X
X

Fact Check : తెలంగాణలోని ఫ్యాక్టరీలో తిరుగుతున్న చిరుతపులి యొక్క పాత వీడియో ఘజియాబాద్ కు సంబంధించినది అని షేర్ చేయబడుతోంది

విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): ఫ్యాక్టరీలో తిరుగుతున్న చిరుతపులి యొక్క వీడియో చాలా వేగంగా సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. వీడియోను షేర్ చేస్తూ, ఘజియాబాద్ లోని లాల్ కువాలోని ఒక ఫ్యాక్టరీలో చిరుతపులి దూరడముతో, అక్కడ గందరగోళం నెలకొందని క్లెయిమ్ చేయబడింది.

వైరల్ వీడియో వెంబడి చేయబడుతున్న క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ వీడియో డిసెంబరు 2022 లో తీయబడింది మరియు తెలంగాణలోని హెటెరో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కు చెందినది, దీనిని ఇప్పుడు ఘజియాబాద్ కు సంబంధించినది అని పేర్కొంటూ షేర్ చేయబడుతోంది.

ఏది వైరల్ అయ్యింది?

ట్విట్టర్ యూజర్ వార్తా మీడియా జూన్ 16, 2023 నాడు వైరల్ వీడియోను షేర్ చేస్తూ, ఘజియాబాద్ లో ఉన్న లాల్ కువాలోని ఒక ఫ్యాక్టరీలో చిరుతపులి తిరుగుతూ ఉందని శీర్షిక వ్రాశారు. చిరుతను చూడగానే ఫ్యాక్టరీలో గందరగోళం ఏర్పడింది మరియు జనాలు పరుగులుపెట్టారు.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడండి.

దర్యాప్తు 

వైరల్ క్లెయిమ్ కు సంబంధించిన వాస్తవాన్ని తెలుసుకోవడం కోసం మేము వీడియో యొక్క చాలా కీ-ఫ్రేమ్ తీసుకొని, వాటి కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ సహాయముతో సెర్చ్ చేశాము. క్లెయిమ్ కు సంబంధించిన ఒక రిపోర్ట్ ది న్యూస్ మినట్ యొక్క వెబ్సైట్ పై డిసెంబరు 17, 2022 నాడు ప్రచురించబడింది. రిపోర్ట్ ప్రకారము, డిసెంబరు 16, 2022 నాడు సంగారెడ్డి జిల్లా గడ్డ పోథారం పారిశ్రామిక క్షేత్రములో ఉన్న హెటెరో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కంపెనీలో ఒక చిరుతపులి దూరింది.

తెలంగాణ టుడే తో సహా ఇతర వార్తా నివేదికలను ఇక్కడ చూడవచ్చు.

లభించిన సమాచారము ఆధారంగా మేము గూగుల్ పై కీవర్డ్స్ సహాయముతో సెర్చ్ చేయడం ప్రారంభించాము. మాకు డిసెంబరు 18, 2022 నాడు కనక్ న్యూస్ అని పేరుగల ఒక యూట్యూబ్ ఛానల్ పై అప్లోడ్ చేయబడిన ఈ వీడియో లభించింది. అందుబాటులో ఉన్న సమాచారము ప్రకారము, “చిరుతపులి అయిదు నుండి ఆరు సంవత్సరాల వయసు ఉన్నది, దీనిని హైదరాబాదు నెహ్రూ జంతుప్రదర్శన శాలకు చెందిన పదిమంది సభ్యుల ఒక బృందము నాలుగు గంటల తరువాత పట్టుకున్నారు.”

దర్యాప్తు సమయములో మాకు క్లెయిమ్ కు సంబంధించిన ఒక ట్వీట్ ఇండియన్ ఎక్స్‎ప్రెస్ యొక్క బల్జీత్ సింగ్ యొక్క ట్విట్టర్  పై లభించింది. బల్జీత్ సింగ్ డిసెంబరు 17, 2022 నాడు చిరుతపులిని పట్టుకున్నారు అనే వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ లో ఇలా వ్రాశార్, నిన్న ఒక చిరుతపులి దారితప్పి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గడ్డ పోథారం పారిశ్రామ క్షేత్రములో ఉన్న ఒక ఔషధాల కంపెనీలోకి వచ్చింది. అటవీశాఖ అధికారులు దీనిని పట్టుకున్నారు. చిరుతపులి హైదరాబాదులోని నెహ్రూ జంతుప్రదర్శన శాలకు తీసుకొని వెళ్తున్నారు.

అదనపు సమాచారము కొరకు మేము ఘజియాబాదు దైనిక్ జాగరణ్ యొక్క రిపోర్టర్ మదన్ పాంచాల్ ను సంప్రదించాము. ఆయన ఇలా అన్నారు, “ఇక్కడ అలాంటి సంఘటన ఏది జరగలేదు. ఈ వీడియో చాలా పాతది, దీని గురించి నేను కొన్ని రోజుల క్రితం అటవీ-శాఖ వారితో మాట్లాడాను. వాళ్ళు కూడా ఇది అసత్యము అని చెప్పారు.”

దర్యాప్తు చివరిలో మాకు అసత్యపు క్లెయిమ్ తో వీడియోను షేర్ చేసిన యూజర్ ఖాతాను స్కాన్ చేశాము. ఈ యూజర్ కు 280 మంది ఫాలోయర్స్ ఉన్నారని మాకు తెలిసింది. యూజర్ జనవరి 2022 నుండి ట్విట్టర్ పై క్రియాశీలకంగా ఉన్నారు.

ముగింపు : విశ్వాస్ న్యూస్ తమ దర్యాప్తులో చిరుతపులికి సంబంధించిన వైరల్ వీడియో వెంబడి చేయబడిన క్లెయిమ్ అసత్యము. ఈ వీడియో డిసెంబరు 2022 కు చెందినది మరియు తెలంగాణలో ఉన్న హెటెరో ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ కు చెందినది. ఇది ఇప్పుడు ఘజియాబాద్ కు సంబంధించినదిగా షేర్ చేయబడుతోంది.

  • Claim Review : ఘజియాబాద్ లోని లాల్ కువాలో ఉన్న ఒక ఫ్యాక్టరీలో ఒక చిరుతపులి దూరింది.
  • Claimed By : ట్విట్టర్ యూజర్ వార్తా మీడియా
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later