ఈ వీడియో డమాస్కస్, సిరియా నుండి తీసుకోబడిందని మరియు నాలుగు నెలల పాతదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ పాత వీడియో హమాస్ చీఫ్ మరణానికి తప్పుగా లింక్ చేయబడింది.
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్). టెహ్రాన్, ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాపై దాడిని చూపుతోందని క్లెయిమ్ చేయబడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒక భవనము యొక్క శిధిలాలను చూపుతుంది, దీనిని యూజర్లు షేర్ చేస్తూ దాడికి సంబంధించినదిగా దీనిని లింక్ చేస్తున్నారు.
ఈ వీడియో డమాస్కస్, సిరియా నుండి తీసుకోబడిందని మరియు నాలుగు నెలల పాతదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. ఈ పాత వీడియో హమాస్ చీఫ్ మరణానికి తప్పుగా లింక్ చేయబడింది.
ఈ వైరల్ పోస్ట్ ను షేర్ చేస్తూ, ఫేస్బుక్ యూజర్ ఇలా వ్రాశారు, “టెహ్రాన్: ఇస్మాయిల్ హనియా పై దాడికి సంబంధించిన దృశ్యం. ఇది ఒక దెబ్బవేయడం కాదు, ఇది ఆత్మాహుతి క్వాడ్‌కాప్టర్ దాడి.”
పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
మేము గూగుల్ లెన్స్ ద్వారా వైరల్ వీడియోను సెర్చ్ చేయడం ద్వారా మా దర్యాప్తును ప్రారంభించాము మరియు ఈ వీడియో ఏప్రిల్ 2, 2024 నాడు అప్లోడ్ చేయబడిన X పోస్ట్ అని కనుగొన్నాము. అందించబడిన సమాచారము ప్రకారము, ఈ వీడియో డమాస్కస్ లో జరిగిన దాడికి సంబంధించినది.
ఈ వీడియో డమాస్కస్, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయము పై జరిగిన దాడికి సంబంధించినది అని క్లెయిమ్ చేస్తూ ఈ వైరల్ వీడియో వేరొక X హ్యాండిల్ పై ఏప్రిల్ 2, 2024 నాడు పోస్ట్ చేయబడిందని కూడా మేము తెలుసుకున్నాము.
మా దర్యాప్తును కొనసాగిస్తూ, మాకు Al-జజీరా నుండి ఏప్రిల్ 2, 2024 తేదీ ఉన్న ఒక రిపోర్ట్ లభించింది. దీని ప్రకారం, అనుమానాస్పద ఇస్రాయల్ యుద్ధవిమానాలు సిరియాలోని రాయబార కార్యాలయముపై బాంబు పేల్చాయి మరియు ఈ దాడిలో ఇరాన్ సైనిక సలహాదారులు ఏడుమంది చంపబడ్డారు.
ఈ దాడి గురించి న్యూ యార్క్ టైమ్స్ వెబ్సైట్ పై ఏప్రిల్ 14 తేదీ వ్యాసం ఒకటి మాకు లభించింది. ఈ వ్యాసం ప్రకారం, వైరల్ వీడియోలో ఇదే భవనము యొక్క చిత్రము కనిపించింది. ఇక్కడ చిత్రము యొక్క మూలముగా గెట్టి ఇమేజెస్ ఉదహరించబడ్డాయి మరియు ఇవ్వబడిన సమాచారము ప్రకారం, ఇది డమాస్కస్ లోని ఇరాన్ రాయబార కార్యాలయముపై బాంబు దాడికి సంబంధించిన చిత్రము.
న్యూ యార్క్ టైమ్స్ వెబ్సైట్ పై ఉన్న రిపోర్ట్ ను చూస్తే, ఇది వైరల్ వీడియోలో చూసిన అదే భవనము అని మరియు ఇది డమాస్కస్ లో జరిగిన దాడికి సంబంధించినదని మరియు టెహ్రాన్ కు సంబంధించినది కాదని స్పష్టం అవుతోండి
రిపోర్ట్స్ ప్రకారము, “హమస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో బుధవారం ఉదయం హత్యకు గురైయ్యారు”.
మా వార్తా సెర్చ్ లో, ‘ఇసలామి రెవొల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జిసి) నుండి వచ్చిన స్టేట్మెంట్ మాకు లభించింది, దీని ప్రకారము, ఉత్తర టెహ్రాన్ లో హనియా హత్యచేయబడ్డారు.
వైరల్ వీడియో యొక్క ప్రామాణికతను ధృవీకరించుటకు, మేము ఇరాన్-ఆధారిత ఫాక్ట్ చెక్కర్ ఫాటిమ కరీం ఖాన్ ను సంప్రదించాము మరియు ఆమెకు వైరల్ వీడియోను షేర్ చేశాము. వైరల్ వీడియో టెహ్రాన్ నుండి కాదని మరియు హత్యకు దీనికి ఎలాంటి సంబంధం లేదని ఆమె ధృవీకరించారు.
తప్పుదోవపట్టించే పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ ను సమీక్షించేటప్పుడు, ఈ యూజర్ పాకిస్తాన్ నివాసి అని మేము కనుగొన్నాము.
ముగింపు: మా దర్యాప్తులో, వైరల్ వీడియో డమాస్కస్, సిరియాకు సంబంధించినదని మరియు నాలుగు నెలల పాతదని మేము కనుగొన్నాము. ఈ పాత వీడియో ఇస్మాయిల్ హనియా మరణానికి లింక్ చేస్తూ నకిలీ క్లెయిమ్స్ తో సర్క్యులేట్ చేయబడుతోంది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923