వైరల్ పోస్ట్ అబద్ధం. గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని పాకిస్తాన్‌లో తెరవలేదు. వైరల్ షేర్ చేసిన ఫోటోలు.. లాహోర్‌లోని అధీకృత రీ సెల్లర్ అయిన SSZ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ గూగుల్ స్టోర్‌కు సంబంధించినవి.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : పాకిస్తాన్‌లోని లాహోర్‌లో గూగుల్ సంస్థ తన కార్యాలయాన్ని ప్రారంభించిందంటూ రెండు ఫోటోలతో కూడిన వైరల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ వాదన నకిలీదని తేలింది. గూగుల్ ప్రెస్ టీమ్ ఈ వాదనలను ఖండించింది. అవి పాకిస్తాన్ లాహోర్‌లోని గూగుల్‌కు సంబంధించిన ఒక ప్రైవేట్ రీ సెల్లర్ షోరూం ఫోటోలు అని పాకిస్తాన్ జర్నలిస్టులు మాకు ధృవీకరించారు.
దావా :
‘ఇస్లామాబాద్ ది బ్యూటిఫుల్ సిటీ’ అనే ఫేస్‌బుక్ పేజీలో ఒక ఫోటోను షేర్ చేశారు. ‘గూగుల్ యొక్క మొదటి కార్యాలయం ప్రారంభించబడింది. లొకేషన్ : సెక్టార్ జి -9, ఇస్లామాబాద్, పాకిస్తాన్.’ అని ఆ పోస్ట్‌కు రైటప్ ఇచ్చారు. ఫేస్‌బుక్ పోస్ట్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
ఈ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.
“ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత ప్రయత్నాలు మరియు ఉత్తమ వ్యూహానికి కృతజ్ఞతలు, గూగుల్ పాకిస్తాన్‌లో తన మొదటి కార్యాలయాన్ని ప్రారంభించింది, ఇది కోటి రూపాయల ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఫోటోను కూడా మేము ట్విట్టర్లో కనుగొన్నాము.
దర్యాప్తు :
పాకిస్తాన్‌లో గూగుల్ తన కార్యాలయాన్ని ప్రారంభించిన వార్తల కోసం విశ్వాస్ న్యూస్ ఇంటర్నెట్‌లో శోధించింది. పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మేము చాలా వార్తా కథనాలను కనుగొన్నాము, అదేంటంటే సోషల్ మీడియా సంస్థలు దేశంలో కార్యాలయాలు తెరవడం తప్పనిసరి.
మార్చి 2వ తేదీన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ‘పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల రూపొందించిన నిబంధనల మేరకు సోషల్ మీడియా కంపెనీలు ఇస్లామాబాద్‌లో కార్యాలయాలు తెరవడం మరియు సమాచారాన్ని నిల్వ చేయడానికి డేటా సర్వర్‌లను ఏర్పాటు చేయడం తప్పనిసరి. అధికారులు గుర్తించిన తర్వాత కంపెనీలు కంటెంట్‌ను తొలగించడానికి వారు కఠినమైన సమయపాలనలను కూడా నిర్దేశిస్తారు.’
కొత్త నిబంధనలను సవరించకపోతే దేశంలో కార్యకలాపాలను నిలిపివేస్తామని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను హెచ్చరిస్తూ సోషల్ మీడియా కంపెనీలు ఫేస్‌బుక్, గూగుల్‌తో కూడిన ఆసియా ఇంటర్నెట్ కూటమి (ఎఐసి) ఒక లేఖ రాసింది.
అయితే, ఇస్లామాబాద్‌లో గూగుల్ తన కార్యాలయాన్ని ప్రారంభించడాన్ని ధృవీకరించిన ప్రామాణికమైన వార్తా నివేదికలు ఏవీ మాకు దొరకలేదు.
మేము వారి కార్యాలయాల లొకేషన్ల కోసం గూగుల్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో శోధించాము. పాకిస్తాన్ కార్యాలయం గురించిన చిరునామా లేదా వివరాలు ఏవీ మాకు దొరకలేదు.
విశ్వాస్ న్యూస్ ధృవీకరణ కోసం గూగుల్ ప్రెస్ బృందాన్ని ఇమెయిల్ ద్వారా సంప్రదించింది. గూగుల్ యొక్క కమ్యూనికేషన్ మేనేజర్ ఈ వాదనలను ఖండించారు. అలాగే టెక్జూయిస్‌లో ప్రచురించిన ఫ్యాక్ట్‌చెక్ కథనాన్ని మాకు షేర్ చేశారు.
వైరల్ పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటోలు.. లాహోర్‌లోని DHA ఫేజ్ 1 లో ఉన్న గూగుల్ ఉత్పత్తుల రీసెల్లర్ అయిన SSZ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించినవి అని, అది గూగుల్ కొత్త కార్యాలయం కాదని మేము నిర్ధారించాము.
తదుపరి దర్యాప్తులో, జాగరణ్ న్యూ మీడియా సీనియర్ ఎడిటర్ ప్రత్యూష్ రంజన్ పాకిస్తాన్‌లోని AAJ న్యూస్ సీనియర్ రిపోర్టర్ నవీద్ అక్బర్‌ను సంప్రదించి వైరల్ ఫోటోలతో చేసిన వాదనల యొక్క ప్రామాణికతను తనిఖీ చేశారు. పాకిస్తాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పిటిఎ) ప్రతినిధి ఖుర్రామ్ మెహ్రాన్ ఇచ్చిన సమాచారాన్ని అక్బర్ తనతో పంచుకున్నారు, గూగుల్ కార్యాలయం గురించిన సమాచారం ఇంకా ధృవీకరించబడలేదు.
మరో పాత్రికేయుడు తాహిర్ అమిన్ (పాకిస్తాన్లోని డైలీ బిజినెస్ రికార్డర్‌లో స్టాఫ్ రిపోర్టర్) కూడా జాగరణ్ న్యూ మీడియా సీనియర్ ఎడిటర్ ప్రత్యూష్ రంజన్‌తో మాట్లాడుతూ ఈ వైరల్ ఫోటోలు లాహోర్‌లో ప్రారంభించిన గూగుల్ స్టోర్‌లో తీసినవని చెప్పారు.
పాకిస్తాన్‌లోని గూగుల్ స్టోర్ యొక్క వీడియోను కూడా మేము ఫేస్‌బుక్‌లో కనుగొన్నాము.
వైరల్ దావాను షేర్ చేసిన ఫేస్‌బుక్ పేజీ యొక్క సోషల్ స్కానింగ్‌లో 31,872 మంది ఫాలోవర్లు ఉన్నారని మరియు జూన్ 2016 నుండి ఈ అకౌంట్ యాక్టివ్‌గా ఉందని తేలింది.
निष्कर्ष: వైరల్ పోస్ట్ అబద్ధం. గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని పాకిస్తాన్‌లో తెరవలేదు. వైరల్ షేర్ చేసిన ఫోటోలు.. లాహోర్‌లోని అధీకృత రీ సెల్లర్ అయిన SSZ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ గూగుల్ స్టోర్‌కు సంబంధించినవి.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923