వాస్తవ తనిఖీ : బుర్ఖాలు ధరించిన విద్యార్థినుల ఫోటో కేరళ మహిళా పోలీసులుగా తప్పుడు ప్రచారం

ఫోటోలో కనిపిస్తున్న వాళ్లు విద్యార్థినులు, మహిళా పోలీసులు కాదు. ఈ ఫోటోను కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఉన్న ఒక అరబిక్ కళాశాలలో 2017 లో తీశారు.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటోలో కొంతమంది మహిళలు ఓ పోలీసు అధికారి వెనక బుర్ఖాలు ధరించి నిలబడ్డారు. ఫోటోతో ఉన్న దావాలో ఆ మహిళలు కేరళకు చెందిన పోలీసులు అని పేర్కొన్నారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి, ఈ వాదన అబద్ధమని తేల్చింది. వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నవాళ్లు విద్యార్థినులు. ఈ ఫోటోను కేరళ కాసరగోడ్ జిల్లాలోని ఒక అరబిక్ కళాశాలలో 2017 లో తీశారు.

దావా :
సోషల్ మీడియా యూజర్ ‘Suresh Manji Fatak’ ఈ వైరల్ చిత్రం షేర్‌ చేశాడు, ‘షాక్ అవ్వకండి, ఈ ఫోటో సౌదీ అరేబియాకు చెందినది కాదు, కేరళ మహిళా పోలీసులది’ అని కామెంట్‌ రాశారు.

విశ్వాస్ న్యూస్ తన ఫ్యాక్ట్ చెకింగ్ వాట్సాప్ చాట్‌బాట్ (+919599299372) లో వాస్తవ తనిఖీ కోసం ఈ దావాను పొందింది.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ ఉపయోగించి ఈ ఫోటోను శోధించింది. అక్టోబర్ 24, 2017 న ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురించబడిన వచ్చిన వార్తా కథనంలో మేము అదే ఫోటోను కనుగొన్నాము. వార్తా కథనం ప్రకారం, అప్పటి కసర్‌గోడ్ జిల్లా పోలీస్‌ చీఫ్ కెజి సైమన్‌తో కలిసి విద్యార్థినులు ఈ ఫోటో తీయించుకున్నారు. ఈఫోటోలో కనిపిస్తున్న వాళ్లు కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఉన్న ఒక అరబిక్ కళాశాల విద్యార్థినులు.

ఈ విషయంలో మరింత ధృవీకరణ కోసం మేము పోలీసు అధికారి కెజి సైమన్‌ను సంప్రదించాము. కాసర్‌గోడ్‌లోని ఒక విద్యా సంస్థలో నిర్వహించిన కార్యక్రమానికి తాను అతిథిగా వెళ్లినప్పుడు, 2017లో ఈ ఫోటో తీశారని ఆయన ధృవీకరించారు. “చిత్రంలో కనిపించే మహిళలు విద్యార్థినులు, పోలీసులు కాదు” అని ఆయన అన్నారు. స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన ‘నిర్భయ’ అనే ఆత్మరక్షణ వర్క్‌షాప్‌లో విద్యార్థినులు పాల్గొన్నారు.

చాలా మంది ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. వారిలో ఒకరు ‘Suresh Manji Fatak’ అనే ఫేస్ బుక్ యూజర్. ఈ యూజర్‌కు ఫేస్‌బుక్‌లో 1,355 మంది ఫాలోవర్లు ఉన్నారు. యూజర్ ముంబైకి చెందినవాడు.

निष्कर्ष: ఫోటోలో కనిపిస్తున్న వాళ్లు విద్యార్థినులు, మహిళా పోలీసులు కాదు. ఈ ఫోటోను కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఉన్న ఒక అరబిక్ కళాశాలలో 2017 లో తీశారు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు