కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): తమిళనాడులో వలసదారులపై దాడికి సంబంధించిన పుకార్ల మధ్య దక్షిణ రాష్ట్రము నుండి హిందీ-మాట్లాడే కూలీలు పారిపోతున్నారు అనే మరొక అసత్యపు క్లెయిమ్ తో ఒక తాజా వీడియో షేర్ చేయబడింది. వైరల్ వీడియోలో, కదులుతున్న ఒక రైలు బోగీలకు వేళ్ళాడుతూ వెళ్తున్న జనాలను చూడవచ్చు. ఇది తమిళనాడు నుండి బీహార్ వెళ్ళే రైలుగా పోస్ట్ లో క్లెయిమ్ చేయబడింది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, ఇతర వీడియోల మాదిరిగానే ఈ వీడియో కూడా నకిలీది అని అని మరియు తమిళనాడు నుండి వలస కూలీల సామూహిక తరలింపుకు సంబంధం లేదని తేలింది.
సోషల్ మీడియా యూజర్ ‘డైనమో జామ్స్ గేమింగ్’ ఈ వీడియోను (ఆర్కైవ్ లింక్) వలస కూలీలు తమిళనాడు నుండి బీహార్ కు తిరిగి వెళ్ళిపోతున్నారు అనే క్లెయిమ్ తో షేర్ చేశారు.
అనేకమంది ఇతర యూజర్లు కూడా ఇటువంటి క్లెయిమ్స్ తో ఇదే వీడియోను షేర్ చేశారు.
వైరల్ వీడియోలో, ఒక రైలులోని జనరల్ బోగీలో ప్రయాణించడానికి తమ జీవితాలను పణంగా పెడుతున్న భారీ గుంపును చూడవచ్చు. ఇన్విడ్ టూల్ సహాయముతో తీసుకోబడిన ఫ్రేమ్స్ లో ఒకదానిలో, ‘పాలము ఎక్స్ప్రెస్’ అని రైలు బోగీపై వ్రాసి ఉండటం చూడవచ్చు.
భారతీయ రైల్వేల అధికారిక వెబ్సైట్ పై అందుబాటులో ఉన్న సమాచారము ప్రకారము, ఈ రైలు జార్ఖండ్ కు చెందిన బర్కాకానా జంక్షన్ మరియు బీహార్ రాజధాని పాట్నాల మధ్య నడుస్తుంది.
‘పాలము ఎక్స్ప్రెస్’ బీహార్ మరియు తమిళనాడు మధ్య నడవదు అని, బీహార్ మరియు జార్ఖండ్ ల మధ్య నడుస్తుంది అని దైనిక్ జాగరణ్ యొక్క పాలము బ్యూరో చీఫ్ ముతుంజయ్ పాఠక్ ధృవీకరించారు.
వైరల్ వీడియోలో కనిపించిన రైలు తమిళనాడు నుండి బీహార్ కు తిరిగి వెళ్తున్న వలస కూలీలకు సంబంధించినది కాదని మరియు వీడియో అసత్యపు క్లెయిమ్ తో షేర్ చేయబడిందని మా దర్యాప్తు నుండి స్పష్టం అయ్యింది.
ప్రముఖంగా, తమిళనాడులో ఉత్తర భారత వలస కూలీలపై దాడులకు సంబంధించిన నకిలీ మరియు తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో అసంబద్ధమైన వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాపై షెర్ చేయబడ్డాయి. ఇటువంటి వీడియోలు మరియు ఫోటోలను వ్యాప్తి చేస్తున్నవారిని గుర్తించి వారిపట్ల చర్య తీసుకోబడుతోంది.
ఈ సందర్భములో, అసత్యపు మరియు తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో హిస్టీరియా వ్యాప్తి చేస్తున్న వీడియో గురించి దర్యాప్తు చేసే సమయములో బీహార్ పోలీసులు, ఐపీసి యొక్క వివిధ సెక్షన్ల కింద నలుగురిపై కేసు నమోదు చేశారు మరియు నిందితులలో ఒకరు అరెస్ట్ చేయబడ్డారు.
కాగా, తమిళనాడులో సమస్య గురించి దర్యాప్తు చేయుటకు వెళ్ళిన బృందము బీహార్ కు తిరిగి వచ్చి ప్రభుత్వానికి తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఏడు వీడియోలతోపాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు మరియు సందేశాలు బీహార్ నుండి వచ్చిన వలస కూలీల మొబైల్ ఫోన్లపై కనిపించాయి అని తన రిపోర్ట్ లో ఈ బృందము తెలిపింది. ఈ వీడియోలు తప్పుదోవపట్టించేవి అని తేలింది.
ఈ అంశానికి సంబంధించి తమిళనాడు పోలీసులు కూడా నిరంతరంగా చర్యలు తీసుకుంటున్నారు, నకిలీ మరియు తప్పుదోవపట్టించే క్లెయిమ్స్ తో వీడియోలు మరియు చిత్రాలను షేర్ చేసే వ్యక్తులను గుర్తించడము మరియు అరెస్ట్ చేయడము వంటి చర్యలు చేపడుతున్నారు.
ఇటీవల, దక్షిణ భారతదేశములో హిందీ-మాట్లాడే వలస కూలీలు ప్రయాణిస్తున్న ఒక రైలుపై హత్యకు సంబంధించిన ఒక వీడియో బయటపడింది మరియు ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తదనంతరం, సోషల్ మీడియాపై తమిళనాడులో హిందీ-మాట్లాడే కూలీలపై హింస మరియు ఆ కారణంగా ప్రేరేపించబడిన వలస కూలీల సామూహిక తరలింపుకు సంబంధించి తప్పుదోవపట్టించే మరియు అసత్యపు క్లెయిమ్స్ తో అనేక వీడియోలు మరియు ఫోటోలు షేర్ చేయబడ్డాయి. దీనికి సంబంధించి వాస్తవ తనిఖీ రిపోర్టులను విశ్వాస్ న్యూస్ యొక్క వెబ్సైట్ మరియు అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై చూడవచ్చు మరియు చదవవచ్చు.
తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ వీడియోను షేర్ చేసిన యూజర్ కు ఫేస్బుక్ పై 150 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: తమిళనాడు నుండి హిందీ-మాట్లాడే వలస కూలీల సామూహిక తరలింపు క్లెయిమ్ తో వైరల్ అయిన వీడియో, జార్ఖండ్ లోని బర్కాకానా మరియు బీహార్ రాజధాని పాట్నాల మధ్య నడిచే పాలము ఎక్స్ప్రెస్ కు సంబంధించినది. ఈ వీడియో తమిళనాడుకు చెందినది అనే అసత్యపు క్లెయిమ్ తో షెర్ చేయబడింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923