వాస్తవ తనిఖీ: ఒక నిజమైన రెండు-కాళ్ళ ఒంటెను చూపడానికి ఉద్దేశించబడిన చిత్రము మార్చబడినది

ఒక నిజమైన రెండు-కాళ్ళ ఒంటెను చూపడానికి ఉద్దేశించబడిన చిత్రము మార్చబడినది. అసలైన చిత్రము ఎడిట్ చేయబడింది మరియు నకిలీ క్లెయిమ్ తో షేర్ చేయబడింది.

వాస్తవ తనిఖీ: ఒక నిజమైన రెండు-కాళ్ళ ఒంటెను చూపడానికి ఉద్దేశించబడిన చిత్రము మార్చబడినది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్ట్ సౌదీ అరేబియాలో ఒక మందు పాతర నుండి బతికి బయటపడిన ఒక రెండు-కాళ్ళ ఒంటెను చూపుతోంది. ఆరోపించబడిన సంఘటన గురించి ఒక నేపథ్య కథనము కూడా ఈ చిత్రము వెంట ఉంది. విశ్వాస్ న్యూస్ ఈ పోస్ట్ గురించి దర్యాప్తు చేసి, అది నకిలీది అని కనుగొనింది. అసలైన చిత్రము మార్చబడింది మరియు ఒంటె యొక్క వెనుక కాళ్ళు ఆ అసలైన చిత్రము నుండి తొలగించబడ్డాయి.

క్లెయిమ్

ఫేస్‎బుక్ లో షేర్ చేయబడిన ఒక ఫోటోలో ఒక ఒంటె చూపించబడింది, దీని వెంబడి ఉన్న శీర్షిక ఇలా వ్రాయబడి ఉంది: “సౌదీ అరేబియాలోని ఈ ఒంటె దురదృష్టవశాత్తు ఒక మందుపాతర మీదికి తిరిగినప్పుడు తన శరీరములోని సగభాగం కోల్పోయింది. తన శరీరములోని వెనుక భాగాన్ని కోల్పోయిన తరువాత, శస్త్రవైద్యుల అలుపెరగని శ్రమతో అంతర్గత అవయవాలను ఒక పనితీరు వ్యవస్థలోకి ఏర్పాటు చేశారు. వాళ్ళు ఒంటెకు ఒక కొత్త పనిచేసే పాయువును కూడా సృష్టించారు. ఆ ఒంటె స్థానిక ఆస్ట్రిచ్ కుటుంబముతో కొత్త స్నేహితులను ఏర్పరచుకుంది, అవి కూడా ఈ ఒంటెను తమలో ఒకటిగా సొంతం చేసుకున్నాయి. అందుబాటులో నీటి వనరు లేనప్పుడు ఒంటె నీటిని నేరుగా ఆస్ట్రిచ్ నోళ్ళలోనికి రెగ్యురిటేట్ చేయగలుగుతోంది.”

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వర్షన్ ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు

చిత్రము గురించి దర్యాప్తు కొరకు విశ్వాస్ న్యూస్ గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ నిర్వహించింది. మాకు బ్లాగ్ పోస్ట్ లో ఇటువంటి చిత్రమే లభించింది.

ఈ చిత్రాన్ని డా అబ్దుల్ రజిక్ కకర్ అనే వ్యక్తి అప్లోడ్ చేశారు, ఈయన తననుతాను ఒక జంతు శాస్త్రవేత్త అని అభివర్ణించుకుంటారు. ఈయన తన బ్లాగ్ లో అనేక ఒంటెల చిత్రాలను పోస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈయన ఒంటెల ఫుటేజ్ ను యూట్యూబ్ ఛానల్ పై కూడా అప్లోడ్ చేశారు

ట్విట్టర్ ద్వారా విశ్వాస్ న్యూస్ డా. అబ్దుల్ గారిని సంప్రదించింది. ఆయన ఇలా షేర్ చేశారు: “నేను ఈ చిత్రాన్ని తీశాను కాని ఎవరో దానిని ఎడిట్ చేసి ఒంటె రెండు కాళ్ళు తొలగించారు”

మార్చబడిన చిత్రము బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్తాన్ మరియు ప్రపంచములోని ఇతర దేశాలలో కూడా సర్క్యులేట్ చేయబడింది.”

నాలుగు-కాళ్ళ ఒంటె యొక్క అదే ఫోటో మరొక వెబ్సైట్ పై కూడా షేర్ చేయబడింది, ఇక్కడ వివరాలను చూడండి.

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ ను షేర్ చేసిన యూజర్ యొక్క ప్రొఫైల్ ను స్కాన్ చేసింది. ఫ్రాంక్ యూ అని పేరు కలిగిన యూజర్ న్యూ యార్క్ చెందిన వారు.

निष्कर्ष: ఒక నిజమైన రెండు-కాళ్ళ ఒంటెను చూపడానికి ఉద్దేశించబడిన చిత్రము మార్చబడినది. అసలైన చిత్రము ఎడిట్ చేయబడింది మరియు నకిలీ క్లెయిమ్ తో షేర్ చేయబడింది.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
ఇటీవలి పోస్ట్ లు