వాస్తవ తనిఖీ : కరోనా నుండి రక్షించే మాస్కులతో ఊపిరితిత్తులకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ సోకుతుందా ? కాదు.. ఈ వాదన తప్పు.

ముగింపు : COVID-19 ను నివారించడానికి మాస్కులు ధరించడం వల్ల ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ రాదు. ఈ వైరల్ దావా తప్పు.

హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్‌) : మాస్క్‌ ధరించడం వల్ల ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ వస్తుందని, దీనివల్ల ప్రజలు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. విశ్వాస్ న్యూస్ ఈ అంశంపై దర్యాప్తు చేసి, వైరల్ అవుతున్న వాదన అబద్ధమని తేల్చింది.

దావా :


ఒక సోషల్ మీడియా పోస్ట్‌ ఇలా వైరల్‌ అవుతోంది : “ప్రజలు మాస్కులు ధరించి ఊపిరితిత్తుల ఫంగల్ ఇన్ఫెక్షన్లతో ఆసుపత్రులకు వెళ్ళడం ప్రారంభించారు !! మీ మాస్క్‌ నుండి కాస్త బ్రేక్‌ తీసుకోండి.”

ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :


వైరల్ అవుతున్న వాదన 2020 జూలై 3వ తేదీన పోస్ట్‌ చేయబడింది. అప్పటి నుండి ఈపోస్ట్‌ 17,000 సార్లు షేర్‌ చేయబడింది.

మాస్కు ఊపిరితిత్తుల్లో ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌కు కారణం అవుతుందా, కాదా అని తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌ రిపోర్టులను మేం పరిశీలించాం. ఈ వాదనను నిరూపించడానికి అవసరమైన డేటా ఎక్కడా కనిపించలేదు.

న్యూ ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ నిఖిల్ మోడీతో మాట్లాడాము. తద్వారా ఈ వాదనను రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని మేము కనుగొన్నాము.

“ఫేస్ మాస్క్‌ ఉపయోగించిన తర్వాత ఎవరూ ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కోవడాన్ని నేను చూడలేదు. గంటల తరబడి మాస్క్‌లు ధరించడం ద్వారా ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసే అనేక వృత్తులు ఉన్నాయి. మాస్క్‌ ధరించడం వల్ల ఊపిరితిత్తుల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్‌ రావొచ్చనే వాదన పూర్తిగా అబద్ధం. ” అని డాక్టర్‌ నిఖిల్‌ మోడీ చెప్పారు.

కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సంజీవ్ కుమార్‌తో కూడా మేము మాట్లాడాము. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పోస్ట్‌ను పరిశీలించిన తర్వాత.. ఇది నకిలీ దావా అని ఆయన కూడా స్పష్టం చేశారు.

వాస్తవానికి, కరోనా వైరస్ నుండి రక్షణ పొందటానికి మాస్కులు ధరించాలని గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖలు ప్రజలకు సలహా ఇస్తున్నాయి.

యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలి. ముఖ్యంగా సామాజిక దూరాన్ని పాటించడం సాధ్యం కాని పరిస్థితుల్లో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలి.

2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని లేదా సహాయం లేకుండా మాస్కును తొలగించలేకపోతున్నారని ఇక్కడ గమనించాలి. వారి నోరు మూసి ఉంచకూడదు.

DISCLAIMER : విశ్వాస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్‌ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్‌ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.

निष्कर्ष: ముగింపు : COVID-19 ను నివారించడానికి మాస్కులు ధరించడం వల్ల ఊపిరితిత్తులకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్ రాదు. ఈ వైరల్ దావా తప్పు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు