ముగింపు : హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వీడియో సోషల్ మీడియాలో తప్పుడు దావాతో వైరల్ అవుతోంది. వీడియోలోని ఇద్దరు వ్యక్తులు క్లాస్-4 పారిశుద్ధ్య సిబ్బంది, వారి 12 గంటల షిఫ్ట్ పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు, వాళ్లు కరోనా వైరస్ సోకిన రోగులు కాదు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసుల మధ్య, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు పిపిఇ కిట్లు ధరించి నేలపై కూర్చొని ఉండటం చూడవచ్చు. ఈ వీడియో హైదరాబాద్ గాంధీ హాస్పిటల్‌లో రికార్డ్ చేసిందని, పిపిఇ కిట్లు ధరించి వీడియోలో కనిపిస్తున్న వ్యక్తులు కరోనావైరస్ సోకిన రోగులు అని పేర్కొన్నారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసినప్పుడు, ఈ ప్రచారం తప్పు అని మేము కనుగొన్నాము. పిపిఇ కిట్లు ధరించి ఆసుపత్రి లిఫ్ట్ పరిసరాల్లో కూర్చున్న వ్యక్తులు ఆసుపత్రి సిబ్బంది.. కరోనావైరస్ సోకిన రోగులు కాదు.
దావా :
హైదరాబాద్ టుడే అనే యూజర్ ఫేస్‌బుక్‌లో ఈ వీడియో కింద ఈ రైటప్ ఇచ్చారు : ”హైదరాబాద్ # గవర్నమెంట్ హాస్పిటల్.. దీనిపై చెప్పడానికి అసలు పదాలు లేవు. యే హాలత్ హోగయే # COVID19 రోగులకి. బాస్ అల్లాహ్ రాహెం కరే.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్ చేసిన లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు :
ఇన్‌విడ్ టూల్ ఆధారంగా సేకరించిన వీడియో యొక్క కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో శోధించడం ద్వారా విశ్వాస్ న్యూస్ ఈ వీడియోను పరిశోధించింది. జూలై 4వ తేదీన ‘ది న్యూస్ మినిట్‘ వెబ్‌సైట్‌లో ప్రచురించిన కథనం లింక్‌ను మేము కనుగొన్నాము.
ఈ కథనం ప్రకారం, పిపిఇ కిట్స్ ధరించి ఆసుపత్రి లిఫ్ట్ పరిసరాల్లో కూర్చున్న ఈ వ్యక్తులు ఆసుపత్రిలో పనిచేసే శానిటేషన్ సిబ్బంది. ఈ కథనంలో గాంధీ ఆసుపత్రి ప్రతినిధి వివరణ కూడా ఉంది. ప్రకటన ప్రకారం, “వీడియోలోని ఇద్దరు వ్యక్తులు క్లాస్-4 పారిశుద్ధ్య సిబ్బంది, వారు 12 గంటల షిఫ్ట్ పూర్తి చేసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు.”
అదే స్టోరీలో ఉన్న మిగతా వివరాలు చూస్తే.. “వారు డ్యూటీ పూర్తిచేసుకొని ఇంటికి వెళ్లేందుకు వేచి ఉన్నారు. ఈక్రమంలో కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. వారు పూర్తి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ) కిట్‌లను ధరించారు. ఆసుపత్రిలో ఉండే రోగులు ఆస్పత్రి లోపల ఎక్కడికి వెళ్లాలన్నా మాస్క్‌లు మాత్రమే ధరిస్తారు.”
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో జూలై 5వ తేదీన ప్రచురించిన నివేదికలో కూడా ఈ సంఘటన గురించి ప్రస్తావించబడింది. ఆ కథనం ప్రకారం, ”పిపిఇ కిట్ ధరించి నేలపై కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగి ఒక మహిళ.”
మరింత స్పష్టత కోసం హైదరాబాద్‌కు చెందిన న్యూస్ ఛానల్ టివి 9 రిపోర్టర్ నూర్ మహ్మద్‌ను విశ్వాస్ న్యూస్ సంప్రదించింది. ఆయన మాకు దీనిపై క్లారిటీ ఇచ్చారు. “వైరల్ వీడియో సరైనదే, కానీ ఆ వీడియోతో పాటు చేసిన దావా తప్పు. వీడియోలో ఆసుపత్రిలోని ఓ ఫ్లోర్‌లో కనిపిస్తున్న వ్యక్తులు కరోనావైరస్ సోకిన రోగులు కాదు, ఆసుపత్రిలో పనిచేసే పారిశుధ్య కార్మికులు.”
ఇంతకుముందు, హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌కు సంబంధించిన ఓ వీడియో కూడా తప్పు వాదనతో వైరల్ అయ్యింది, దీనిని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది. ఆ వాస్తవ తనిఖీ కథనం ఇక్కడ చదవవచ్చు.
https://www.vishvasnews.com/telugu/society/fact-check-old-video-of-osmania-hospital-mortuary-is-being-shared-as-recent/
వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన పేజీ ప్రొఫైల్‌ను విశ్వాస్ న్యూస్ స్కాన్ చేసి, సుమారు 300 మంది ఆ పేజీని ఫాలో అవుతున్నట్లు కనుగొంది.
निष्कर्ष: ముగింపు : హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వీడియో సోషల్ మీడియాలో తప్పుడు దావాతో వైరల్ అవుతోంది. వీడియోలోని ఇద్దరు వ్యక్తులు క్లాస్-4 పారిశుద్ధ్య సిబ్బంది, వారి 12 గంటల షిఫ్ట్ పూర్తయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నారు, వాళ్లు కరోనా వైరస్ సోకిన రోగులు కాదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923