వాస్తవ తనిఖీ: పాము విచిత్ర శబ్దాలు చేస్తున్న ఒక వైరల్ వీడియో తెలంగాణా, కరీంనగర్ నుండి సంబంధం లేని, అసత్యమైన దావా వైరల్ అయ్యింది
ముగింపు: విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో పాము యొక్క వైరల్ వీడియోకు సంబందించి చేయబడిన క్లెయిమ్ అసత్యము అని కనుగొనబడింది. ఈ వీడియోకు తెలంగాణాలోని కరీంనగర్ కు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ వీడియోలో కనిపించే పాము ఈస్టర్న్ హాగ్నోస్ జాతికి చెందినది. నిజానికి ఈ పాము శబ్దాలు చేయలేదు. అయితే దాని నోరు తెరచుకోవడం మరియు మూసుకోవడం సమయములో ఒక యూట్యూబర్ ఈ శబ్దాలను అందించారు, ఈయన ఛానల్ యొక్క వీడియో కరీంనగర్ కు చెందినది అని వైరల్ చేయబడింది.
- By: ameesh rai
- Published: Jun 27, 2021 at 11:06 AM
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): విచిత్ర శబ్దాలు చేస్తున్న ఒక పాము యొక్క వీడియో సామాజిక మాధ్యమములో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో తెలంగాణా రాష్ట్రానికి చెందిన కరీంనగర్ కు చెందినది అని సామాజిక మాధ్యమ యూజర్లు దావా చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఇది అసత్యము అని తేలింది. వైరల్ వీడియోలో కనిపించే పాము ఈస్టర్న్ హాగ్నోస్ జాతికి చెందినది. నిజానికి ఈ పాము శబ్దాలు చేయడము లేదు. అయితే దాని నోరు తెరచుకోవడం మరియు మూసుకోవడం సమయములో ఒక యూట్యూబర్ ఈ శబ్దాలను అందించారు, ఈయన ఛానల్ యొక్క వీడియో కరీంనగర్ కు చెందినది అని వైరల్ చేయబడుతోంది.
ఏది వైరల్ అవుతోంది
ట్విట్టర్ యూజర్ Raza Mehdi జూన్ 7, 2021 నాడు ఒక వీడియో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ యొక్క కాప్షన్ లో వీడియో కరీంనగర్ కు చెందినది అని తెలుపబడింది. వీడియోలో Ntv telugu అనే లోగో చూడవచ్చు.
ఈ ట్వీట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు. ట్విట్టర్ లో మరింత శోధించిన తరువాత మాకు ఈ వీడియో DONTHU RAMESH పేరున ఉన్న ఒక ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా లభించింది. అయితే, ఈ వీడియోలో ఈ ఛానల్ యొక్క లోగో లేదు కాని ఈ యూజర్ చేసిన ట్వీట్ లో కూడా ఇది కరీంనగర్ లో జరిగిన వింతగా చెప్పబడింది. దీనిని ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
దర్యాప్తు
విశ్వాస్ న్యూస్ ముందుగా InVID సాధనములో వేసి ఈ వీడియో యొక్క కీఫ్రేమ్స్ సాధించింది. కీఫ్రేమ్స్ లో గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ టూల్ ఉపయోగించినప్పుడు మాకు ఇలాంటి చాలా ఫలితాలు లభించాయి. ఈ వీడియో మాకు Kalim Khan అనే ఒక యూట్యూబ్ ఛానల్ లో కూడా లభించింది. ఈ వీడియో యొక్క శీర్షికలో కొన్ని హ్యాష్‌ట్యాగ్ లు ఉపయోగించబడ్డాయి మరియు ఈ వీడియో బహుశా వేరే దేశానికి చెందినది అని, అక్కడి స్థానిక న్యూస్ ఛానల్ లో ఇది తెలంగాణాకు చెందినది అని చెప్తున్నాయి అని డిస్క్రిప్షన్ లో తెలియజేయబడింది. ఈ వీడియోను ఈ దిగువన చూడవచ్చు.
ఈ వీడియో శీర్షికలో # Hognose snake # Mike Martin అని రెండు హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించబడ్డాయి. మేము ఈ రెండిటిని కీవర్డ్స్ లాగా యూట్యూబ్ లో సెర్చ్ చేశాము. మేము Mike Martin పేరున ఒక యూట్యూబ్ ఛానల్ కనుగొన్నాము. ఈ ఛానల్ లో మేము Hognose snake సంబంధిత కొన్ని వీడియోలు లభించాయి. మాకు ఈ ఛానల్ లో కరీంనగర్ అని చెప్తూ వైరల్ చేయబడిన పాము వీడియో కూడా లభించింది. ఈ వీడియో ఈ ఛానల్ లో మే 5, 2021 నాడు పోస్ట్ చేయబడింది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ను ఎడిట్ చేసి Mike Martin ఈ వీడియోలో వస్తున్న శబ్దాలు పాము చేసినవి కాదని, తాను చేసిన శబ్దాలని తెలిపారు. భారతదేశములో ఈ వీడియో వైరల్ అయిన తరువాత దీని గురించి వెల్లడించవలసి వచ్చిందని ఆయన తెలిపారు. ఆయన డిస్క్రిప్షన్ లో #Karimnagar# అని కూడా చేర్చారు. ఈ వీడియో ఈ దిగువన చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ వైరల్ అయిన వీడియోకు సంబంధించి గూగుల్ పై ఓపెన్ సెర్చ్ చేసి తెలంగాణాలోని కరీంనగర్ లో ఇటువంటి ఒక వీడియో తయారుచేయబడిందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంది. మాకు తెలంగాణ టుడే వెబ్సైట్ పై జూన్ 8, 2021 నాడు ప్రచురించబడిన ఒక నివేదికలో దీని గురించి సమాచారం లభించింది. ఆ నివేదిక ప్రకారం కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలములో వెలిచాల గ్రామములోని ఒక వ్యక్తి ఈ వీడియోని వైరల్ చేశారు. ఈ వ్యక్తి చుట్టుపక్కల క్రికెట్ ఆడుకునే యువతను భయపెట్టాలని అనుకున్నారు. అందువలన ఆయన ఈ వీడియోను డౌన్లోడ్ చేసి, దీనిని అ ప్రాంతానికి చెందినదిగా చెప్తూ స్థానిక వాట్సప్ గ్రూప్ లో షేర్ చేశారు. దీని తరువాత ఒక ప్రాంతీయ ఛానల్ ద్వారా ఈ వీడియోను రన్ చేసిన తరువాత, ఇది వైరల్ అయ్యింది. ఈ నివేదికను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ ను కరీంనగర్ పోలీస్ కమీషనర్ వీ బి కమలాసన్ రెడ్డిగారికి షేర్ చేశారు. ఆయన కూడా ఈ వైరల్ వీడీయో కరీంనగర్ కు చెందినది కాదు అని ధృవీకరించారు. ఒక వ్యక్తి ఈ వీడియోను యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసి సామాజిక మాధ్యమములో వైరల్ చేశారని ఆయన చెప్పారు. పోలీసులు ఆరోపిత వ్యక్తితో మాట్లాడి అతనిని హెచ్చరించారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ క్లెయిమ్ ను షేర్ చేసిన ట్విట్టర్ యూజర్ Raza Mehdi యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేశారు. ఈ ప్రొఫైల్ ఏప్రిల్ 2021 లో తయారు చేయబడింది.
निष्कर्ष: ముగింపు: విశ్వాస్ న్యూస్ చేసిన దర్యాప్తులో పాము యొక్క వైరల్ వీడియోకు సంబందించి చేయబడిన క్లెయిమ్ అసత్యము అని కనుగొనబడింది. ఈ వీడియోకు తెలంగాణాలోని కరీంనగర్ కు ఎలాంటి సంబంధం లేదు. వైరల్ వీడియోలో కనిపించే పాము ఈస్టర్న్ హాగ్నోస్ జాతికి చెందినది. నిజానికి ఈ పాము శబ్దాలు చేయలేదు. అయితే దాని నోరు తెరచుకోవడం మరియు మూసుకోవడం సమయములో ఒక యూట్యూబర్ ఈ శబ్దాలను అందించారు, ఈయన ఛానల్ యొక్క వీడియో కరీంనగర్ కు చెందినది అని వైరల్ చేయబడింది.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.