము ఏప్రిల్ 9 నాడు ఛానల్ యొక్క యూట్యూబ్ అకౌంట్ పై అప్లోడ్ చేయబడిన అసలైన వీడియోను కనుగొన్నాము. ప్రధాని మోడి కేవలం ముఖ్యమంత్రి యోగిని వెనుక నుండి వెళ్ళకుండా ముందువైపు నుండి వెళ్ళమని సైగ చేశారు అని ఈ వీడియో స్పష్టం చేసింది.

తదుపరి దర్యాప్తులో మేము దైనిక్ జాగరణ్ యొక్క ఈ-పేపర్ ను సెర్చ్ చేశాము. ఇందులో వైరల్ వీడియోపై ఒక నివేదిక ఉంది. ఈ వార్త ఈ విధంగా పేర్కొనింది, “ప్రధానమంత్రి నరేంద్ర మోడి యొక్క వినయం మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యొక్క మర్యాద ప్రజల హృదయాలను గెలుచుకుంది”. ఇందులో ముఖ్యమంత్రి యోగిని పోడియం వైపుకు కుర్చీల ముందు నుండి వెళ్ళమని ప్రధాని మోడి సైగ చేసిన సంఘటన వివరించబడింది. ఈ సంఘటన చప్పట్లతో అభినందించబడింది.

ఈ వీడియో యొక్క సుదీర్ఘ వర్షన్ బిజేపి యొక్క యూట్యూబ్ ఛానల్ పై కనిపించింది. దీనిని ఏప్రిల్ 9 న అప్లోడ్ చేశారు. వీడియోలో సుమారు 3:30 నిమిషాల వద్ద, ముఖ్యమంత్రి యోగి పోడియం వద్దకు తన కుర్చీని నెట్టి వెనక నుండి వెళ్ళే ప్రయత్నం చేశారు. ప్రధాని అప్పుడు ముందు నుండి వెళ్ళమని ఆయనకు సైగ చేశారు.

విశ్వాస్ న్యూస్ ముఖ్యమంత్రి యోగి యొక్క మీడియా సలహాదారుడు మృత్యుంజయ కుమార్ ను కూడా కలిసింది, వైరల్ వీడియోలో చేయబడిన క్లెయిమ్స్ పూర్తిగా అసత్యాలు అని ఆయన ధృవీకరించారు.

నకిలీ క్లెయిమ్స్ ను పోస్ట్ చేసిన యూజర్ యొక్క సోషల్ స్కానింగ్ లో ఈ ఫేస్‎బుక్ యూజర్ మనోజ్ యాదవ్ ఒక రాజకీయ పార్టీకి సంబంధం ఉన్నవాడని మరియు ఖాతాను మార్చ్ 2013లో సృష్టించాడని వెల్లడి అయ్యింది.

ముగింపు ప్రధాని మోడి మరియు ముఖ్యమంత్రి యోగికి సంబంధించిన వైరల్ పోస్ట్ అసత్యము అని తెలుపుతూ విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తు ముగిసింది. ముఖ్యమంత్రి యోగి ప్రధాని మోడి ముందు నుండి వెళ్ళకుండా వెనుక నుండి వెళ్ళాలని చేసిన ప్రయత్నం, ఆయనపై ఉన్న గౌరవముతోనే. ప్రధాని మోడి ముందు నుండి వెళ్ళమని ఆయనకు సైగ చేశారు. వీడియో యొక్క ఈ భాగం ఎడిట్ చేయబడింది మరియు అసత్యపు క్లెయిమ్స్ తో షేర్ చేయబడింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు