వాస్తవ తనిఖీ: ఫిఫా ప్రారంభ వేడుక సమయములో మోర్గాన్ ఫ్రీమాన్ ఇస్లాంలోకి మారలేదు, వైరల్ పోస్ట్ నకిలీది

వాస్తవ తనిఖీ: ఫిఫా ప్రారంభ వేడుక సమయములో మోర్గాన్ ఫ్రీమాన్ ఇస్లాంలోకి మారలేదు, వైరల్ పోస్ట్ నకిలీది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): అమెరికా నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ హాలీవుడ్ నటుడు. నవంబరు 20 నాడు ఆయన కతార్ లో జరిగిన 2022 ఫిఫా ప్రపంచ కప్ యొక్క ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. ఆ వేడుకలో, ఆయన ఖురాన్ నుండి కొన్ని వచనాలను ప్రస్తావించారు; అయితే, దాని తరువాత, చాలా వైరల్ పోస్ట్ లు ఆ వేడుకలో ఫ్రీమాన్ ఇస్లాంలోకి మారారు అని క్లెయిమ్ చేశాయి.

మోర్గాన్ ఫ్రీమాన్ ప్రేరణాత్మక వక్త ఘనెం అల్-మొఫ్తా తో కలిసి వేదికపై ప్రపంచములోని విభజన గురించిన స్పందనలు మరియు ఇస్లాం యొక్క సందేశము ఏ విధంగా ఐక్యత మరియు అవగాహన సందేశముగా నిలిచింది అని చెప్తూ కొన్ని క్షణాలు షేర్ చేసుకున్నారు, కాని ఆ ప్రపంచ వేదికపై లేదా మరెక్కడా మతాన్ని అంగీకరించలేదు అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది.

క్లెయిమ్

ఫేస్‎బుక్ పేజ్ ‘హోలీ ఖురాన్, జీవితము & ఇకమీదట కొరకు సిద్ధం అయ్యేందుకు ఒక సంపూర్ణ కోడ్’ నవంబరు 22 నాడు ఒక పోస్ట్ లో ఇలా షేర్ చేసింది: ‘అలాహొ అక్బర్, కతార్ లో ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలో మోర్గాన్ ఫ్రీమాన్. ప్రముఖ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ ఇస్లాం అంగీకరించారు.”

పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ లింక్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

విశ్వాస్ న్యూస్ ముందుగా గూగుల్ పై కీవర్డ్ సెర్చ్ నిర్వహించింది మరియు ఇటువంటి క్లెయిమ్స్ చాలా కనుగొనింది. అయితే, ఇవిడ్ టూల్ ద్వారా గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించిన తరువాత, మేము ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలో ఘనెం అల్-మొఫ్తా మరియు మోర్గాన్ ఫ్రీమాన్ యొక్క సంభాషణలను చర్చించిన  ఇటువంటి  చాలా వార్తా లింక్స్ ను గుర్తించాము.

వార్తా నివేదికల ప్రకారము, వేడిక సమయములో, మోర్గాన్ ఫ్రీమాన్ వేదికపై 22-సంవత్సరాల కతారి డిసెబిలిటి కార్యకర్త మరియు ప్రేరణాత్మక వక్త ఘనెమ్ అల్ ముఫ్తా తో కలిశారు. ఇద్దరు కలిసి వేడుకను ప్రారంభించారు, మరియు ఖురాన్ నుండి వచనాలను చదివడముతో సహా ఐక్యత, సహనము మరియు గౌరవము గురించి అభిప్రాయాలను మార్చుకున్నారు. ఖురాన్ నుండి ఒక వచనము ఫిఫా ప్రపంచ కప్ ను ప్రారంభించడం ఇదే మొదటిసారి.

తన ఐకానిక్ గంభీర స్వరముతో, ఫ్రీమాన్ ఈ వాక్యాలను చెప్పారు: “మనము ఇక్కడ ఒక పెద్ద జాతిగా ఇక్కడ సమావేశము అయ్యాము, మరియు ఈ భూమి మనమంతా నివసించే ఒక గుడారము.”

ఫిఫా కు క్రెడిట్ ఇచ్చే on ఇస్లాం ఛానల్  పై ఆయన ప్రారంభ ప్రసంగాలను కూడా విశ్వాస్ న్యూస్ కనుగొనింది. అయితే, వేడుక సమయములో లేదా ఆతరువాత ఆయన ఇస్లాం మతానికి మారినట్లు ఏ వార్తా నివేదికలలో మాకు తెలియరాలేదు.

కతార్ లో ఫిఫా ప్రపంచ కప్ యొక్క అధికారిక పేజ్ కూడా ఫ్రీమాన్ యొక్క ఉచ్ఛారణను పేర్కొంటూ ఒక వ్యాసాన్ని చూపింది. దాని లింక్ ను దయచేసి ఇక్కడ చూడండి.

తన మతపరమైన విశ్వాసాలకు సంబంధించి అసత్యపు వార్తలు ప్రచారము కావడం ఫ్రీమాన్ విషయములో ఇది మొదటిసారి కాదు.

అందుచేత, ధృవీకరణ కొరకు, విశ్వాస్ న్యూస్ వినీత్ రామకృష్ణన్, న్యూస్ 18 స్పోర్ట్స్ ఎడిటర్ తో మాట్లాడింది, ఆయన ఇలా ధృవీకరించారు, “ఇది నకిలీది. ఫ్రీమాన్ వేడుక సమయములో పాల్గొన్నారు, అంతే.”

ఫిఫా గురించి India.com పై కవర్ చేసే జీ మీడియాలో మరొక స్పోర్ట్స్ విలేఖరి అంకిత్ బెనర్జీ, ఇలా చెప్తూ పుకార్లను ఖండించారు, “ఇది తప్పు సమాచారము. ఖురాన్ నుండి వచనాలను చదవడం వలన ఎవరూ ఇస్లాం మతములోకి ఖచ్ఛితంగా మారరు.”

సోషల్ స్కానింగ్ ద్వారా మేము ఫేస్‎బుక్ ‎పేజ్ ‘హోలీ ఖురాన్, జీవితము & ఇకమీదట కొరకు సిద్ధం అయ్యేందుకు ఒక సంపూర్ణ కోడ్’ కు 11,000 ఫాలోయర్స్ ఉన్నారని మేము కనుగొన్నాము. దీని పరిచయము ఇలా ఉంది: ఖురాన్ లో విశ్వాసము నీతిమంతంగా మరియు భక్తితత్వముతో ఉండడములో ఒక భాగము. ఒకరి జీవితాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకొని వస్తుంది.”

ముగింపు: ఇస్లాం మతాన్ని అంగీకరించారు అనే వైరల్ క్లెయిమ్స్ హాలీవుడ్ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ ను చుట్టుముట్టాయి; ఈ నటుడు 2022 ఫిఫా ప్రపచ కప్ వేడుకను ఖురాన్ నుండి కొన్ని వచనాలను చదివి ప్రారంభించారు, కాని ఆయన ఆ మతానికి మారలేదు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు