X
X

Fact Check: ఈ శివలింగము తెలంగాణలో ఉంది, శ్రీలంకలో కాదు

కొత్త ఢిల్లీ (విశ్వాస్ బృందము)। సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటోలో ఒక శివలింగాన్ని చూడవచ్చు. ఇది ప్రపంచములోనే అతిపెద్ద శివలింగము అని మరియు ఇది శ్రీలంకలో ఉందని పోస్ట్ లో క్లెయిమ్ చేయబడింది. ఈ శివలింగము నిజానికి తెలంగాణకు చెందినది అని, దీనిని శ్రీలంకలోనిదిగా తెలుపుతూ వైరల్ చేయబడుతోందని మా దర్యాప్తులో మేము కనుగొన్నాము.

ఈ వైరల్ పోస్ట్ లో ఏముంది?

వైరల్ పోస్ట్ ఓ ఒక శివలింగాన్ని చూడవచ్చు. ‘100 కోట్ల హిందువుల గ్రూపులో 50 మంది మీ మిత్రులను జత చేయండి’ నే పేరుతో ఒక ఫేస్‎బుక్ యూజర్ పోస్ట్ లో ఈ విధంగా క్లెయిమ్ చేశారు “శ్రీలంకలో 108 అడుగుల ఒక శివలింగం తయారు చేయబడుతోంది. ఇది ప్రపంచములోనే అత్యంత ఎత్తైన శివలింగము. హర హర మహాదేవ”

దర్యాప్తు

మా దర్యాప్తును ప్రారంభించుటకు మేము ముందుగా ఈ ఫోటోను గూగుల్ లెన్స్ సెర్చ్ చేశాము. సెర్చ్ లో మాకు శివ శక్తి సాయి టివి అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఫిబ్రవరి 5, 2018 నాడు చేయబడిన ఒక ట్వీట్ మాకు లభించింది. ఈ ట్వీట్ లో ఈ శివలింగాన్ని ఉపయోగించారు మరియు ఇలా వ్రాసారు, “63 అడుగుల వేద సాయి మహాలింగేశ్వర ప్రతిష్ఠ.#సిద్ధగురు శ్రీ రామానంద మహర్షి.#రామేశ్వరం, నాగిరెడ్డిపల్లి, భువనగిరి”. ఈ పోస్ట్ లో ఈ శివలింగము యొక్క రెండవ కోణము నుండి తీయబడిన ఫోటో ఉంది. ఫోటోలో వ్రాయబడిన వివరణ ప్రకారము, ఈ ఫోటో 63 అడుగుల ఎత్తైన వేద సాయి మహాలింగేశ్వరుడికి చెందినది, ఇది నాగిరెడ్డిపల్లి, భువనగిరిలో ఉంది.”

మేము ఇంటర్నెట్ పై ’63 అడుగుల వేద సాయి మహాలింగేశ్వర’ అనే కీవర్డ్స్ సహాయముతో సెర్చ్ చేశాము. మాకు www.ramananandamaharshi.com వెబ్సైట్ యొక్క ఒక పేజ్ ఓపెన్ అయ్యింది. ఇందులో ఈ ఫోటో ఉపయోగించబడింది. ఈ వెబ్సైట్ ఆధ్యాత్మిక గురువు సిద్ధగురు శ్రీ రామానంద మహర్షి గారిది. ఈ పేజ్ ప్రకారము, ఇది ‘వేద సాయి మహా లింగేశ్వర్’ మరియు ఈ 63 అడుగుల ఎత్తైన శివలింగము పరమగురువు షిరిడీ సాయి పేరున అంకితం చేయబడింది.

తదుపరి నిర్ధారణ కొరకు మేము ఆధ్యాత్మిక గురువు సిద్ధగురు శ్రీ రామానంద మహర్షి గారి మేనేజరు శ్రీ లక్ష్మణ్ కుమార్ పాలడుగును కలిసి మాట్లాడాము. ఆయన ఈ శివలింగము నాగిరెడ్డిపల్లె, భువనగిరి, తెలంగాణలో ఉందని మాకు తెలియజేశారు. ఆయన మాకు ఈ శివలింగము యొక్క ఖచ్ఛితమైన లొకేషన్ షేర్ చేశారు. ఈ శివలింగము యొక్క ఎత్తు 63 అడుగులు అని మరియు ఇది స్టీల్ మరియు పీఓపీతో తయారు చేయబడిందని ఆయన తెలిపారు.

దీని తరువాత మేము అత్యంత పొడవైన శివలింగము గురించి సెర్చ్ చేసినప్పుడు మాకు టైమ్స్ ఆఫ్ ఇండియా కు చెందిన జనవరి 10, 2019 నాటి ఒక వార్త లభించింది. ఇందులో “చెంకల్ లో మహేశ్వరంలో శ్రీ శివ పార్వతి దేవాలయానికి చెందిన 111.2 అడుగుల శివలింగము దేశములో అన్నిటికంటే ఎత్తైన శివలింగముగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ధృవీకరించింది.”

ఈ పోస్ట్ ను ‘100 కోట్ల హిందువుల గ్రూపులో 50 మంది మీ మిత్రులను జతచేయండి’ అనే ఫేస్‎బుక్ యూజర్ షేర్ చేశారు. ఈ యూజర్ కు 10 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు.

ముగింపు: ఈ శివలింగము నిజానికి తెలంగాణలోనిది అని, ఇది శ్రీలంకలోని జాఫ్నాకు చెందినదిగా తెలుపుతూ వైరల్ చేయబడిందని మా దర్యాప్తులో మేము కనుగొన్నాము.

  • Claim Review : శ్రీలంకలో 108 అడుగుల శివలింగము తయారుచేయబడింది. ఇది ప్రపంచములో ఎత్తైన శివలింగము. హరహర మహాదేవ.
  • Claimed By : ఫేస్‎బుక్ పేజ్ 100 కోట్ల హిందువుల గ్రూపులో 50 మంది మీ మిత్రులను జతచేయండి
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later