Fact Check: వరదలకు సంబంధించిన వైరల్ వీడియో పాకిస్తాన్ కు చెందిన స్వాత్ వ్యాలీకి చెందినది, కేదార్నాథ్ కాదు

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): భారీ వర్షాలు ఉత్తరాఖండ్ లో విపత్తును సృష్టించింది. ఎడతెగని వర్షపాతం వలన నదులు మరియు చెరువులన్నీ నిండుకుండలలా పొంగిపొర్లుతున్నాయి. కాగా, నీటి ప్రవాహాలను చూపిస్తూ సోషల్ మీడియాపై ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. కొంతమంది యూజర్లు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు మరియు ఇది కేదార్నాథ్ లోని ఇటీవలి ఫుటేజ్ గా క్లెయిమ్ చేస్తున్నారు.

తన దర్యాప్తులో, వైరల్ వీడియో కేదార్నాథ్ కు సంబంధించినది కాదు అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది. నిజానికి ఫుటేజ్ లో పాకిస్తాన్ యొక్క స్వాత్ వ్యాలీలో 2020లో వచ్చిన వరదలను చూపుతుంది. దీని ఖచ్ఛితమైన మూలము ఉన్నప్పటికీ, వీడియో ఇప్పుడు అది కేదార్నాథ్ ను చూపుతుంది అనే మోసపూరితమైన క్లెయిమ్ తో షేర్ చేయబడుతోంది.

ఏది వైరల్ అవుతోంది

ఆగస్ట్ 14, 2023 నాడు, శాంతిలాల్ ప్రజాపత్ అనే ఒక యూజర్ ఈ వైరల్ వీడియోను (ఆర్కైవ్డ్ లింక్) ‘సత్సంగ్-సత్సంగ్-పురాణిక్ కహానియాన్-ధ్యాన్-భక్తి-రీతి రివాజ్ వా వైజ్ఞానిక్ ఆధార్’ అనే ఒక ఫేస్‎బుక్ పేజ్ పై షేర్ చేశారు.

వీడియో వెంబడి ఉన్న శీర్షిక హిందీలో ఈ విధంగా ఉంది, “కేదార్నాథ్ మే కీ బహాద్ ఆయి దేఖియే ఈ వీడియోలో చూడండి. (కేదార్నాథ్ లో వరదలు, ఈ వీడియో చూడండి)”

దర్యాప్తు

వైరల్ వీడియోపై దర్యాప్తు సమయములో, గూగుల్ ఇమేజెస్ ఉపయోగించి వీడియో యొక్క స్క్రీన్షాట్ పై మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాము.

దీనితో మేము ‘aushimalaya.net‘ అనే ఒక వెబ్సైట్ పై వైరల్ వీడియోకు సంబంధించిన రిపోర్ట్ ను కనుగొన్నాము. రిపోర్ట్ వెంబడి ఉన్న స్క్రీన్షాట్ లో అది స్వాత్ వ్యాలీగా స్పష్టంగా గుర్తించాము.

హం న్యూస్ స్వాత్ యొక్క బ్యూరో చీఫ్ షెరీన్ జాడా యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై మరొక రుజువు లభించింది. సెప్టెంబర్ 1, 2020 నాడు అప్లోడ్ చేయబడిన ఒక వీడియో, వైరల్ వీడియోలో ఉన్నటువంటి దృశ్యాలే చూపించబడ్డాయి, విలేఖరి స్వాత్, బెహ్రెయిన్ లోని వరదల గురించి చర్చిస్తున్నారు.

వరదల గురించిన మరొక వీడియో రిపోర్ట్ కూడా ఈ ఛానల్ పై లభించింది.

అంతేకాకుండా, ఖచ్ఛితంగా ఇలాంటి ఫుటేజ్ చూపించే ఒక వీడియో  ‘టోటల్ ఇన్ఫో’ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై సెప్టెంబరు 2, 2020 నాడు అప్లోడ్ చేయబడినట్లు గుర్తించబడింది. ఇది వైరల్ వీడియో యొక్క మూలం పాకిస్తాన్ లోని స్వాత్ వ్యాలీలో ఉందని ధృవీకరించింది.

ఫేస్‎బుక్ పై, అనేకమంది యూజర్లు కూడా వైరల్ వీడియోలాంటి వీడియోనే, ఇది స్వాత్ వ్యాలీకి ఆపాదిస్తూ షేర్ చేశారు. బలాజ్ గ్రాఫి అనే ఒక యూజర్ సెప్టెంబర్ 1, 2020 నాడు షేర్ చేసిన ఈ వీడియోను ఇక్కడ వీక్షించవచ్చు 

మరింత లోతైన అంతర్దృష్టి కొరకు, బ్రిజేష్ భట్, దైనిక్ జాగరణ్ యొక్క జిల్లా ఇన్-చార్జ్, రుద్రప్రయాగ్ ను సంప్రదించాము. ఈ వీడియో కేదార్నాథ్ కు సంబంధించినది కాదు అని ఆయన ధృవీకరించారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన విధ్వంసం జరిగినప్పటికీ, వైరల్ వీడియో ఆ ప్రాంతములో తీసినది కాదు అని భట్ స్పష్టం చేశారు.

రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణాధికారి ఎన్ ఎస్ రాజ్వార్ ని కూడా సంప్రదించాము. ఇంటర్నెట్ వేదికలపై చక్కర్లు కొడుతున్న వీడియో రుద్రప్రయాగ్ (కేదార్నాథ్) కు చెందినది కాదు అని ఆయన ధృవీకరించారు మరియు వీడియోలో చూపించబడిన ప్రాంతము ఇది కాదు అని పునరుద్ఘాటించారు.

చివరిగా, తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన యూజర్ పరీక్షించబడ్డారు. ఈ యూజర్ ధనేరా, గుజరాత్ నివాసి అని మరియు ఈమెకు 5,000 మంది ఫేస్‎బుక్ ఫాలోయింగ్ ఉందని తేలింది.

ముగింపు: వైరల్ క్లెయిమ్ మోసపూరితమైనది అని విశ్వాస్ న్యూస్ దర్యాప్తు తేల్చింది. వైరల్ వీడియో కేదార్నాథ్ కు సంబంధించినది కాదు. ఇది పాకిస్తాన్ లోని స్వాత్ వ్యాలీలో సెప్టెంబర్ 2020లో సంభవించిన వరదలను చూపుతుంది. కొంతమంది యూజర్లు ఇది కేదార్నాత్ ఫుటేజ్ అని పొరపాటుగా సర్క్యులేట్ చేస్తున్నారు.

Misleading
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు