వాస్తవ తనిఖీ: నాడార్‌ సామాజిక వర్గాన్ని ప్రపంచంలో పురాతన జాతిగా యునెస్కో ప్రకటించలేదు, వైరల్ పోస్ట్‌ అబద్ధం

ఈ వైరల్ పోస్ట్ అబద్ధం. నాడార్ సామాజిక వర్గాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన జాతిగా యునెస్కో ప్రకటించలేదు.

హైదరాబాద్‌ (విశ్వాస్‌ న్యూస్) : నాడార్ సమాజిక వర్గాన్ని యునెస్కో ప్రపంచంలోని పురాతన జాతిగా ప్రకటించిందంటూ సోషల్‌ మీడియాలో ఓ వైరల్‌ పోస్ట్‌ కనిపించింది.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. వైరల్ వాదనను యునెస్కో ఎడిటర్ ఖండించారు.

దావా :
నాడార్ సామాజిక వర్గాన్ని ప్రపంచంలోని పురాతన జాతిగా యునెస్కో ప్రకటించినట్లు ఒక సర్టిఫికెట్ ఉన్న పోస్టర్ షేర్‌ చేయబడింది. యుఎన్‌ హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీ విభాగం యునెస్కో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, నాడార్ కమ్యూనిటీని ప్రపంచంలోని పురాతన మరియు అత్యంత విశ్వసనీయ జాతిగా ప్రకటించారు. ఆ పోస్టర్లో ఇంకా ఇలా ఉంది, ‘ప్రపంచంలో 3 లక్షలకు పైగా కుల, జాతి సమూహాలను అధ్యయనం చేసిన తరువాత వారు ఈ నిర్ణయానికి వచ్చారు. భారతదేశంలో మరే కులం కూడా మొదటి 10 స్థానాల్లో లేదు’.

మేము ఈ వాదనను మొదట వాట్సప్‌లో మరియు తరువాత ఫేస్‌బుక్‌లో కనుగొన్నాము.

దర్యాప్తు :
నాడార్ సామాజిక వర్గం మరియు యునెస్కో ప్రకటన గురించిన వార్తలు, నివేదికల కోసం మేము ఇంటర్నెట్‌లో శోధించాము. నాడార్ సామాజిక వర్గం తమిళనాడులోని దక్షిణ జిల్లాలైన కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి మరియు విరుదునగర్ వంటి ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న తమిళ కులం అని గుర్తించడం జరిగింది. ఏదేమైనా, యునెస్కో ఈ నిర్దిష్ట సంఘాన్ని ప్రపంచంలోని అత్యంత పురాతన జాతిగా గుర్తించే ప్రామాణికమైన నివేదికలను మేము కనుగొనలేక పోయాము.

వైరల్ పోస్ట్‌లో సర్టిఫికెట్‌ను గమనించినప్పుడు, ‘నాడార్ – ఇండియా’ అనే పదాల ఫాంట్ శైలిని మరియు పరిమాణాన్ని వేరు చేయడాన్ని స్పష్టంగా చూడవచ్చు. మేము ఆ సర్టిఫికెట్‌లో ‘మధ్య ఆసియాలో కనిపించని వ్యక్తులు’ అనే పదాలను గుర్తించాము, మరియు ధృవీకరణ కోసం ఇంటర్నెట్‌లో శోధించాము.

20 ఫిబ్రవరి 2017న యునెస్కో ఆల్మటీ వెబ్‌సైట్‌లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, ‘ఆల్మటీలోని యునెస్కో క్లస్టర్ కార్యాలయం ‘తురాన్’ విశ్వవిద్యాలయం మరియు ఆఫీస్ ఫర్ ది యూత్ పాలసీ ఆఫ్ ఆల్మటీ, యుఎన్‌హెచ్‌సిఆర్‌ సహకారంతో యువత కోసం మధ్య ఆసియాలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి మరియు సమాచార అక్షరాస్యతను పెంచడానికి యువ నాయకులు అనే అంశంపై మూడు గంటల వర్క్‌షాప్ నిర్వహించారు.’

వైరల్ సర్టిఫికెట్‌తో సరిపోలిన పాల్గొనేవారి సర్టిఫికెట్ కాపీని కూడా మేము కనుగొన్నాము.

2017 వర్క్‌షాప్ యొక్క ఈ సర్టిఫికెట్ ఎడిట్‌ చేశారని మరియు నకిలీ దావాలతో షేర్‌ చేయబడిందని మేము ధృవీకరించగలిగినప్పటికీ, మరింత స్పష్టత కోసం యునెస్కో ప్రెస్ సర్వీస్ యొక్క ఇంగ్లీష్ ఎడిటర్ రోని అమెలాన్‌ను సంప్రదించాము. “ఈ వైరల్‌ ప్రచారం పూర్తిగా నిరాధారమైనది” అని అమెలాన్ చెప్పారు.

వైరల్ దావాను షేర్‌ చేసిన ఫేస్‌బుక్ యూజర్ కుమార్ శంకర్ అకౌంట్‌ సోషల్ స్కానింగ్‌లో అతను తమిళనాడుకు చెందినవాడని, ఫేస్‌బుక్‌లో 4,941 మంది స్నేహితులు ఉన్నారని గుర్తించడం జరిగింది.

निष्कर्ष: ఈ వైరల్ పోస్ట్ అబద్ధం. నాడార్ సామాజిక వర్గాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన జాతిగా యునెస్కో ప్రకటించలేదు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు