Fact Check: ప్రధాని మోదీని ‘లాస్ట్ హోప్ ఆఫ్ యర్త్’ అంటూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనం అవాస్తవం

న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రధాని నరేంద్ర మోడీ కవరేజ్ గురించిన వైరల్ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ Fact Check చేయగా, ఆ స్క్రీన్ షాట్ ఫేక్ అని, ఆ వాదన అబద్ధమని తేలింది. న్యూయార్క్ టైమ్స్ కూడా అలాంటి కథనమేదీ ప్రచురించలేదని ధృవీకరించింది.

న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో న్యూయార్క్ టైమ్స్ తన మొదటి పేజీలో ‘లాస్ట్, బెస్ట్ హోప్ ఆఫ్ ఎర్త్’ అంటూ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.  ‘ప్రపంచంలోనే అత్యంత ప్రియమైన, అత్యంత శక్తివంతమైన నాయకుడు, మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడ ఉన్నారు’ అని స్ట్రాప్లైన్ తో ప్రధాని మోదీ ఫొటో ఈ పోస్ట్లలో ఉన్నాయి.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఈ వైరల్ వాదన అబద్ధమని, న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీ ఫేక్ అని తేల్చింది. అలాంటి కథనమేదీ ప్రచురించలేదని న్యూయార్క్ టైమ్స్ అధికారులు ధ్రువీకరించారు.

వైరల్ పోస్ట్ లో ఏమున్నదంటే.

“#మోదీ జీ #మోదీ ఉంటే ఏదైనా సాధ్యం అవుతుంది మోదీ వంటి ప్రధాని ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది” అనే ఒక శీర్షికతో ‘యోగి సమర్థక్ గ్రూప్’ అనే ఫేస్ బుక్ పేజీ న్యూయార్క్ టైమ్స్ పేరును ఉపయోగించే స్రీన్ షాట్ ను షేర్ చేసింది.

పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

ఇలాంటి పోస్టులను ఇతర సోషల్ మీడియా యూజర్లు కూడా షేర్ చేస్తున్నారు.

విచారణ

వైరల్ వాదనను పరిశోధించడానికి, విశ్వాస్ న్యూస్ న్యూయార్క్ టైమ్స్ వెబ్ సైట్లో కీవర్డ్ సెర్చ్ నిర్వహించింది, కాని ప్రస్తుతం సైట్లో లేదా వారి ఆర్కైవ్ పేజీలలో అలాంటి కథనం కనబడలేదు.

వైరల్ “స్క్రీన్ షాట్”లో, ఈ ఆర్టికల్ ప్రచురించిన తేదీ సెప్టెంబర్ 26, 2021 గా పేర్కొనబడింది, కానీ సెప్టెంబర్ అనేది స్పెల్లింగ్ పొరపాటు. దీనిని ‘సెట్పెంబర్’ అని వ్రాశారు. ఇలాంటి పొరపాటు వారి ప్రామాణికతలపై అనుమానాలను మరింతగా పెంచుతుంది.

విశ్వాస్ న్యూస్ న్యూయార్క్ టైమ్స్ వెబ్ సైట్ లోని ఆర్కైవ్ పేజీలన్నీ ఖచ్చితమైన, సెప్టెంబర్ 26, 2021 తేదీ కోసం చెక్ చేసింది ఇంక ఆ రోజు మొదటి పేజీలో ఒక వంతెన చిత్రం ఉందని గమనించింది. మొత్తం ఎడిషన్ లో ప్రధాని మోడీ గురించి ఎలాంటి వార్తా కథనం రాలేదు.

వైరల్ ఇమేజ్ కు విరుద్ధంగా న్యూయార్క్ టైమ్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఒక ట్వీట్ ను మేము చూశాము. 2021 సెప్టెంబర్ 29న పోస్ట్ చేసిన ఈ ట్వీట్ లో’ ఇది పూర్తిగా కల్పిత చిత్రం. నరేంద్ర మోడీపై మా వాస్తవ నివేదికలన్నీ ఇక్కడ చూడవచ్చు, అంటూ ఆ రిపోర్టులకు సంబంధించిన లింకులను షేర్ చేసింది.

వైరల్ పోస్ట్ లో ఉపయోగించిన ప్రధాని మోడీ ఫోటో కోసం కూడా మేము వెతికాము. జూన్ 26, 2021 తేదీలైన్ తో News18.com భారతీయ వార్తా పోర్టల్లో ఒక వార్తా నివేదికలో ఉపయోగించిన చిత్రం మాకు కనబడింది.

విశ్వాస్ న్యూస్ నేరుగా న్యూయార్క్ టైమ్స్ కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించింది. ప్రచురణ కోసం బయటి కమ్యూనికేషన్లు, న్యూస్ రూమ్ మరియు ఒపీనియన్ డైరెక్టర్ చార్లీ స్టాడ్ ల్యాండర్ ఇలా ప్రతిస్పందించారు: “ఆ చిత్రం కల్పితం, మరియు అటువంటి శీర్షిక లేదా కథనాన్ని ది న్యూయార్క్ టైమ్స్ ప్రచురించలేదు.”

ఎడిట్ చేసిన ఈ ఫొటో 2021 నుంచి పదేపదే వైరల్ అవుతోంది.

దర్యాప్తు చివర్లో ఈ పోస్టును షేర్ చేసిన ‘యోగి సమర్థక్ గ్రూప్’ అనే ఫేస్ బుక్ పేజీని స్కాన్ చేశాము. ఈ పేజీకి 8 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

निष्कर्ष: న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో ప్రధాని నరేంద్ర మోడీ కవరేజ్ గురించిన వైరల్ పోస్ట్ గురించి విశ్వాస్ న్యూస్ Fact Check చేయగా, ఆ స్క్రీన్ షాట్ ఫేక్ అని, ఆ వాదన అబద్ధమని తేలింది. న్యూయార్క్ టైమ్స్ కూడా అలాంటి కథనమేదీ ప్రచురించలేదని ధృవీకరించింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు