వాస్తవ తనిఖీ: ఎన్డిఏ తన వాస్తవ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్కర్ ను ప్రకటించింది, రంజన్ గొగోయ్ ని కాదు.
ఎన్డిఏ తన వాస్తవ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్కర్ ను ప్రకటించింది, రంజన్ గొగోయ్ ని కాదు.
- By: Pragya Shukla
- Published: Jul 27, 2022 at 12:43 PM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్డిఏ రంజన్ గొగోయ్ ను ప్రకటించింది అనే క్లెయిమ్ తో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది. విశ్వాస్ న్యూస్ తన విచారణలో ఈ క్లెయిమ్ అసత్యము అని కనుగొనింది. ఎన్డిఏ వైపు నుండి ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రకటించబడ్డారు.
క్లెయిమ్:
ఫేస్బుక్ యూజర్ విజయ్ థక్కర్ రంజన్ గొగోయ్ చిత్రాన్ని షేర్ చేసి (అంగ్ల అనువాదము) “అయోధ్య శ్రీరామ మందిరం తీర్పును ఇచ్చిన న్యాయమూర్తి శ్రీ రంజన్ గొగోయ్ గారు, ఎన్డిఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించబడ్డారు* గొగోయ్ గారికి ముందుగా అభినందనలు…. జైశ్రీరాం…కాలిన గాయం మీద ఉప్పు చల్లడం ఎవరైనా మోదీగారి నుండే నేర్చుకోవాలి”.
ఫేస్బుక్ పోస్ట్ యొక్క అంశాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.
దర్యాప్తు:
అనేక కీవర్డ్స్ ద్వారా మేము గొగౌల్ పై సెర్చ్ చేశాము. క్లెయిమ్ కు సంబంధించి మాకు దైనిక్ జాగరణ్ వెబ్సైట్ పై ఒక నివేదిక లభించింది. ఇది జులై 16, 2022 నాడు ప్రచురించబడింది. నివేదిక ప్రకారం, పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ఎన్డిఏ అభ్యర్ధిగా ప్రకటించబడ్డారు. ఈ నిర్ణయము బిజేపి పార్లమెంటరీ బోర్డ్ సమావేశములో తీసుకోబడింది. ఈ సమావేశము తరువాత బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా గారు జగదీప్ ధన్కర్ పేరును ప్రకటించారు. చాలా ఇతర వార్తా వెబ్సైట్లు కూడా ఈ వార్తను ప్రకటించాయి.
దర్యాప్తు సమయములో, మాకు హోమ్ మంత్రి అమిత్ షా గారి అధికారిక ట్విట్టర్ ఖాతా పై వైరల్ క్లెయిమ్ కు సంబంధించి ఒక ట్వీట్ లభించింది. జులై 17, 2022 నాడు, అమిత్ షా గారు జగదీప్ ధన్కర్ తో ఉన్న కొన్ని చిత్రాలను షేర్ చేశారు మరియు ఎన్డిఏ యొక్క ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు.
జులై 18, 2022 నాడు ఆజ్ తక్ వెబ్సైట్ పై ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారము, జగదీప్ ధన్కర్, ఎన్డిఏ నుండి ఉప రాష్ట్రపతి అభ్యర్ధి, తన నామినేషన్ ను ఫైల్ చేశారు. వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ కూడా తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పై నామినేషన్ చిత్రాలను షేర్ చేసింది.
మరింత సమాచారము కొరకు విశ్వాస్ న్యూస్ దైనిక్ జాగరణ్ యొక్క నేషనల్ బ్యూరో చీఫ్ అయిన ఆశుతోష్ ఝా గారిని సంప్రదించింది. ఈ వైరల్ క్లెయిమ్ అసత్యము అని ఆయన మాకు చెప్పారు. జగదీప్ ధన్కర్ ఎన్డిఏ ద్వారా ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికచేయబడ్డారు.
విచారణ యొక్క చివరి దశలో, విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ విజయ్ థక్కర్ యొక్క సామాజిక నేపథ్యము గురించి తనిఖీ చేసింది. విజయ్ థక్కర్ గుజరాత్ నివాసి అని మేము కనుగొన్నాము. ఈ యూజర్ కు ఫేస్బుక్ పై 1200 మంది స్నేహితులు మరియు 129 మంది ఫాలోయర్స్ ఉన్నారు.
निष्कर्ष: ఎన్డిఏ తన వాస్తవ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా జగదీప్ ధన్కర్ ను ప్రకటించింది, రంజన్ గొగోయ్ ని కాదు.
- Claim Review : అయోధ్య శ్రీరామ మందిరం తీర్పును ఇచ్చిన న్యాయమూర్తి శ్రీ రంజన్ గొగోయ్ గారు, ఎన్డిఏ ఉప రాష్ట్రపతి అభ్యర్ధిగా ప్రకటించబడ్డారు.
- Claimed By : విజయ్ థక్కర్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.