X
X

Fact Check: 2018 ఫ్రాన్స్ లెమన్ ఫెస్టివల్ వీడియో గణేష్ పూజ వేడుకలుగా తప్పుగా చూపించబడింది 

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఇది నకిలీది అని కనుగొనింది. ఈ వీడియో బాలీవుడ్ థీమ్ తో ఫ్రాన్స్ లో జరిగిన లెమన్ ఫెస్టివల్ నుండి తీసుకున్న వీడియో. ఇదే వీడియో ఇప్పుడు తాజా వీడియోగా హాలాండ్ కు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేయబడుతోంది.

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): బతాయిలు మరియు నిమ్మకాయలతో తయారు చేయబడిన వినాయకుడి విగ్రహం ఒకటి సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇటీవల హాలాండ్ లో జరిగిన గణేష్ ఉత్సవాలకు సంబంధించినది అని చాలామంది యూజర్స్ క్లెయిమ్ చేస్తున్నారు.

విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసి ఇది నకిలీది అని కనుగొనింది. ఈ వీడియో బాలీవుడ్ థీమ్ తో ఫ్రాన్స్ లో జరిగిన లెమన్ ఫెస్టివల్ నుండి తీసుకున్న వీడియో. ఇదే వీడియో ఇప్పుడు తాజా వీడియోగా హాలాండ్ కు ఆపాదిస్తూ తప్పుగా షేర్ చేయబడుతోంది.

వైరల్ పోస్ట్ లో ఏముంది

ఫేస్‎బుక్ యూజర్ నీలేష్ కెనియా సెప్టెంబరు 10, 2024 నాడు ఒక వీడియో షేర్ చేస్తూ, ఈ శీర్షిక వ్రాశారు: “హాలాండ్ లో బతాయిలతో అద్భుతమైన వినాయకుడి విగ్రహం తయారుచేయబడింది. ఓం గం గణపతయే నమః” పోస్ట్ యొక్క ఆర్కైవ్ద్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

వైరల్ వీడియోను దర్యాప్తు చేయుటకు, మేము వీడియో నుండి అనేక కీ ఫ్రేమ్స్ సంగ్రహించాము మరియు గూగుల్ రివర్స్ ఇమేజ్ ను నిర్వహించాము. దీని వలన మాకు ఫిబ్రవరి 18, 2018 నాడు ప్రచురించబడిన లైవ్ హిందుస్తాన్ website పై ఉన్న ఒక వార్తా నివేదిక లభించింది. వీడియోలో మెంటన్, ఫ్రాన్స్ లో జరిగిన లెమన్ ఫెస్టివల్ నుండి ఒక దృశ్యాన్ని చూపుతోందని ఆ వ్యాసము పేర్కొనింది. ఇక్కడ వినాయకుడి విగ్రహము నిమ్మకాయలు మరియు బతాయిలతో తయారు చేయబడింది మరియు బాలీవుడ్ ఆ సంవత్సరం థీమ్ గా తీసుకోబడింది.

మా దర్యాప్తులో, మాకు వైరల్ వీడియోకు సంబంధించిన ఒక చిత్రము కూడా istockphoto.com పై లభించింది. దాని వెంబడి ఉన్న వివరణలో ఆ చిత్రము మెంటన్, ఫ్రాన్స్ లో ఫిబ్రవరి 18, 2018 నాడు జరిగిన లెమన్ ఫెస్టివల్ లో తీసుకోబడింది. ఇక్కడ వినాయకుడి విగ్రహం బత్తాయిలు మరియు నిమ్మకాయలతో చేయబడింది.

ఫిబ్రవరి 18, 2018 నాడు అప్లోడ్ చేయబడిన ఈ వీడియో మాకు ‘AGENCIA EFE’ యొక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై కూడా కనిపించింది. ఈ వీడియో మెంటన్, ఫ్రాన్స్ లో బాలీవుడ్ థీమ్ తో జరిగిన లెమన్ ఫెస్టివల్ నుండి తీసుకోబడిందని స్పష్టీకరించింది.

ఈ వీడియో సోషల్ మీడియాపై గతములో కూడా వైరల్ అయ్యింది. ఆ సమయములో, మేము ఒక ఫ్రెంచ్ వెబ్సైట్ festivals@allexciting.com ను ఈమెయిల్ ద్వారా సంప్రదించాము మరియు వారి స్పందన ఈ వీడియో మెంటన్, ఫ్రాన్స్ లో జరిగిన లెమన్ ఫెస్టివల్ నుండి తీసుకోబడిందని, హాలాండ్ లో జరిగినది కాదని ధృవీకరించింది

మేము లెమన్ ఫెస్టివల్ యొక్క 2024 ఎడిషన్ ను కూడా సెర్చ్ చేశాము మరియు మాకు euronews.com  పై ప్రచురించబడిన ఒక ఆర్టికల్ లభించింది. ఇందులో ఆ సంవత్సరం థీమ్ ఒలంపిక్స్ కేంద్రంగా తీసుకోబడిందని పేర్కొనబడింది.

చివరిగా, మేము వీడియోను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేశాము మరియు ఈ యూజర్ ముంబై నివాసి అని మరియు ఆయన ఒక ప్రత్యేక భావజాలముచే ప్రభావితం అయ్యారని కనుగొన్నాము.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తు చేసింది మరియు ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది అని కనుగొనింది బత్తాయిలు మరియు నిమ్మకాయలతో తయారు చేయబడిన . వినాయకుడి విగ్రహము మెంటన్, ఫ్రాన్స్ లో జరిగిన 2018 లెమన్ ఫెస్టివల్ నుండి తీసుకోబడింది, హాలాండ్ కాదు మరియు ఈ వీడియోకు ప్రస్తుత సంఘటనలకు ఎలాంటి సంబంధం లేదు.

  • Claim Review : బత్తాయిలు మరియు నిమ్మకాయలతో తయారుచేయబడిన వినాయకుడి విగ్రహము
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: Nilesh Keniya నీలేష్ కెనియా
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later