ఈ వాదన అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ముంబైలో గురు గోవింద్ సింగ్ జీ 351 వ జయంతి వేడుకలకు హృతిక్ రోషన్ హాజరైన ఈ ఫోటో 2018 జనవరికి సంబంధించినది. హృతిక్ రోషన్ రైతు ఉద్యమంలో పాల్గొన్నట్లు మాకు ఇంటర్నెట్‌లో ఎటువంటి వార్తలు కనిపించలేదు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : రైతు ఉద్యమం నేపథ్యంలో ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇందులో సిక్కులతో కలిసి నటుడు హృతిక్ రోషన్ ఒక వేదికపై నిలబడి ఉండటం చూడవచ్చు. చిత్రంలో, హృతిక్ చేతిలో కత్తిని పట్టుకొని, సిక్కుల సంప్రదాయ కేసరి వస్త్రాన్ని మెడలో వేసుకొని, సిక్కుల సంప్రదాయ తలపాగాను తలపై ధరించారు. ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొనడానికి హృతిక్ రోషన్ వచ్చారని ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఈ వాదన అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ముంబయిలో గురు గోవింద్ సింగ్ జీ 351 వ జయంతి వేడుకలకు హృతిక్ రోషన్ హాజరైన ఫోటో 2018 జనవరిలో తీసినది. హృతిక్ రోషన్ రైతు ఉద్యమంలో పాల్గొన్నట్లు ఇంటర్నెట్‌లో మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.
వైరల్ అవుతున్నది ఏంటి?
‘Anjali Singh’ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. ఈ ఫోటోలో, నటుడు హృతిక్ రోషన్ కొంతమంది సిక్కులతో కలిసి వేదికపై నిలబడి ఉండడాన్ని చూడవచ్చు. ఫోటోలో, “Kangana Ranaut के भूतपूर्व #प्रेमी #आशिक Hrithik Roshan पहुंचे #किसान_आंदोलन समर्थन में” అని రాశారు.
ఫేస్‌బుక్‌లో ఈ పోస్ట్‌ను ఇక్కడ చూడొచ్చు.
పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ పరిశీలించవచ్చు.
దర్యాప్తు :
ఈ ఫోటోను పరిశోధించడానికి, మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్‌లో అప్‌లోడ్ చేసి శోధించాము. మా శోధనలో, 6 జనవరి 2018 న ‘Bollwood Spy‘అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోను కనుగొన్నాము, ఆ వీడియోకు అదే థంబ్‌నెయిల్ ఫోటో ఉంది. వీడియో రైటప్‌లో, ‘Hrithik Roshan ATTENDS Celebrations Of Guru Gobind Singh Birth Anniversary’ అని రాశారు. దీనిని తెలుగులోకి అనువదిస్తే.. “హృతిక్ రోషన్ గురు గోవింద్ సింగ్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.”
‘Bollywood Scanner‘ అనే యూట్యూబ్ పేజీలో కూడా ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మేము కనుగొన్నాము. 7 జనవరి 2018 న అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియో కింద వివరణలో ‘Hrithik Roshan, Ayushman Khurana And Urvashi Rautela Visit Gurudwara In Mumbai.’ అని రాశారు.
2018 లో గురు గోవింద్ సింగ్ జన్మదినానికి హాజరైన హృతిక్ రోషన్ గురించి మాకు dailysikhupdates.com లో కూడా ఒక వార్త కనిపించింది.
దర్యాప్తును మరింతగా కొనసాగిస్తూ, విశ్వాస్ న్యూస్ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) అమృత్‌సరర్ సమాచార అధికారి జస్వీందర్ సింగ్ జాస్సీని సంప్రదించడం జరిగింది. “ఈ ఫోటో 2018 జనవరికి సంబంధించినది. ముంబైలో గురు గోవింద్ సింగ్ జీ 351 వ జయంతి కార్యక్రమానికి హృతిక్ రోషన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఎస్‌జిపిసి ముంబై, ఎస్‌జిపిసి అమృత్‌సర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.” అని జస్వీందర్ సింగ్ చెప్పారు.
ఆ తరువాత మేము ఇంటర్నెట్‌లో కీలకపదాల సహాయంతో శోధించాము, కానీ హృతిక్ రోషన్ రైతు ఉద్యమంలో పాల్గొన్నట్లు మాకు వార్తలు కనిపించలేదు.
దర్యాప్తు చివరి దశలో, ఈ పోస్ట్‌ను షేర్ చేసిన వినియోగదారుని సోషల్ స్కానింగ్ చేశాము. అంజలి సింగ్ అనే ఈ ఫేస్ బుక్ పేజీని 1,29,832 మంది ఫాలో అవుతున్నారని మాకు తెలిసింది.
निष्कर्ष: ఈ వాదన అబద్ధమని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొంది. ముంబైలో గురు గోవింద్ సింగ్ జీ 351 వ జయంతి వేడుకలకు హృతిక్ రోషన్ హాజరైన ఈ ఫోటో 2018 జనవరికి సంబంధించినది. హృతిక్ రోషన్ రైతు ఉద్యమంలో పాల్గొన్నట్లు మాకు ఇంటర్నెట్‌లో ఎటువంటి వార్తలు కనిపించలేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923