X
X

వాస్తవ తనిఖీ: 2012లో ఎడిటింగ్‌ చేసిన ఫోటో భారత వైమానిక దళం పేరిట వైరల్

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీదని తేల్చింది. 2012 లో తీసిన ఫోటో మార్ఫింగ్ చేయబడింది, మరియు తప్పుడు దావాలతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయబడుతోంది.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఓ యుద్ధ విమానం యొక్క ఫోటో వైరల్ అవుతోంది. బాలకోట్ దాడుల్లో నాలుగు చెట్లు కూలిపోయాయని, ఓ కాకి మాత్రమే చనిపోయిందని, అది అంగీకరించిన తర్వాతే, పాకిస్తాన్‌ను భారత్‌ ట్రోల్‌ చేస్తోందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు.. యుద్ధవిమానంలో నాలుగు చెట్లు, ఓ కాకి చిత్రం ఎడిటింగ్‌లో చేర్చారు.

విశ్వాస్ న్యూస్.. తన దర్యాప్తులో, పాత ఫోటోను ఎడిట్‌ చేసి, తప్పుడు వాదనలతో విస్తృతంగా ఈ పోస్ట్‌ షేర్‌ చేయబడుతుందని కనుగొనడం జరిగింది. దీని అసలు ఫోటోను 2012 సంవత్సరంలో గ్వాలియర్‌ వైమానిక దళం స్టేషన్‌లో తీశారు.

దావా:
ఫేస్‌బుక్ నుండి ట్విట్టర్ దాకా యుద్ధ విమానం యొక్క ఎడిటెడ్‌ ఫోటోను విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. ఫేస్‌బుక్ యూజర్, గోపాల్ శర్మ ఈ ఫోటోను షేర్‌ చేశారు. ‘IAF హాస్యాన్ని ఆరాధించండి. బాలకోట్ దాడుల్లో 4 చెట్లు మరియు ఒక కాకికి మాత్రమే ప్రాణనష్టం జరిగిందని అంగీకరించినందుకు వారు పాకీలను ట్రోల్ చేస్తున్నారు.. జై హింద్…’ అని తన పోస్ట్‌లో రైటప్‌ ఇచ్చారు. ఆవైరల్‌ పోస్ట్‌ను ఇక్కడ చూడొచ్చు.

ఈ పోస్ట్‌ అర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ క్లిక్‌ చేసి చూడొచ్చు.

దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో భాగంగా, మొదట చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ టూల్‌లో అప్‌లోడ్ చేసి, ఆపై ఇంటర్నెట్‌లో శోధించింది. ఆ తర్వాత వేర్వేరు కీలకపదాలను ఉపయోగించి మేము జోన్ 5 ఏవియేషన్.కామ్ అనే వెబ్‌సైట్‌లో ఈ ఫోటోను కనుగొన్నాము. ఈ ఫోటోతో పాటు, మరికొన్ని ఫోటోలు కూడా ఫోటో గ్యాలరీలో చేర్చారు. ఫోటో యొక్క శీర్షికలో 2012 లో గ్వాలియర్ మహారాజ్‌పూర్ వైమానిక దళం స్టేషన్‌లో ఈ ఫోటో తీశారని పేర్కొన్నారు. ఈ ఫోటోలో ఉన్న జెట్‌ మిరాజ్ -2000. దీన్ని ఢిల్లీకి చెందిన అంగద్ సింగ్ ఫోటో తీశారు. మొత్తం ఫోటో గ్యాలరీని తనిఖీ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విశ్వాస్ న్యూస్ భారత వైమానిక దళం అధికారులను సంప్రదించింది. వైరల్ పోస్ట్‌లో పేర్కొన్నది అబద్ధమని, భారత వైమానిక దళం ఇలాంటి పని ఎప్పటికీ చేయదని వారు మాకు చెప్పారు.

దర్యాప్తు ముగింపులో, వైరల్ పోస్ట్‌ను షేర్‌ చేసిన యూజర్‌ ఖాతాను మేము తనిఖీ చేసాము. ఫేస్‌బుక్‌ యూజర్ గోపాల్ శర్మ ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడని మాకు తెలిసింది. అతను హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్‌కు చెందినవాడు. 340 మంది ఆయన అకౌంట్‌ను ఫాలో అవుతున్నారు.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో వైరల్ పోస్ట్ నకిలీదని తేల్చింది. 2012 లో తీసిన ఫోటో మార్ఫింగ్ చేయబడింది, మరియు తప్పుడు దావాలతో సోషల్‌ మీడియాలో షేర్‌ చేయబడుతోంది.

  • Claim Review : 'IAF హాస్యాన్ని ఆరాధించండి. బాలకోట్ దాడుల్లో 4 చెట్లు మరియు ఒక కాకికి మాత్రమే ప్రాణనష్టం జరిగిందని అంగీకరించినందుకు వారు పాకీలను ట్రోల్ చేస్తున్నారు.. జై హింద్...'
  • Claimed By : Facebook User Gopal Sharma
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later