వాస్తవ తనిఖి: మండవ శివలింగము ఫోటోలు నేపాల్ లోని పశుపతినాథ్ దేవాలయములోనివిగా షేర్ చేయబడ్డాయి
ముగింపు: విశ్వాస్ న్యూస్ ఆ వైరల్ పోస్ట్ ను దర్యాప్తు చేసింది మరియు అది మండవ, రాజస్తాన్ లో ఉన్న ఒక దేవాలయములోని శివలింగము యొక్క చిత్రముగా కనుగొనింది. దానికి నేపాల్ కు ఎలాంటి సంబంధం లేదు.
- By: Ashish Maharishi
- Published: Sep 8, 2021 at 04:55 PM
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లి): ఒక నకిలీ క్లెయింతో ఒక శివలింగము యొక్క చిత్రము సామాజిక మాధ్యమములో చక్కర్లు కొడుతోంది. అది నేపాల్ లో ఉన్న పశుపతినాథ్ దేవాలయానికి చెందినది అని యూజర్స్ అంటున్నారు. విశ్వాస్ న్యూస్ ఆ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు అది రాజస్తాన్ లోని మండవలో ఉన్న దేవాఅలయములో ఉన్న శివలింగముగా కనుగొనింది. దానికి నేపాల్ కు ఎలాంటి సంబంధం లేదు.
క్లెయిం
ఫేస్బుక్ యూజర్ సంజయ్ సూర్యవంశి ఆగస్ట్ 14 నాడు ఒక శివలింగము ఫోటోను అప్లోడ్ చేశారు. ఆ పోస్ట్ లో ఈ విధంగా పేర్కొనబడింది: ఈ ఫోటో నేపాల్ లోని ఖాట్మండులో ఉన్న శ్రీ పశుపతినాథ్ భగవానుడిది, ఈ శివలింగము యొక్క ఫోటో లభించడము చాలా దుర్లభము. దీనిని మీ స్నేహితులకు పంపించి వారు కూడా దీనిని చూసే అవకాశం కలిగించండి”
ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ఈ చిత్రాన్ని సెర్చ్ చేయుటకు గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ను ఉపయోగించింది. మండవ – పారదర్శక శివాలయము అనే ఫేస్బుక్ పేజీపై మాకు ప్రొఫైల్ చిత్రములో ఉపయోగించిన ఇదే చిత్రము లభించింది. ఇదే చిత్రము నేపాల్ పేరుతో వైరల్ అయ్యింది.
ఈ ఫేస్బుక్ పేజ్ పై, మాకు ఒక స్థానిక వార్తాపత్రిక యొక్క రిపోర్ట్ లభించింది. మండవ లోని వార్డ్ 18లో ఒక దేవాలయములో పారదర్శక శివలింగము ఉంది అని ఇందులో పేర్కొనబడింది. ఆ రిపోర్ట్ ను ఇక్కడ చూడవచ్చు.
ఫేస్బుక్ పై ఇవ్వబడిన మొబైల్ నంబరుపై మేము సంప్రదించాము. నేపాల్ లోని పశుపతినాథ్ దేవాలయము పేరున చక్కర్లు కొడుతున్న ఈ వైరల్ పోస్ట్ నకిలీది అని ఆ నంబరు యొక్క యూజర్, దీపేష్ తెలిపారు. ఈ చిత్రము మండవలోని శివాలయమునకు చెందినది.
దర్యాప్తు సమయములో మాకు డిసెంబరు 5, 2020 నాడు యూట్యూబ్ పై అప్లోడ్ చేయబడిన ఒక వీడియో లభించింది. అందులో, ఈ శివలింగము మండవలో ఉందని తెలుపబడింది. పూర్తి వీడియోను ఈ దిగువన చూడండి.
ఇప్పుడు నేపాల్ లోని పశుపతినాథ్ దేవాలయానికి చెందిన శివలింగము ఎలా ఉంటుంది అని మేము సెర్చ్ చేశాము. ఈ దేవాలయము భాగమతి నది తీరాన ఉందని ABP న్యూస్ యొక్క ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడ శివుడి విగ్రహానికి నాలుగు ముఖాలు ఉంటాయి. ఈ వీడియోను మీరు ఈ దిగువన చూడవచ్చు.
మండవకు చెందిన చిత్రాన్ని నేపాల్ కు చెందినదిగా వైరల్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను మేము స్కాన్ చేశాము. సంజయ్ సూర్యవంశి అనే ఫేస్బుక్ యూజర్ నాసిక్, మహారాష్ట్రలో ఉంటారు అని తెలిసింది.
निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ ఆ వైరల్ పోస్ట్ ను దర్యాప్తు చేసింది మరియు అది మండవ, రాజస్తాన్ లో ఉన్న ఒక దేవాలయములోని శివలింగము యొక్క చిత్రముగా కనుగొనింది. దానికి నేపాల్ కు ఎలాంటి సంబంధం లేదు.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.