రేపటి నుంచి కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు అమలు చేస్తామని మరాఠీలో వైరల్ అవుతున్న సందేశం నకిలీదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో తేల్చింది. ఇదే సందేశం అంతకుముందు ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ప్రచారం చేయబడింది.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): విశ్వాస్ న్యూస్ ఇటీవల తన చాట్‌బాట్ (+91 95992 99372) లో మరాఠీలో ఒక మెస్సేజ్ అందుకుంది, రేపటి నుండి కొత్త కమ్యూనికేషన్ నియమాలను అమలు చేస్తామని అందులో ఉంది.
విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వాదన నకిలీదని కనుగొంది, మరియు ఇది వివిధ సందర్భాల్లో గతంలో కూడా షేర్ చేయబడిందని గుర్తించడం జరిగింది.
దావా :
విశ్వాస్ న్యూస్ చాట్‌బాట్ (+91 95992 99372) లో మా పాఠకుడు షేర్ చేసిన మెస్సేజ్ ప్రకారం, నాసిక్ పోలీసులు ఈ సమాచారం జారీచేసినట్లు పేర్కొన్నారు. మరాఠీలో ప్రచారం అవుతున్న మెస్సేజ్ కింద చూడవచ్చు :
मोहन गायकवाड
पोलीस मुख्यालय नाशिक मो. न. 9923050662
उद्यापासून नवीन संप्रेषण नियम लागू करण्यात येतील
०१. सर्व कॉल रेकॉर्डिंग असतील.
०२. सर्व कॉल रेकॉर्डिंग जतन केले जातील.
०३. व्हॉट्सअॅप, फेसबुक, ट्विटर व सर्व सोशल मीडियावर लक्ष ठेवले जाईल.
०४. ज्यांना माहित नाही अशा सर्वांना कळवा.
०५. आपले डिव्हाइस मंत्रालयीन सिस्टीमशी कनेक्ट होतील.
०६. कोणालाही चुकीचा संदेश पाठवू नये याची खबरदारी घ्या.
०७. आपल्या मुलांना, भाऊ, नातेवाईक, मित्र, ओळखीच्या सर्वांना माहिती द्या की आपण त्यांची काळजी
घ्यावी आणि क्वचितच सोशल साइट्स चालवा.
०८. राजकारणावर किंवा सद्यस्थितीबद्दल आपण सरकार किंवा पंतप्रधानांसमोर असलेले कोणतेही पोस्ट
किंवा व्हिडिओ.. इ. पाठवू नका. ०९. सध्या कोणत्याही राजकीय किंवा धार्मिक विषयावर संदेश लिहिणे किंवा पाठविणे हा गुन्हा आहे … असे केल्याने वॉरंटशिवाय अटक होऊ शकते.
१०. पोलिस अधिसूचना काढतील… त्यानंतर सायबर क्राइम… त्यानंतर कारवाई केली जाईल ते खूप गंभीर आहे.
११. कृपया तुम्ही सर्व, गट सदस्य, प्रशासक, … कृपया या विषयाचा विचार करा. १२. चुकीचा संदेश पाठवू नका याची खबरदारी घ्या आणि सर्वांना माहिती द्या आणि या विषयाची काळजी
घ्या.
१३. कृपया हे सामायिक करा.
తెలుగు అనువాదం :
మోహన్ గైక్వాడ్
పోలీస్ హెడ్ క్వార్టర్స్ నాసిక్ మొబైల్ నెం. 9923050662
రేపటి నుండి కొత్త కమ్యూనికేషన్ నియమాలు అమలు చేయబడతాయి
అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి.
అన్ని కాల్ రికార్డింగ్‌లు సేవ్ చేయబడతాయి.
వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మరియు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై నిఘా ఉంటుంది.
తెలియని ప్రతి ఒక్కరికీ తెలియజేయండి.
మీ డివైజ్‌లు మంత్రిత్వ శాఖ వ్యవస్థకు అనుసంధానించబడతాయి.
ఎవరికీ తప్పుడు సందేశాలు పంపకుండా జాగ్రత్త వహించండి.
మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల గురించి మీరు ఆలోచించేవారిలా తయారు కండి.
సోషల్ మీడియా సైట్‌లను తక్కువగా వాడండి.
ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి లేదా రాజకీయాలకు లేదా ప్రస్తుత పరిస్థితులకు సంబంధించిన ఏ పోస్ట్ లేదా వీడియోను పోస్ట్ చేయవద్దు.
ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యపై సందేశం రూపొందించడం లేదా పంపడం ప్రస్తుతం నేరం – అలా చేస్తే వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు.
పోలీసులు మొదట నోటిఫికేషన్ జారీ చేస్తారు తరువాత ‘సైబర్ క్రైమ్’ నేరంకింద చర్యలు తీసుకుంటారు. ఇది చాలా తీవ్రమైనది.
గ్రూపు సభ్యులు, నిర్వాహకులు, మీరందరూ దయచేసి దీని గురించి తీవ్రంగా ఆలోచించండి.
తప్పుడు సందేశాలు ఎవరికీ పంపించకుండా జాగ్రత్త వహించండి, ప్రతి ఒక్కరికీ తెలియజేయండి, మరియు ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండండి.
దయచేసి దీన్ని వీలైనంత ఎక్కువమందికి తెలియజేయండి.
ఈ పోస్ట్ వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడండి.
మరో పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
దర్యాప్తు :
విస్తృతంగా షేర్ చేయబడుతున్న ఈ పోస్ట్‌లో ఇచ్చిన నంబర్‌కు కాల్‌చేసి విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తును ప్రారంభించింది. నాసిక్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుండి మోహన్ గైక్వాడ్ పేరిట వైరల్ అవుతున్న కాంటాక్ట్ నంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది.
మేము నాసిక్ సిటీ, నాసిక్ రూరల్ పోలీసుల వెబ్‌సైట్‌లలో శోధించాము. మోహన్ గైక్వాడ్ అనే అధికారి పేరు ఎందులోనూ మేము కనుగొనలేదు. అదేవిధంగా ఈ వైరల్ అవుతున్న పోస్ట్‌కు సంబంధించి ఏదైనా పత్రికా ప్రకటన విడుదల చేశారేమో అని తనిఖీ చేశాము. అది కూడా ఎక్కడా కనిపించలేదు.
నాసిక్ సిటీ పోలీసులు మరియు నాసిక్ గ్రామీణ పోలీసుల ట్విట్టర్ ప్రొఫైల్‌లను కూడా విశ్వాస్ న్యూస్ తనిఖీ చేసింది, వారి ట్విట్టర్ ప్రొఫైల్‌లలో కూడా వైరల్ మెస్సేజ్‌లలో ఉన్న సందేశాన్ని మేము కనుగొనలేదు.
విశ్వాస్ న్యూస్ ఆ తరువాత, నాసిక్ రూరల్ సైబర్ పోలీస్ స్టేషన్ పిఐ సుభాష్ అన్ముల్వార్‌ను సంప్రదించింది. అలాంటి సందేశాన్ని తాము విడుదల చేయలేదని ఆయన విశ్వాస్ న్యూస్‌తో చెప్పారు. సామాన్య ప్రజల కాల్స్‌ను రికార్డ్ చేయడం మరియు ఆ రికార్డింగ్‌లను సేవ్ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
నాగ్‌పూర్ సైబర్ సెల్‌కు చెందిన ఎపిఐ విశాల్ మానే కూడా ఈ వైరల్ సందేశం నకిలీదని చెప్పారు.
విశ్వాస్ న్యూస్ ఇదే సందేశంపై మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించింది, ఇది గత సంవత్సరం (2019) హిందీ మరియు ఇంగ్లీష్ భాషలలో వైరల్ అయ్యింది. అప్పుడు, విస్తృతంగా ప్రచారమైన ఈ సందేశం నకిలీదని అయోధ్య పోలీసులు పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన పూర్తి వాస్తవ కథనాన్ని ఇక్కడ చదవండి:
निष्कर्ष: రేపటి నుంచి కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు అమలు చేస్తామని మరాఠీలో వైరల్ అవుతున్న సందేశం నకిలీదని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో తేల్చింది. ఇదే సందేశం అంతకుముందు ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషలలో కూడా ప్రచారం చేయబడింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923