వాస్తవ తనిఖీ: నీలగిరి పర్వత రైలు ప్రైవేటీకరించబడలేదు, వైరల్ పోస్ట్ అబద్ధం
వైరల్ పోస్ట్ నకిలీ. దక్షిణ రైల్వే నీలగిరి పర్వత రైలును ప్రైవేటీకరించలేదు.
- By: Abbinaya Kuzhanthaivel
- Published: Dec 14, 2020 at 12:07 PM
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : రైలు ముందు కొందరు హోస్టెస్‌లు నిల్చున్న వైరల్ ఫోటో నీలగిరి పర్వత రైలు ప్రైవేటీకరించబడిందనే వాదనతో షేర్ చేయబడింది. సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు అధిక ధరలపై తమ ఆగ్రహం మరియు అసమ్మతిని వ్యక్తం చేశారు.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. ప్రైవేటీకరణ గురించిన వాదనలను దక్షిణ రైల్వే ఖండించింది, మరియు ఈ ఫోటోలు నీలగిరి మౌంటెయిన్ రైల్వే (ఎన్ఎమ్ఆర్) మార్గంలోని చార్టర్డ్ రైలు అని స్పష్టం చేసింది.
దావా :
నీలగిరి మౌంటెయిన్ రైలును ఒక ప్రైవేట్ కంపెనీకి అమ్మినట్లు.. వివిధ కోణాల్లో తీసిన రైలు, హోస్టెస్‌ల ఫోటోలు చాలామంది షేర్ చేసుకుంటున్నారు.
అధిక ఛార్జీలు సోషల్ మీడియాలో ఆగ్రహానికి దారితీశాయి, ఇక్కడ చాలా మంది యూజర్లు ఛార్జీలను రూ .400 నుండి రూ .3 వేలకు పెంచారని ఆరోపించారు. ఫేస్బుక్ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
ట్విట్టర్లో ఇలాంటి వాదనలతో షేర్ చేసుకున్న వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను కూడా మేము కనుగొన్నాము.
దర్యాప్తు :
రైల్వే ప్రైవేటీకరణ భారతీయ రైల్వేకు, పెట్టుబడిదారులకు పెద్ద విజయమని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్‌తో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్ వి.కె. యాదవ్ పేర్కొన్నారు, 109 రైలు మార్గాల్లో నడిచే 151 రైళ్లను 12 గ్రూపులుగా విభజించారంటూ.. కేంద్ర ప్రభుత్వం షార్ట్‌లిస్ట్ చేయడం గురించి ఇంటర్నెట్లో చాలా కథనాలను మేము కనుగొన్నాము.
నీలగిరి మౌంటెయిన్ రైలు ప్రైవేటీకరణపై అనేక ప్రాంతీయ తమిళ భాషా వార్తా కథనాలను మేము కనుగొన్నప్పటికీ, వైరల్ దావాను ధృవీకరించేలా రైల్వే నుండి వెలువడిన ప్రామాణికమైన ఆధారాలు ఏవీ మాకు దొరకలేదు.
మెట్టుపాలయం మరియు ఉదగమండలం (ఊటీ) మధ్య ఎన్ఎంఆర్ మార్గం యొక్క ఆపరేటింగ్ అథారిటీ అయిన సదరన్ రైల్వే యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీలో ప్రైవేటీకరణపై పుకార్ల గురించి మేము ఒక నకిలీ వార్తా హెచ్చరికను కనుగొన్నాము. రైల్వే విభాగం చార్టర్డ్ సేవను మాత్రమే నిర్వహిస్తుందని ఆ పోస్ట్ స్పష్టం చేసింది.
ఈ వాదనను ధృవీకరించడానికి విశ్వాస్ న్యూస్ సాలెం డివిజన్లోని దక్షిణ రైల్వే పీఆర్వో జి.మరియా మైఖేల్‌ని సంప్రదించింది. ఆయన ఈ వైరల్ వాదనలను ఖండించారు. ‘వైరల్ దావా నకిలీ. ఎన్ఎంఆర్ ప్రైవేటీకరించబడలేదు. మేము పర్యాటకుల కోసం డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో చార్టర్డ్ సేవను మాత్రమే నిర్వహించాము. మహమ్మారి కారణంగా దక్షిణ రైల్వే ప్రస్తుతం సాధారణ ఎన్ఎంఆర్ సేవలను నిర్వహించడం లేదు,’ అని పీఆర్వో చెప్పారు.
రైళ్లు పునరుద్ధరించిన తర్వాత ఎన్ఎంఆర్ తన సేవలను సాధారణ ఛార్జీలతోనే కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కథనం ప్రకారం, ‘ఒక ప్రైవేట్ సంస్థ రైలును అద్దెకు తీసుకుని, ఎన్ఎంఆర్ మార్గంలో సేవలను నడుపుతోంది.’ వారాంతంలో, ఒక్కో సీటుకు రూ .3 వేలు వసూలు చేసింది. రెగ్యులర్ ఛార్జీలు ఫస్ట్ క్లాస్ టికెట్‌కు అయితే రూ.600, సెకండ్ క్లాస్‌కు రూ .295. ప్రైవేటు సంస్థ రోజుకు రూ.4.9 లక్షల పూర్తి టారిఫ్ రేటును చెల్లించింది. ఆ సంస్థ దీనికి టిఎన్ -43 గా పేరు మార్చింది, మరియు కోచ్‌లకు కొత్త పెయింట్స్ వేశారు. లోకో పైలట్ మరియు గార్డు రైల్వే ఉద్యోగులు, కానీ సహాయక సిబ్బందిని మాత్రం ఆ సంస్థ నియమించుకుంది.’
వైరల్ వాదనను షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ Dravidan Durai యొక్క సోషల్ స్కానింగ్‌లో, అతను తమిళనాడులోని తిరుకలుకుంద్రంలో నివసిస్తున్నట్లు తేలింది. అతనికి ఫేస్బుక్లో 4, 277 మంది స్నేహితులు, 1,915 మంది ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: వైరల్ పోస్ట్ నకిలీ. దక్షిణ రైల్వే నీలగిరి పర్వత రైలును ప్రైవేటీకరించలేదు.
- Claim Review : నీలగిరి మౌంటెయిన్ రైలు ప్రైవేటీకరించబడింది.
- Claimed By : FB User
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.