వాస్తవ తనిఖీ : ఇవి థాయిలాండ్‌లో వరదబాధితులకు పంచిన లిక్కర్ బాటిళ్లు – దుబ్బాక ఉప ఎన్నికలో పంచుతున్నవి కాదు
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, మద్యం సీసాల ప్యాకింగుల వైరల్ ఫోటో దుబ్బాకతో తప్పుగా ముడిపడి ఉన్నట్లు కనుగొనబడింది. ఇది నిజానికి థాయిలాండ్ నుండి వచ్చిన పాత ఫోటో. ఇప్పుడు ఎన్నికల సమయంలో వైరల్ అవుతోంది.
- By: Sapthagiri Gopagoni
- Published: Nov 2, 2020 at 03:59 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గానికి జరుగుతున్న ఉప ఎన్నిక వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్యం సీసాలను ప్యాక్ చేసిన కవర్లతో కూడిన ఫోటో అది. ఈ మద్యం బాటిళ్లు దుబ్బాక ఎన్నికలో ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారని ప్రచారం చేస్తున్నారు. ‘తెలంగాణలో ఉచితంగాఇస్తానన్న వ్యాక్సిన్ దుబ్బాకలో సిద్ధంగా ఉంది’ అని ఆ ఫోటో కింద రైటప్ ఇచ్చారు.
విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్‌ను విచారించగా, ఆ ఫోటో థాయ్‌లాండ్‌కు చెందినదని, దుబ్బాకకు సంబంధించినదిగా తప్పుడుగా వైరల్ అవుతోందని కనుగొనడం జరిగింది.
దావా :
ట్విట్టర్ యూజర్ Prawin Gopani @Prawingopani246 తన ప్రొఫైల్‌లో అక్టోబర్ 28వ తేదీన ఒక ఫోటోను పోస్ట్ చేశారు. ‘తెలంగాణలో ఉచితంగాఇస్తానన్న వ్యాక్సిన్ దుబ్బాకలో సిద్ధంగా ఉంది’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చారు. ఆ పోస్ట్‌ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
దీనికి సంబంధించిన అర్కైవ్ వెర్షన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరికొందరు యూజర్లు కూడా ఈ ఫోటోను దుబ్బాక ఉప ఎన్నికలకు ఆపాదిస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ వైరల్ పోస్ట్, దీనికి సంబంధించిన అర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడండి
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించి ఈ ఫోటోను శోధించడం ప్రారంభించింది. దీంతో థాయ్ భాషా బ్లాగులో ఒక కథనాన్ని మేము కనుగొన్నాము. ఆ కథనంలో ఉన్న ఫోటోనే.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలో ఉపయోగించారు. గూగుల్ ట్రాన్స్‌లేట్ సహాయంతో మేము ఈ కథనాలను అనువదించినప్పుడు, థాయ్‌లాండ్‌లోని ఉబన్ రాట్‌చానీలో 2019 వరద సమయంలో, ఇతర వస్తువులతో పాటు మద్యం కూడా పంపిణీ చేయబడిందని మేము కనుగొన్నాము.
థాయ్‌హిట్జ్.కామ్ వెబ్‌సైట్‌లో అదే ఫోటోను మేము కనుగొన్నాము. వరద బాధితులకు మద్యం పంపిణీ చేసినట్లు కూడా చెప్పబడింది.
దర్యాప్తులో, థాయ్ టివి సోషల్ అనే ఫేస్‌బుక్ పేజీలో కూడా ఈ వైరల్ ఫోటోను మేము కనుగొన్నాము. ఇది సెప్టెంబర్ 22, 2019 న పోస్ట్ చేయబడింది.
వైరల్ ఫోటో దుబ్బాకకు సంబంధించినది కాదని ఇది రుజువు చేస్తోంది. విశ్వాస్ న్యూస్ హ్యాన్స్ ఇండియా మెదక్ జిల్లా ప్రతినిధి వెంకటోళ్ల శివ గౌడ్‌ను సంప్రదించింది. ఈ వైరల్ ఫోటోకు దుబ్బాకతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన యూజర్ ప్రొఫైల్‌ను స్కాన్ చేసింది. అతను హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది. ఈ ప్రొఫైల్‌ను సెప్టెంబర్ 2017 లో క్రియేట్ చేశారు. ఈ అకౌంట్‌కు 21 మంది ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో, మద్యం సీసాల ప్యాకింగుల వైరల్ ఫోటో దుబ్బాకతో తప్పుగా ముడిపడి ఉన్నట్లు కనుగొనబడింది. ఇది నిజానికి థాయిలాండ్ నుండి వచ్చిన పాత ఫోటో. ఇప్పుడు ఎన్నికల సమయంలో వైరల్ అవుతోంది.
- Claim Review : 'తెలంగాణలో ఉచితంగాఇస్తానన్న వ్యాక్సిన్ దుబ్బాకలో సిద్ధంగా ఉంది'
- Claimed By : Prawin Gopani
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.