వాస్తవ తనిఖీ: తమిళనాడులో ఉత్తర భారతీయులపై దాడుల పేరున రాజస్థాన్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ యొక్క వీడియోలు వైరల్ అవుతున్నాయి

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): తమిళనాడులో హిందీ-మాట్లాడే వారిపై హింస ఆరోపణలతో అనేక వీడియోలు సోషల్ మీడియాపై వైరల్ అవుతున్నాయి. అయితే, సమగ్ర దర్యాప్తు తరువాత, ఈ క్లెయిమ్స్ అసత్యాలు అని విశ్వాస్ న్యూస్ కనుగొనింది, ఎందుకంటే ఈ వీడియోలు రాజస్థాన్, కర్నాటక, మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందినవి. ఈ వీడియోలకు తమిళనాడుకు ఎలాంటి సంబంధం లేదు మరియు “ఉత్తర భారతీయులపై హింస” అనే సంబంధిత క్లెయిమ్ అసత్యము. పోలీసుకు ఈ వీడియోలను నకిలీవి అని మరియు హింసకు సంబంధించిన పుకార్లు అధారరహితమైనవి అని కూడా తెలిపారు.

క్లెయిమ్:

ట్విట్టర్ యూజర్ ‘పాట్నా లైవ్ న్యూస్ నెట్వర్క్ (ఆర్కైవ్ లింక్) మార్చ్ 2న ఒక వీడియోను ట్వీట్ చేసింది, ఇందులో కొంతమంది రోడ్డు మీద పట్టపగలు ఒక వ్యక్తిని కత్తితో పొడవడం చూడవచ్చు.

మొహమ్మద్ తన్వీర్ (ఆర్కైవ్ లింక్) యొక్క వెరిఫై చేయబడిన ట్విట్టర్ హ్యాండిల్ ఇటువంటివే కొన్ని వీడియోలను పోస్ట్ చేసింది, కొంతమంది రోడ్డు మీద ఒక వ్యక్తిపై దాడిచేయడం వీటిల్లో చూడవచ్చు. మరొక వీడియోలో, రక్తపు-మడుగులో ఉన్న వ్యక్తి చుట్టూ ఒక గుంపు నిలబడి ఉన్నారు.

ఈ వీడియో విశ్వాస్ న్యూస్ యొక్క వాట్సాప్ టిప్‎లైన్ +91-95992-99372 కు కూడా పంపించబడింది. ఇందులో, కొంతమంది యువకులు రోడ్డు మీద ఒక వ్యక్తిపై దాడి చేయడం చూడవచ్చు. ఈ వీడియో కదిలే వాహనముపై నుండి తీయబడింది.

ట్విట్టర్ యూజర్ జై ప్రకాశ్ గుప్త (ఆర్కైవ్ లింక్) ఇటువంటి కొన్ని క్లెయిమ్స్ యొక్క స్క్రీన్ షాట్స్ ను మీడియాలో ప్రచురించబడినవిగా పోస్ట్ చేశారు. ఈ స్క్రీన్ షాట్స్ వెంత ఆయన ఇలా వ్రాశారు, “తమిళనాడులో హిందీ-మాట్లాడే కూలీలపై ఘోరమైన దాడులు జరుగుతున్నాయి.” ఒక యువకుడిపై దాడి జరిగిన చిత్రము కూడా ఇందులో ఉంది. ఫోటోలో, జీన్స్ మరియు చొక్కా వేసుకున్న ఒక వ్యక్తి కింద నేలమీద పడిపోయిన వ్యక్తిపై దాడి చేస్తూ కనిపిస్తారు.

దర్యాప్తు:

వైరల్ అయిన క్లెయిమ్స్ ను ఒకదాని-వెంట-ఒకటిగా మేము వాస్తవ-తనిఖీ నిర్వహించాము.

మొదటి క్లెయిమ్:

మొదటి క్లెయిమ్ ను దర్యాప్తు చేయుటకు, మేము గూగుల్ ఇన్విడ్ టూల్ నుండి దాని కీఫ్రేమ్స్ ను సంగ్రహించాము మరియు ఆ ఫ్రేమ్స్ ను గూగుల్ యొక్క రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో రన్ చేశాము. దీనికి సంబంధించిన ఒక వార్త దైనిక్ భాస్కర్ లో రెండు వారాల క్రితం ప్రచురించబడింది; వైరల్ అయిన వీడియోలను కూడా ఇక్కడ చూడవచ్చు.

భాస్కర్ రిపోర్ట్ ప్రకారము, ఇది శతృత్వముతో ఒక న్యాయవాదిని హత్యచేసిన జోధ్పూర్, రాజస్థాన్ కు సంబంధించిన అంశము. న్యాయవాది జుగ్‎రాజ్ చౌహాన్ యొక్క హత్యకు సంబంధించిన మరొక వీడియో కూడా బయటపడింది. జతియా కాలనీకి చెందిన సోదరులు అనిల్ మరియు ముఖేష్ జుగ్‎రాజ్ చౌహాన్ పై కత్తి మరియు రాళ్ళతో దాడి చేశారు. ఈ కేసులో, పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ వీడియోకు తమిళనాడుకు ఎలాంటి సంబంధం లేదు.

దీనికి సంబంధించి, జోధ్పూర్ కు చెందిన ఒక స్థానిక విలేఖరి, రంజన్ దావే, ఈ వైరల్ వీడియో తమిళనాడుకు చెందినది కాదని, అది న్యాయవాది జుగ్‎రాజ్ చౌహాన్ హత్యకు సంబంధించినది అని ధృవీకరించారు. ఇదివరకు కూడా, ఈ వీడియో వర్గ కోణముతో వైరల్ చేయబడింది. దానిపై విశ్వాస్ న్యూస్ ద్వారా చేయబడిన వాస్తవ-తనిఖీ గురించి ఇక్కడ చదవవచ్చు. రాజస్థాన్ కు చెందిన జోధ్పూర్ లో న్యాయవాది యొక్క హత్యకు సంబంధించిన వీడియో ‘తమిళనాడూలో హిందీ మాట్లాడే వారిపై దాడి’ అనే పేరున షేర్ చేయబడింది అని మా దర్యాప్తు వెల్లడించింది.

రెండవ క్లెయిమ్:

ఈ క్లెయిమ్ అనేక వీడియోలపై ఆధారపడి ఉంది. మొహమ్మద్ తన్వీర్ చే ట్వీట్ చేయబడిన ఆ వీడియోలను తనిఖీ చేయుటకు, ముందుగా మేము దాని నుండి ఒక కీఫ్రేమ్ ను సంగ్రహించి దానిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ వెంబడి రన్ చేశాము. దీని గురించి ఒక వార్తా రిపోర్ట్  సింప్లిసిటి వెబ్సైట్ పై ఫిబ్రవరి 14 నాడు ప్రచురించబడింది; వైరల్ వీడియో యొక్క కొన్ని కీలక ఫ్రేమ్స్ ఇందులో చూడవచ్చు.

రిపోర్ట్ ప్రకారము, విషయము తమిళనాడులోని కోయంబత్తూర్ కు సంబంధించినది. ఒక వ్యక్తి హత్యకు సంబంధించి పోలీసుకు ఏడుమందిని అరెస్ట్ చేశారు.

నిందితులు జిల్లా న్యాయస్థానము ప్రాంగణములో ఒక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఉదంతములో ప్రమేయం కలిగి ఉన్నారు. కోయంబత్తూరు నివాసులు అయిన గోకుల్ మరియు మనోజ్ అనేక నేరాలలో ప్రమేయం ఉన్నవారు అని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 13 నాడూ, ఇద్దరు హియరింగ్ కొరకు కోయంబత్తూరు న్యాయస్థానానికి వెళ్ళారు. నలుగురు వ్యక్తులు న్యాయస్థానము దగ్గర ఉన్న వీధిలో అతనిపై దాడి చేశారు. ఈ సంఘటనలో, గోకుల్ అక్కడికక్కడే చనిపోయాడు, మనోజ్ ఆసుపత్రికి తరలించబడ్డాడు.

ఫిబ్రవరి 13 నాడు ది హిందూలో దీని గురించి ప్రచురించబడిన మరొక వార్తా రిపోర్ట్ లో, ఈ విషయము ఒక గ్యాంగ్ వార్ కు సంబంధించినది అని తెలియజేయబడింది. కవుండంపళయం నివాసి అయిన గోపాల్ అనే యువకుడు గోపాలపురం న్యాయస్థానం ప్రాంగణము సమీపములో హత్యచేయబడ్డాడు. 2021 లో జరిగిన ఒక హత్యలో ఇతని ప్రమేయం ఉంది. అతని భాగస్వామి మనోజ్ వెంట అతను న్యాయస్థానానికి వచ్చినప్పుడు, అయిదుగురు ఉన్న ఒక గ్యాంగ్ అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో మనోజ్ గాయపడ్డాడు. వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్ ఒకదానిని కూడా వార్తా రిపోర్ట్ లో చూడవచ్చు.

దాడికి సంబంధించిన మరొక వీడియో ఫిబ్రవరి 14 నాడు, కార్తిక్ గోపీనాథ్ యొక్క వెరిఫై చేయబడిన హ్యాండిల్ నుండి ట్వీట్ చేయబడింది (ఆర్కైవ్ లింక్)

https://twitter.com/karthikgnath/status/1625211580932841472

అంటే, వీధిలో ఒక యువకుడిపై కొంతమంది యువకులు దాడి చేస్తున్నట్లు ఉన్న వీడియో కోయంబత్తూరులోని ఒక గ్యాంగ్ వార్ కు సంబంధించినది. అయితే, రెండవ వీడియో గురించి మాకు ఎలాంటి సమాచారము అందలేదు. అందుచేత మేము దానిని ధృవీకరించలేము.

మూడవ క్లెయిమ్:

మేము అప్పుడు విశ్వాస్ న్యూస్ యొక్క టిప్‎లైన్ నంబరు పై అందుకోబడిన వీడియోను పరిశీలించాము. మేము దాని నుండి ఒక కీఫ్రేమ్ ను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ ఉపయోగించాము. ఈ సంఘటన గురించిన ఒక వార్తా రిపోర్ట్ జనవరి 23 నాడు ది సౌత్ ఫస్ట్ లో ప్రచురించబడింది. రిపోర్ట్ ప్రకారము, ఈ విషయము హైదరాబాదుకు చెందినది. జనవరి 22 నాడు, జనగాం సాయినాథ్, 29, అనే ఒక వ్యక్తి జియాగూడ, హైదరాబాదులో హత్య చేయబడ్డాడు. ఈ కేసులో పోలీసులు ఆకాష్, సాయి (అలియాస్ టిల్లు) మరియు సందీప్ అనే ముగ్గురు నిందితులను గుర్తించారు.

నాలుగవ క్లెయిమ్:

ట్విట్టర్ యూజర్ యువరాజ్ సింగ్ రాజపూత్ (ఆర్కైవ్ లింక్) ఈ వీడియోను పోస్ట్ చేశారు. చిత్రములో కనిపించిన దాడిచేసిన వ్యక్తిని వీడియోలో కూడా చూడవచ్చు. దీని గురించి దర్యాప్తు చేయుటకు, మేము కీఫ్రేమ్ ను సంగ్రహించాము మరియు గూగుల్ రివర్స్ ఇమేజ్ ఉపయోగించాము. దీనికి సంబంధించిన ఒక వార్తా రిపోర్ట్ మాకు డిజే కాం యూట్యూబ్ ఛానల్ పై లభించింది. ఆగస్ట్ 9, 2021 నాడు అప్లోడ్ చేయబడిన వీడియోలో, విషయము కర్నాటకలోని హవేరికి సంబంధించినది అనే సమాచారము కన్నడ భాషలో ఇవ్వబడింది.

తరువాత, మాకు ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆగస్ట్ 11, 2021 నాడు ప్రచురించబడిన ఒక వార్తా రిపోర్ట్ కు ఒక లింక్ లభించింది. దీని ప్రకారం, మార్గావ్-ఆధారిత పేరుమోసిన నేరస్థుడు అన్వర్ షేక్ అలియాస్ టైగర్ అన్వర్, కర్నాటకలోని హవేరి జిల్లాలోని సావనూర్ లో హత్యచేయబడ్డాడు. నలుగురు దుండగులు పట్టపగలు రోడ్డు మీద షేక్ ను చంపారు.

ఇదివరకు ఈ వీడియో వర్గ కోణము అనే ఒక నకిలీ క్లెయిమ్ తో వైరల్ అయ్యింది. దానిపై విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తు గురించి ఇక్కడ చదవవచ్చు.

ఈ వీడియో తమిళనాడుకు చెందినది కాదు. ఇది కర్నాటకకు చెందిన ఒక నేరస్థుడి హత్యకు సంబంధించినది.
మార్చ్ 2 నాడు, హిందీ-మాట్లాడే ఉత్తర భారతీయులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయి అని సోషల్ మీడియాపై పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి అని తమిళనాడు పోలీసులు ట్వీట్ చేశారు. అలాగే వెరిఫై చేయబడని కంటెంట్ కు పోస్ట్ చేయవద్దని మరియు పుకార్లను పట్టించుకోవద్దని కూడా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) ఒక వీడియో విడుదల చేయడము ద్వారా మొహమ్మద్ తన్వీర్ పోస్ట్ కు స్పందించారు. సమాధానములో, ఈ వీడియోలు కోయంబత్తూరు మరియు త్రిపురాకు ఆపాదించబడ్డాయి మరియు వాటిని త్రిపురాకు లింక్ చేసిన క్లెయిమ్స్ నకిలీవి అని తెలుపబడ్డాయి.

ఇదివరకు, కొన్ని సంఘటనలను తమిళనాడుకు లింక్ చేస్తూ, దైనిక్ జాగరణ్ పేరున నకిలీ వార్తాపత్రిక కట్టింగ్స్ కూడా షేర్ చేయబడ్డాయి. దీనికి సంబంధించి విశ్వాస్ న్యూస్ యొక్క దర్యాప్తు గురించి ఇక్కడ చదవవచ్చు.

విశ్వాస్ న్యూస్ తో మాట్లాడుతూ, డిజిపి కార్యాలయము ఇలా అన్నది, “డిజిపి ఇదివరకే ఈ విషయానికి సంబంధించి ఒక ప్రకటన జారీ చేశారు మరియు ఆ రాష్ట్రములో హిందీ-మాట్లాడే వలస కూలీలు సురక్షితంగా ఉన్నారు.”
ట్విట్టర్ యూజర్ ‘జై ప్రకాశ్ గుప్త’ యొక్క సోషల్ మీడియా స్కాన్ లో, అతను జార్ఖండ్ నివాసి అని మరియు జనవరి 2020 నుండి ట్విట్టర్ పై చురుగ్గా పాల్గొంటున్నారని కనుగొనింది.

ముగింపు: రాజస్థాన్, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వీడియోలు అసత్యపు క్లెయిమ్ తో తమిళనాడు పేరున షేర్ చేయబడ్డాయి. ఒక వీడియో కోయంబత్తూరు, తమిళనాడులో జరిగిన గ్యాంగ్ వార్ కు చెందినది మరియు ‘హిందీ మాట్లాడేవారిపై దాడి జరిగింది’ అనే క్లెయిమ్ కు సంబంధం లేదు. పోలీసులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇతర వీడియోలు కూడా తమిళనాడుకు చెందినవి కాదు మరియు వీటిల్లో భాషా-సంబంధిత హింస లేదు.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు