వాస్తవ తనిఖీ: అజాంఘడ్, యూపిలో ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజ్ యొక్క చిత్రము కేరళలోనిది అని తప్పుగా విడుదల చేయబడిండీ
అజాంఘడ్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజ్ యొక్క ఒక ఫోటో కేరళలోని ఒక కళాశాలకు చెందినది అనే తప్పుదోవపట్టించే క్లెయింతో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.
- By: Abhishek Parashar
- Published: Aug 24, 2021 at 02:08 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక పోస్ట్ బుర్ఖా వేసుకున్న కొంతమంది బాలికల చిత్రాన్ని చూపుతోంది. ఇది కేరళలోని ఒక బాలికల ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజ్ యొక్క చిత్రము అని ఆ పోస్ట్ క్లెయిం చేస్తోంది
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ క్లెయిం తప్పుదోవపట్టించేది అని కనుగొనింది. వైరల్ అయిన చిత్రము కేరళకు చెందినది కాదు, కాని అజాంఘడ్, ఉత్తర్ ప్రదేశ్ లోని ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజ్ కు చెందినది.
క్లెయిం
వైరల్ అయిన చిత్రాన్ని షేర్ చేస్తూ (ఆర్కైవ్ లింక్) ఫేస్బుక్ యూజర్ ‘ఆయుబ్ వాఝేలా’ హిందీలో ఇలా వ్రాశారు, “ఇది సౌదీ లేదా మరే ఇస్లామిక్ దేశానికి కాదు’ కాని భారతదేశములోని కేరళకు చెందిన #గర్ల్స్ ఇంజనీర్ డిగ్రీ కాలేజ్ కు చెందినది, #మహిళలు ప్రాపంచిక శిక్షణతో పాటుగా వస్త్రధారణ గురించి కూడా చూసుకుంటున్నారు….!”
సోషల్ మీడియాలో చాలామంది యూజర్లు ఈ చిత్రాన్ని ఇదే క్లెయింతో షేర్ చేశారు
విచారణ
విస్వాస్ న్యూస్ వైరల్ ఫోటో యొక్క ప్రామాణీకరణను కనుగొనుట కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించింది. మా శోధన సమయములో ఈ చిత్రాన్ని నవంబరు 12, 2017లో bdc-tv.com యొక్క వెబ్సైట్ లో ప్రచురించబడిన ఒక రిపోర్ట్ లో మేము కనుగొన్నాము.
అబు జాఫర్ ద్వారా అందించబడిన ఈ రిపోర్ట్ లోని సమాచారం ప్రకారం, ఈ చిత్రము దావూద్పుర్, ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజ్ (ఉదయపు ప్రార్ధన) కు చెందినది.
ఇదే చిత్రము మరియు ఇలాంటి బైలైన్ తో అనేక ఇతర వెబ్సైట్స్ లో కూడా మాకు ఇటువంటి రిపోర్ట్ లభించింది, ఇవి ఈ చిత్రము అజాంఘడ్ లోని ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజ్ అని ధృవీకరిస్తున్నాయి.
విశ్వాస్ న్యూస్ ఈ చిత్రానికి సంబంధించి విలేఖరి అయిన అబు జాఫర్ ను సంప్రదించింది. ఆయన ఇలా అన్నారు, “ఈ చిత్రము అజాంఘడ్ లోని ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజ్ కు సంబంధించినది. ఈ చిత్రము సంబంధిత రిపోర్ట్ లో ఉపయోగము కొరకు నవంబర్ 2017లో తీసినది”
వైరల్ చిత్రాన్ని తప్పుదోవపట్టించే క్లెయింతో షేర్ చేసిన యూజర్ తన ప్రొఫైల్ లో తాను వడోదరా, గుజరాత్ నివాసిని అని పేర్కొన్నారు.
निष्कर्ष: అజాంఘడ్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న ఫాతిమా గర్ల్స్ ఇంటర్ కాలేజ్ యొక్క ఒక ఫోటో కేరళలోని ఒక కళాశాలకు చెందినది అనే తప్పుదోవపట్టించే క్లెయింతో సోషల్ మీడియాలో షేర్ చేయబడింది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.