కోవిడ్-19 చికిత్స కొరకు ఓవర్-ది-కౌంటర్ ఔషధాలను స్వయంగా ఉపయోగించడాన్ని వైద్యులు సిఫారసు చేయడము లేదు; ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది
కోవిడ్-19 చికిత్స కొరకు ఓవర్-ది కౌంటర్ సెల్ఫ్-మెడికేషన్ తీసుకోవచ్చు అని క్లెయిమ్ చేస్తున్న వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది.
- By: Urvashi Kapoor
- Published: Feb 10, 2022 at 05:49 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసుల నేపథ్యములో, దీనికి నివారణ/చికిత్స అంటూ క్లెయిమ్ చేస్తున్న అనేక పోస్ట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటువంటి ఒక పోస్ట్ విశ్వాస్ న్యూస్ యొక్క వాట్సాప్ చాట్‌బోట్ పై అందుకుంది. మొదటి రెండు వేవ్స్ కంటే ఇప్పటి ఈ కరోనావైరస్ వేవ్ భిన్నమైనది అని ఈ పోస్ట్ క్లెయిమ్ చేస్తోంది. అంతే కాకుండా, కరోనా సోకిన వ్యక్తికి ముందుగా గొంతు నొప్పి, తరువాత జ్వరము ఆ తరువాత పొడి దగ్గు మరియు కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని ఈ పోస్ట్ లో క్లెయిమ్ చేయబడింది. అలాగే ఈ పోస్ట్ లో తీసుకోవాలని సూచించబడే ఔషధల పేర్లు కూడా పేర్కొనబడ్డాయి. విశ్వాస్ న్యూస్ దర్యాప్తు జరిపింది మరియు ఈ పోస్ట్ తప్పుదోవ పట్టించేదిగా కనుగొనింది. కరోనావైరస్ సోకిన రోగులకు చికిత్సను అందించే నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ లక్షణాలు ప్రతి ఒక్కరికి ఒకే రకంగా ఉండవు అందుచేత చికిత్స కూడా ఒకే రకంగా ఉండదు. ఎవరు తమ వైద్యుడిని సంప్రదించకుండా ఔషధాలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
క్లెయిమ్
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్ట్ ఈ విధంగా ఉంది (ఆంగ్లములోనికి అనువదించబడింది): “ప్రియమైన మిత్రులారా, ఈసారి కరోనా ఇదివరకు రెండు వేవ్స్ కంటే భిన్నంగా ఉంది. దీనిలో ముందుగా గొంతు నొప్పి, తరువాత జ్వరము, ఆ తరువాత పొడి దగ్గు మరియు వీటితో పాటు కడుపు నొప్పి వస్తాయి. కంఠధ్వని మారుతుంది, రుచిలో ఎలాంటి మార్పు ఉండదు…..పై లక్షణాలు అన్ని 3 రోజులలో కనిపిస్తాయి. నాకు 2 రోజుల క్రితం గొంతు నొప్పి తరువాత పొడి దగ్గు వచ్చాయి. ఈరోజు తీవ్రమైన జ్వరముతో చాలా బలహీనంగా ఉంది. ఏ పని చేయాలనిపించడం లేదు. ఎప్పుడు నిద్రమత్తుగా ఉంది. ఇలా ఎవరికైనా అనిపిస్తే, పరీక్ష కొరకు ఎదురుచూడకుండా ఈ క్రింద పేర్కొనబడిన ఔషధాలను తీసుకోవడం ప్రారంభించాలి. దీని గురించి భయపడవలసినది ఏది లేదు, ఎందుకమ్టే 3 రోజులలో అన్ని తగ్గిపోతాయి. ఈసారి శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది మరియు తక్కువ ఆక్సిజన్ స్థాయి వంటి లక్షణాలు లేవు.
1.టాబ్లెట్ మాంటులోక్యాస్ట్ ప్లస్ లివోసిట్రిజైన్………ఉదయం మరియు రాత్రి ఒక టాబ్లెట్.
2.టాబ్లెట్ జింకోవిట్……. ప్రతిరోజు ఒక టాబ్లెట్.
3.టాబ్లెట్ పారాసెటమాల్ 500…. ఒకవేళ జ్వరము వస్తే.
4.టాబ్లెట్ కార్వోల్ ప్లస్…..దీనిని వేడి నీటిలో వేసి ఆవిరి తీసుకోండి.
5.టాబ్లెట్ డాక్సిసైక్లిన్ ….. ఉదయం మరియు రాత్రి ఒక టాబ్లెట్.
6.సిరప్ బ్రో-జెడెక్స్ ………………రోజుకు మూడుసార్లు తీసుకోండి.
దర్యాప్తు
కోవిడ్-19 ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ప్రభావం చూపుతుంది. చాలావరకు ప్రభావితం అయిన వారికి తేలికపాటి నుండి మధ్యస్త అనారోగ్యం ఉంటుంది మరియు ఆసుపత్రిలో చేరే అవసరం లేకుండా కోలుకుంటారు. అయితే కొంతమందికి మాత్రమే ఆసుపత్రిలో చేరి ఇంటెన్సివ్ కేర్ తీసుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు.
విశ్వాస్ న్యూస్ వారు ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్, కొత్త ఢిల్లిలో పల్మనాలజిస్ట్ అయిన డా. నిఖిల్ మోడీ గారితో మాట్లాడారు. థర్డ్ వేవ్ లో రోగులు అనుభవిస్తున్న లక్షణాల గురించి మాట్లాడుతూ, ఇప్పుడు కనిపిస్తున్న లక్షణాలు దగ్గు మరియు జలుగు, ఛాతిలో ఇబ్బంది, జ్వరము మరియు బలహీనత అని ఆయన అన్నారు. కాని అందరిలో ఇటువంటి లక్షణాలే కనిపించడం లేదు. లక్షణాల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమందికి దగ్గు జలుబుతో కూడిన జ్వరము ఉంటే, మరి కొందరికి జ్వరము రావడం లేదు, కొంతమందికి లక్షణాలు కనిపించడం లేదు.
వైరల్ పోస్ట్ ప్రకారం, పై వైరల్ పోస్ట్ లో పేర్కొనబడిన లక్షణాలు ఎవరికైనా ఉంటే, ఎలాంటి పరీక్ష చేయించుకోకుండా ఇందులో క్లెయిమ్ చేయబడిన ఔషధాలను తీసుకోవాలి. కాని స్వయంగా-ఔషధాలు తీసుకోవడానికి బదులు వైద్యుడిని సంప్రదించాలని డా. నిఖిల్ సూచిస్తున్నారు. కోవిడ్-19 ను తేలికగా తీసుకోకూడదు, అది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ప్రభావం చూపవచ్చు.
ఆయన వేరు వేరు లక్షణాలు కలిగిన మరియు ఇటీవల కరోనావైరస్ బారిన పడిన కొంతమంది రోగులను ఉదహరించారు. ఉదా-ఒక రోగికి జ్వరము వచ్చి ఆ తరువాత గొంతు నొప్పి మరియు జలుబు వచ్చాయి, కాని మరొక రోగికి ఇతర లక్షణాలు ఏవి లేకున్నప్పటికీ ఛాతిలో నొప్పి కలిగింది. లక్షణాలు అనేవి ఒక రోగి నుండి మరొక రోగికి భిన్నంగా ఉంటాయి.
ఆరోగ్యము మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ (Mohfw) ప్రకారము కోవిడ్-19 సోకిన రోగులు తమకు చికిత్స అందించే వైద్యుడితో సంప్రదింపులో ఉండాలి మరియు ఏవైనా తీవ్రతల గురించి తక్షణమే తెలియజేయాలి. చికిత్స అందించే వైద్యుడిని సంప్రదించిన తరువాత వారికి ఉన్న ఇతర కో-మార్బిడ్ అనారోగ్యాల కొరకు ఔషధాలను కొనసాగించాలి. వారు హామీ ఇవ్వబడిన ప్రకారము జ్వరము, కారుతున్న ముక్కుమరియు దగ్గుల కొరకు లక్షణాలను అనుసరించి చికిత్సను తీసుకోవాలి. రోగులు రోజుకు రెండుసార్లు గోరువెచ్చని నీటితో పుక్కిలించవచ్చు లేదా ఆవిరి పట్టవచ్చు. Mohfw వారు స్వయంగా ఔషధాలు తీసుకోవడం, రక్త పరీక్షలు, లేదా ఛాతి X-రే లేదా ఛాతి CT వంటి రేడియోలాజికల్ ఇమేజింగ్ పరీక్షలను మీకు చికిత్సను అందించే వైద్యాధికారిని సంప్రదించకుండా చేయకూడదు.
కోవిడ్-19 యొక్క లక్షణాలు లేని కేసులు, తేలికపాటి లక్షణాలు ఉన్న కేసులలో ఈ దిగువన ఇవ్వబడిన ప్రోటోకాల్స్ అనుసరించాలి:
- బాగా గాలి-వెలుతురు ఉన్న గదిలో మీరు స్వీయ నిర్బంధములో ఉండండి
- మూడు పొరలు ఉన్న మెడికల్ మాస్క్ ఉపయోగించండి, 8 గంటలు వినియోగించిన తరువాత లేదా ఒకవేళ ఇంకా ముందే అది తడిసిపోతే లేదా మాసిపోతే దానిని పడేయండి
- సంరక్షకులు గదిలోకి వచ్చే సందర్భములో, సంరక్షకులు మరియు రోగి ఇద్దరు N 95 మాస్క్ ఉపయోగించాలి
- విశ్రాంతి తీసుకోండి మరియు తగినంత హైడ్రేషన్ కొరకు ఎక్కువ ద్రవాలు త్రాగండి
- అన్నివేళల శ్వాస సంబంధ ఆవశ్యకతలను అనుసరించండి
- కనీసము 40 క్షణాల వరకు సబ్బు మరియు నీటితో తరచూ చేతులు కడుక్కోండి లేదా ఆల్కహాల్-ఆధారిత శానిటైజర్ తో శుభ్రం చేసుకోండి
- కుటుంబములో ఇతరులలో వ్యక్తిగత వస్తువులు షేర్ చేసుకోకండి.
- తరచూ తాకే గదిలో ఉపరితలాలు శుభ్రం చేయబడుతున్నాయని నిర్ధారించుకోండి.
- ఒక పల్స్ ఆక్సీమీటర్ తో ఆక్సిజన్ సాచ్యురేషన్ తో రోజూ పర్యవేక్షించుకోండి
- లక్షణాలలో ఏదైనా క్షీణిస్తున్నట్లుగా గమనిస్తే, చికిత్స అందించే వైద్యుడిని తక్షణమే సంప్రదించండి.
ముగింపు: కోవిడ్-19 చికిత్స కొరకు ఓవర్-ది కౌంటర్ సెల్ఫ్-మెడికేషన్ తీసుకోవచ్చు అని క్లెయిమ్ చేస్తున్న వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది.
निष्कर्ष: కోవిడ్-19 చికిత్స కొరకు ఓవర్-ది కౌంటర్ సెల్ఫ్-మెడికేషన్ తీసుకోవచ్చు అని క్లెయిమ్ చేస్తున్న వైరల్ పోస్ట్ తప్పుదోవపట్టించేది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.