విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉన్నదని రుజువైంది. 2019 జూలై 10న బిజ్నోర్ మద్రాసలో సోదాలు నిర్వహించారు. అప్పుడు ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, నాలుగు స్థానిక పిస్తోళ్లు, లైవ్ కార్ట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు కాని, అధునాతన ఆయుధాలు లేదా ఏదైనా మెషిన్ గన్ లాంటివి చూడలేదు. మా దర్యాప్తులో, వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని తేలింది.
న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్). యూపీలోని బిజ్నోర్ లోని మద్రాసలో జరిగిన దాడులలో మెషిన్ గన్నులతో సహా ఎన్నో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియా యూజర్లు తెలిపారు. ఈ ఫోటోలో, కొంతమంది వ్యక్తులు పోలీసుల అదుపులో ఉండటం కూడా చూడవచ్చు. విశ్వాస్ న్యూస్ తమ దర్యాప్తులో ఈ వైరల్ పోస్ట్ తప్పుదోవ పట్టించే విధంగా ఉందని రుజువుచేసింది. 2019 లో జరిగిన సంఘటన తప్పుదారి పట్టించే విధంగా ఇప్పుడు వైరల్ అవుతోంది. 2019 జూలై 10న బిజ్నోర్ మద్రాస లో సోదాలు నిర్వహించారు. అప్పట్లో ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, నాలుగు పిస్తోళ్లు, లైవ్ కార్ట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు తప్ప అత్యాధునిక ఆయుధాలు లేదా మెషిన్ గన్ లు కాదు.
విశ్వాస్ న్యూస్ కి తమ టిప్ లైన్ చాట్ బాట్ నంబర్ +91 95992 99372 లో ఈ క్లెయిమ్ వచ్చింది. అందులో, “ఉత్తర ప్రదేశ్ లోని మద్రాస, బిజ్నోర్ దాడిలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు! ఆరుగురు మతగురువుల అరెస్టు! ఇందులో LmG మెషిన్ గన్ కూడా ఉన్నది అని ఆందోళనగా ఉంది! ఒక నిమిషంలో ఎనిమిది వేల రౌండ్లు పేల్చగల సామర్థ్యం కలిగిన మెషిన్ గన్! ఈ వ్యక్తులు ఎంతగా సిద్దపడి ఉన్నారో అర్థం చేసుకోండి! మేల్కొనండి సోదరులారా.”
ఈ వాదనను పరిశోధించడానికి, మేము మొదట కీవర్డ్ తో వెతకడం ప్రారంభించాము. మేము ఈ దాడి వార్తను బిజ్నోర్ మద్రాసలో చాలా చోట్ల చూశాము. కానీ ఆ వార్తలన్నీ 2019 నాటివే, ఇప్పటివి కావు. జూలై 11, 2019 న Jagran.com (ఆర్కైవ్) లో ప్రచురితమైన ఒక వార్తలో, బిజ్నోర్ లోని షేర్కోట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కాండ్లా రోడ్డులోని మద్రాస ఇంకా ఒక ఇంటి మీద పోలీసులు దాడి చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో, ఇంట్లో ఏమీ కనిపించలేదు, కాని పోలీసులు మద్రాసలో పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఆయుధంలో ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, నాలుగు పిస్తోళ్లు మరియు కొన్ని లైవ్ కార్ట్రిడ్జ్ లు ఉన్నాయి. ఆ సమయంలో మద్రాస ఆపరేటర్ తో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వైరల్ ఇమేజ్ ని వెతకడంలో, బిజ్నోర్ పోలీస్ వెరిఫైడ్ హ్యాండిల్ లో 2019 ట్వీట్ లో ఈ ఫోటో మాకు కనిపించింది. ‘మద్రాసలోకి అక్రమంగా ఆయుధాలను రవాణా చేస్తున్న 6గురు నిందితులను షేర్కోట్ పోలీస్ స్టేషన్ అరెస్టు @bijnorpolice. 1 పిస్టల్, 04 కట్టలు, పెద్ద మొత్తంలో కార్ట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నారు.
తదుపరి దశలో విశ్వాస్ న్యూస్ బిజ్నోర్ కు చెందిన క్రైమ్ రిపోర్టర్ వీరేంద్ర దేశ్వాల్ తో దైనిక్ జాగరణ్ కు చెందిన వారితో మాట్లాడింది. “2019 జూలైలో షెర్కోట్ లోని మద్రాస మీద పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పోలీసులు మద్రాసను వెతికినప్పుడు ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, నాలుగు పిస్తోళ్లు, కొన్ని కార్ట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు. మద్రాస కు చెందిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో మెషిన్ గన్ ఏదీ దొరకలేదు.”
విశ్వాస్ న్యూస్ 2020 లో కూడా అలాంటి ఒక పోస్ట్ నిజ-నిర్ధారణ చేసింది. ఇక్కడ క్లిక్ చేసి ఆ వార్తను చదవవచ్చు.
చివరగా, తప్పుదోవ పట్టించే పోస్ట్ ను పంపిన ఫేస్ బుక్ అకౌంటును మేము చెక్ చేశాము. యూజర్ దీపక్ పాండే నైనిటాల్ నివాసి.
निष्कर्ष: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేదిగా ఉన్నదని రుజువైంది. 2019 జూలై 10న బిజ్నోర్ మద్రాసలో సోదాలు నిర్వహించారు. అప్పుడు ఒక పిస్టల్, రెండు మ్యాగజైన్లు, నాలుగు స్థానిక పిస్తోళ్లు, లైవ్ కార్ట్రిడ్జ్ లు స్వాధీనం చేసుకున్నారు కాని, అధునాతన ఆయుధాలు లేదా ఏదైనా మెషిన్ గన్ లాంటివి చూడలేదు. మా దర్యాప్తులో, వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించే విధంగా ఉందని తేలింది.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923