2011 అక్టోబర్‌లో ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు కొంతమంది వైరల్ చేస్తున్నారు. మా దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేదిగా నిరూపించబడింది. దాదాపు 9 సంవత్సరాల క్రితం నాటి సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): కోర్టు ధిక్కార కేసులో సుప్రీంలో విచారణ ఎదుర్కొంటున్నసీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆయన గురించి సోషల్ మీడియాలో అనేక రకాల తప్పుడువార్తలు వైరల్ అవుతున్నాయి.
ప్రశాంత్ భూషణ్‌పై దాడి జరిగిన పాత దృశ్యాలను ఇప్పుడు ట్విట్టర్, వాట్సాప్‌లో కొంతమంది వైరల్ చేస్తున్నారు. ప్రశాంత్ భూషణ్ పై ఓ వ్యక్తి దాడిచేయడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు.
2011 నాటి పాత వీడియో ఇప్పుడు కొంతమంది మళ్లీ వైరల్ చేస్తున్నారని విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వెల్లడయ్యింది. 2011 లో ప్రశాంత్ భూషణ్‌పై కోపంగా ఉన్న కొంతమంది యువకులు అతని కార్యాలయంలోకి ప్రవేశించి అతనిపై దాడి చేశారు.
వైరల్ అవుతున్నది ఏంటి ?
రంజన్ (@ IM_Ranjan24x7) అనే ట్విట్టర్ హ్యాండిల్‌పై ఒక న్యూస్ ఛానల్ యొక్క పాత క్లిప్పింగ్‌ను అప్‌లోడ్ చేశారు. దానికి ఈ రైటప్ జోడించారు. : ‘ప్రజలు ప్రశాంత్ భూషణ్‌ను కొట్టడం చూడండి… మీకు ఇది నచ్చితే రీట్వీట్ చేయండి’
ఈ పోస్ట్ చేసిన ట్విట్టర్ లింక్‌ను ఇక్కడ చూడవచ్చు.
ఆ అకౌంట్ అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడండి.
దర్యాప్తు :
ప్రశాంత్ భూషణ్‌పై ఒక వ్యక్తి దాడి చేస్తున్న 48 సెకనుల నిడివిగల వీడియోను విశ్వాస్ న్యూస్ పరిశీలించింది. ఆ వీడియోకు వాయిస్ ఓవర్ సెపరేట్‌గా చెప్పడాన్ని గమనించింది.
దర్యాప్తు యొక్క తదుపరి దశలో, మేము వీడియోను ఇన్‌విడ్ టూల్ ద్వారా అప్‌లోడ్ చేసాము. దీంతో చాలా స్క్రీన్‌షాట్లు సేకరించడం జరిగింది. రివర్స్ ఇమేజ్ టూల్ ద్వారా దీని గురించి కనుగొనడానికి ప్రయత్నించాము. ఇదే వీడియోను టైమ్స్ నౌ లింక్‌లో మేము కనుగొన్నాము. 13 అక్టోబర్ 2011వ తేదీన, టైమ్స్ నౌ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వార్త భగత్ సింగ్ క్రాంతి సేన సభ్యుడు ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసినట్లు రిపోర్ట్ చేసింది. కొంతమంది ప్రశాంత్ భూషణ్ కార్యాలయంలోకి ప్రవేశించి కొట్టారు. మీరు ఈ సంఘటన మొత్తం వివరాలను ఈ లింక్‌లో చూడవచ్చు.
గూగుల్‌లో శోధిస్తున్న సమయంలో బిబిసి హిందీ లింక్‌లో ఒక వార్త కనిపించింది. అక్టోబర్ 13, 2011 న, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు ఆ న్యూస్‌రిపోర్ట్‌లో ఉంది.
అనంతరం విశ్వాస్ న్యూస్ ప్రశాంత్ భూషణ్‌ను సంప్రదించింది. కొంతమంది పాత సంఘటనను ఇప్పుడు వైరల్ చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇది అక్టోబర్ 2011లో జరిగిన సంఘటన.
చివరగా… ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసిన పాత వీడియోను ఇప్పుడు వైరల్‌గా మార్చిన ఈ ట్విట్టర్ హ్యాండిల్ ప్రొఫైల్ పరిశీలించడం జరిగింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ 2015 మార్చిలో క్రియేట్ చేసినట్లు గుర్తించాము. ఈ ప్రొఫైల్‌ను 8వేల మందికి పైగా ఫాలో అవుతున్నారు.
निष्कर्ष: 2011 అక్టోబర్‌లో ప్రశాంత్ భూషణ్‌పై దాడి చేసిన వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు కొంతమంది వైరల్ చేస్తున్నారు. మా దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించేదిగా నిరూపించబడింది. దాదాపు 9 సంవత్సరాల క్రితం నాటి సంఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923