వాస్తవ తనిఖీ: దైవదూషణకు గాను పాకిస్తాన్ లో చంపబడిన వ్యక్తి ముస్లిం మతస్థుడు, క్రిస్టియన్ కాదు

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): పాకిస్తాన్ లోని నన్కానా జిల్లాలో రెచ్చిపోయిన ఒక గుంపు ఒక వ్యక్తిని దైవదూషణ ఆరోపణపై కొట్టి అతనికి నిప్పంటించిన సంఘటన ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాపై చక్కర్లు కొడుతోంది. ఆ గుంపు చంపిన వ్యక్తి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన వాడని మరియు పాకిస్తాన్ లోని మతపరమైన మైనారిటీకి చెందిన సభ్యుడిపై ఇది ఒక గురిచేయబడిన దాడి అని ఈ వీడియోలో క్లెయిమ్ చేయబడింది.

అయితే, విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ క్లెయిమ్ అసత్యమని కనుగొనింది. పాకిస్తాన్ లో దైవదూషణ ఆరోపణపై చంపబడిన వ్యక్తి ఒక క్రిస్టియన్ కాదు కాని ఒక ముస్లిం, అతని పేరు మహమ్మద్ వారిస్ (45).

క్లెయిమ్:

వైరల్ వీడియో (archive లింక్) ను షేర్ చేస్తూ, సోషల్ మీడియా యూజర్ ‘తాజా అక్బర్’ ఇలా వ్రాశారు:

“వారిస్ ఇస్సా, పాకిస్తాన్ లోని నన్కానా లో దైవదూషణ ఆరోపణలపై ఒక క్రిస్టియన్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇస్లామిక్ గుంపు పోలీసు స్టేషన్ పై దాడి చేశారు, అతనిని వీధుల్లోకి లాక్కొని వచ్చి, అల్లా-ఒ-అక్బర్ అనే నినాదాలతో నిప్పంటించారు. పాకిస్తాన్ మైనారిటీలకు నరకం అయ్యింది.

(“క్రిస్టియన్ వారసుడు జీసస్ నన్కానా సాహిబ్, పాకిస్తాన్ లో దైవదూషణ ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డాడు. ఇస్లామిక్ గుంపు పోలీసు స్టేషన్ పై దాడి చేశారు, అతనిని వీధుల్లోకి లాక్కొని వచ్చి, అల్లా-ఒ-అక్బర్ అనే నినాదాలతో నిప్పంటించారు. నరకం.”)

సోషల్ మీడియా వేదికలపై అనేకమంది ఇతర యూజర్లు  ఇదే వీడియోను ఇటువంటి క్లెయిమ్స్ ను షేర్ చేశారు. అనేకమంది వెరిఫై చేయబడిన యూజర్లు కూడా ఈ వీడియోను ట్విట్టర్ పై షేర్ చేశారు.

దర్యాప్తు:

వార్తా శోధనలో, మాకు ఈ సంఘటనపై ఇటువంటి నివేదికలే లభించాయి. పాకిస్తాని మీడియాతో సహా ఇతర దేశాల మీడియా కూడా ఈ సంఘటనను ప్రముఖంగా కవర్ చేశాయి. ప్రముఖ పాకిస్తానీ వార్తా వెబ్సైట్ అయిన Dawn.com యొక్క వెబ్సైట్ పై ఫిబ్రవరి 12 రిపోర్ట్ ప్రకారము ఫిబ్రవరి 11 న, ఒక మధ్య-వయస్కుడిని దైవదూషన ఆరోపణలపై,నన్కానా సాహిబ్, పాకిస్తాన్ లోని ఒక పోలీస్ స్టేషన్ బయట ఉన్మాద మరియు హింసాత్మక గుంపు చంపారు.

రిపోర్ట్ ప్రకారము, మరణించిన వ్యక్తి పేరు మహమ్మద్ వారిస్ మరియు అతని వయసు 45 సంవత్సరాలు. ఒక ముస్లిం మతపరమైన వచనాలను అవమానించిన ఆరోపణపై అతను పోలీసు నిర్బంధములో ఉంచబడ్డాడు. స్థానిక ప్రజలు నన్కానలోని క్వాజి పట్టణము ప్రాంతములో అతనిని ఉరితీయాలని ప్రణాళిక చేస్తుండగా, పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని పోలీసు స్టేషన్ కు తీసుకొనివచ్చారు. తరువాత, ఒక గుంపు పోలీసు స్టేషన్ బయట చేరి, అతనిని బయటికి లాక్కొని వచ్చి చంపారు.

భారతదేశములోనూ, ఈ సంఘటన ప్రముఖంగా కవర్ చేయబడింది. ది ఇండియన్ ఎక్స్‎ప్రెస్ యొక్క ఒక రిపోర్ట్  ప్రకారము, మహమ్మద్ వారిస్ ఖురాన్ ను అపవిత్రం చేసిన నేరం ఆరోపించబడ్డాడు, ఈ కారణంగా అతనిని పోలీసులు నిర్బంధములోకి తీసుకున్నారు.

పాకిస్తాన్ లోని నన్కానా ప్రాంతములో దైవదూషణ నేరారోపణపై ఒక చంపబడిన వ్యక్తి పేరు వారిస్ ఇసా కాదు, మహమ్మద్ వారిస్ అని మా దర్యాప్తులో స్పష్టం అయ్యింది.

ఈ నరమేధం యొక్క వీడియో వైరల్ పోస్ట్ లో కూడా చేయబడింది. సోషల్ మీడియా సెర్చ్ లో, ఈ వీడియో చాలామంది యూజర్ల ప్రొఫైల్ పై పోస్ట్ చేయబడి ఉంది. దీని వారు నన్కానా సాహిబ్ సంఘటన పేరున షేర్ చేశారు. యూకే-ఆధారిత పాకిస్తానీ-మూలాలు కలిగిన ఖలీద్ ఉమర్ తన వెరిఫై చేయబడిన ప్రొఫైల్ నుండి షెర్ చేసిన వీడియో వైరల్ వీడియోతో సరిపోలుతుంది.

అదనపు ధృవీకరణ కొరకు మేము పాకిస్తాన్-ఆధారిత విలేఖరి మరియు వాస్తవ-పరిశీలకుడు లుబ్న జరార్ నక్వి ని కలిశాము. ఆమె ఇలా ధృవీకరించారు, “పాకిస్తాన్ లో దైవదూషణ సంఘటనలకు ముస్లింలు కూడా బాధితులు అవుతారు మరియు మరణించిన వ్యక్తి విషయములో కూడా అతను ఒక ముస్లిం, అతని పేరు వారిస్ అలి.”
వైరల్ వీడియో ఒక నకిలీ క్లెయిమ్ తో పోస్ట్ చేయబడిన ఫేస్‎బుక్ పేజ్, సాధరణంగా వార్తలు మరియు సంబంధిత అంశాలను షేర్ చేస్తుంది.

ముగింపు: నన్కానా, పాకిస్తాన్ లో దైవదూషణ ఆరోపణపై ఒక గుంపుచే చంపబడిన వ్యక్తి మహమ్మద్ వారిస్ అని మరియు అతను ఒక ముస్లిం అని గుర్తించబడింది. దైవదూషణ ఆరోపణపై ఒక క్రిస్టియన్ వ్యక్తిని రెచ్చిపోయిన ఒక గుంపు చంపారని సోషల్ మీడియాపై షేర్ చేయబడిన క్లెయిమ్ అసత్యము.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు