కరోనా కారణంగా, ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను అందించడం లేదు. వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీ. అపరిచిత లింక్‌పై క్లిక్ చేయడం ఆర్థికంగా నష్టదాయకమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : కరోనా సమయంలో ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌ఫోన్‌లను ఇస్తోందని పేర్కొంటూ ఒక మెస్సేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌తో పాటు.. లింక్‌ను కూడా షేర్ చేసి.. ఆ లింక్‌లో వివరాలు నమోదు చేయాలని అడుగుతున్నారు. విశ్వాస్ న్యూస్ తన వాట్సాప్ చాట్‌బాట్ (+91 95992 99372) లో వాస్తవ తనిఖీ కోసం ఈ దావాను స్వీకరించింది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. ఇంతకుముందు తక్కువ ధరకు లేదా ఉచితంగా ల్యాప్‌టాప్ పొందాలనే తప్పుడు ప్రచారం కూడా వైరల్ అయ్యింది.
వైరల్ అవుతున్నది ఏంటి?
విశ్వాస్ న్యూస్‌కు వాట్సాప్ చాట్‌బాట్‌లో ఈ ఇమేజ్ పోస్ట్ వచ్చింది. దానికి ఓ లింక్ కూడా ఉంది. ఆ వైరల్ మెస్సేజ్‌లో ఇలా రాశారు, ‘కరోనా వైరస్ కారణంగా పాఠశాలలు మరియు కళాశాలలు మూసివేయబడ్డాయి. దీని కారణంగా విద్యార్థుల చదువు తీవ్రంగా ప్రభావితమైంది, అందువల్ల విద్యార్థులందరికీ ఉచితంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తుంది. తద్వారా విద్యార్థులు ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ తరగతుల సహాయంతో విద్యను పూర్తి చేయవచ్చు. ఈ లింక్ నుండి మీ ఉచిత స్మార్ట్‌ఫోన్‌ను పొందడానికి మీరు ఫారమ్‌ను పూరించవచ్చు. 👉 http://bit.ly/Register-Free-Smartphone-Link ‘ఈ లింక్ మెస్సేజ్‌లో ఉన్నది ఉన్నట్లు ఇక్కడ పేర్కొనడం జరిగింది.
మాకు ట్విట్టర్‌లో కూడా అదే వైరల్ మెస్సేజ్ వచ్చింది. ఈ పోస్ట్‌ను ‘బ్రాండ్ కృష్ణ 500 ఫాలోవర్స్’ అనే హ్యాండిల్‌పై ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ యొక్క ఆర్కైవ్ చేసిన వెర్షన్‌ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ మొదట ఇంటర్నెట్‌లో ఈ వాదనకు సంబంధించిన అవసరమైన కీలకపదాల సహాయంతో వాస్తవమేంటో కనుగొనడానికి ప్రయత్నించింది. విద్యార్థులందరికీ ఉచితంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినట్లయితే అది పెద్ద వార్త. ప్రామాణిక మీడియా సంస్థలు దీనిపై తప్పనిసరిగా వార్తా కథనాలు ప్రచురిస్తాయి. అయితే, ఉచిత స్మార్ట్‌ఫోన్ పథకాన్ని ధృవీకరించే ప్రామాణికమైన వార్తా కథనం ఏదీ మాకు కీలక పదాల శోధనలో దొరకలేదు.
దీనికి విరుద్ధంగా, మాకు అలాంటి వైరల్ పోస్టులు తప్పు అని పేర్కొంటూ రాసిన వార్తా కథనాలకు సంబంధించిన వివరాలు వచ్చాయి. న్యూస్ 18లో ప్రచురితమైన ఇలాంటి వార్తా కథనాన్ని ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
వైరస్ పోస్ట్‌లో షేర్ చేసిన లింక్‌ను విశ్వాస్ న్యూస్ కూడా పరిశోధించింది. ఇది ఒక బ్లాగ్‌స్పాట్‌కు సంబంధించిన లింక్, దీన్ని ఎవరైనా క్రియేట్ చేయవచ్చు. ఈ లింక్‌పై క్లిక్ చేయగానే, పేరు మరియు సెల్‌నెంబర్ వంటి వ్యక్తిగత సమాచారం అడుగుతోంది. ఫారమ్ నింపడానికి చివరి తేదీ అక్టోబర్ 10 అనికూడా ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ వైరల్ పోస్ట్‌లో భాషా దోషాలు (క్రింద, అక్టోబర్) కూడా కనిపించాయి.
దర్యాప్తును సంపూర్ణంగా పూర్తిచేయడం, నిజానిజాలేంటో నిర్ధారించుకునే క్రమంలో, ఆ లింక్‌లో ఇచ్చిన ఫారమ్‌లో వ్యక్తిగత సమాచారాన్ని నింపడం ద్వారా మేము మా దర్యాప్తును కొనసాగించాము. తదుపరి దశలో, ధృవీకరణ కోసం వాట్సాప్‌లో 10 మందికి ఆ సమాచారం షేర్ చేయాలని మమ్మల్ని కోరారు. అంటే, ఇక్కడ లింక్‌ను ప్రోత్సహించడానికి మరియు క్లిక్‌బైట్ సహాయంతో హిట్‌లను పెంచుకునే ప్రయత్నం ఉందని మాకు స్పష్టమైంది.
గతంలో, ప్రతి విద్యార్థికి కరోనా కారణంగా ప్రభుత్వం నుండి రూ. 9000 లభిస్తుందనే ప్రచారం వైరల్ అయ్యింది. ఆ పోస్ట్‌లో కూడా, అదే బ్లాగ్‌స్పాట్ లింక్‌ను చేర్చి రిజిస్ట్రేషన్ ఫారం అంటూ వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలంటూ సూచించారు. వివరాలు నమోదు చేసిన తర్వాత.. ఆ ఆఫర్‌ను వాట్సప్‌లో 10 మందికి లేదా 10 గ్రూపులకు షేర్ చేయాలని కోరారు. అప్పుడు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసి) అధికారి విశ్వాస్ న్యూస్‌తో మాట్లాడుతూ ప్రజలు ఇలాంటి బ్లాగ్‌లకు సంబంధించిన లింక్‌లపై క్లిక్ చేయవద్దని చెప్పారు. ప్రభుత్వ సమాచారం gov.in లేదా nic.in పేరుతో ఉన్న వెబ్‌సైట్లనుండి వస్తే మాత్రమే ప్రజలు నమ్మాలని సూచించారు. లేదంటే ఇబ్బందులు తప్పవని, నష్టపోతారని హెచ్చరించారు. ఆ వాస్తవ తనిఖీకి సంబంధించిన కథనం కింద చూడవచ్చు
మేము ఇప్పుడు వైరల్ అవుతున్న లింక్‌ను సైబర్ సెక్యూరిటీ నిపుణుడు ఆయుష్ భరద్వాజ్‌కు పంపాము. ఆయన ఈ లింక్‌ను పరిశీలించి, ఇది క్లిక్‌బైట్ లింక్ అని, ఆ లింక్‌లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా ఆ వివరాలు దొంగిలించబడే ప్రమాదం ఉందని చెప్పారు. మీ మొబైల్‌లో మాల్‌వేర్ నియంత్రణను అటువంటి క్లిక్‌బైట్ ద్వారా యాక్సెస్ చేయవచ్చునని ఆయుష్ తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని డీప్ వెబ్‌లో దొంగిలించి అమ్ముకునే అవకాశం ఉంటుందని (హ్యాకర్లు మరియు సైబర్ మోసగాళ్ళు డీప్ వెబ్‌ను ఉపయోగిస్తారు) హెచ్చరించారు. మీ ఇ-వాలెట్‌ను హ్యాక్ చేయడం ద్వారా మీరు ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ వైరల్ పోస్ట్‌ను ట్వీట్ చేసిన యూజర్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌ను విశ్వాస్ న్యూస్ స్కాన్ చేసింది. ఈ ట్విట్టర్ హ్యాండిల్ 2020 ఆగస్టులో క్రియేట్ చేశారు. ఈ వాస్తవ తనిఖీ దర్యాప్తు సాగించే సమయానికి ఈ ట్విట్టర్ యూజర్‌కు 491 మంది ఫాలోవర్లు ఉన్నారు.
निष्कर्ष: కరోనా కారణంగా, ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లను అందించడం లేదు. వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీ. అపరిచిత లింక్‌పై క్లిక్ చేయడం ఆర్థికంగా నష్టదాయకమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923