X
X

వాస్తవ తనిఖీ: మానసిక అనారోగ్యముతో ఉన్న అమ్మాయి శ్రీరాముని పోస్టర్ పై గ్రుడ్లు విసిరింది, వైరల్ క్లెయిమ్ తప్పుదోవపట్టించేది

కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాపై ఒక వీడియో చక్కర్లు కొడుతోంది, ఈ వీడియోలో ఒక మహిళ రోడ్డు మధ్యలో నిర్మించబడిన ఒక వేదికపై ఏదో చేస్తూ కనిపిస్తుంది. అయితే, ఆ మహిళ ఏం చేస్తోందో ఆ వీడియోలో స్పష్టంగా లేదు. మహారాష్ట్రలోని ఛత్రపతి సాంబాజినగర్ లో బుర్ఖా-ధరించిన ఒక మహీళ తన స్కూటర్ ఆపి శ్రీరాముని పోస్టర్ పై గ్రుడ్లు విసిరింది అనే క్లెయిమ్ తో ఈ వీడియో షేర్ చేయబడింది.

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి వాస్తవ-తనిఖీ నిర్వహించి, ఈ క్లెయిమ్ తప్పుదోవపట్టించేదని మరియు మతపరంగా ప్రేరేపించేదని కనుగొనింది. తన దర్యాప్తులో, ఆ మహిళ పేరు శైలజ అని మరియు ఆమె మానసిక అనారోగ్యముతో బాధపడుతోందని కనుగొనింది. ఆ సంఘటన తరువాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

క్లెయిమ్:

ఫేస్‎బుక్ యూజర్ రణవీర్ సింగ్ నేగి మే 20 నాడు ఒక వీడియోను అప్లోడ్ చేసి (ఆర్కైవ్ లింక్) ఇలా వ్రాశారు, “ఈ విషము ఎక్కడ నిల్వ చేయబడింద్? బుర్ఖా ధరించిన మహిళ శ్రీరాముడిని ఇంతగా ఎందుకు ద్వేషిస్తోంది? స్కూటీని రోడ్డుపై పార్క్ చేసి, శ్రీరాముని చిత్రముపై గ్రుడ్లు విసిరింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ఛత్రపతి సాంబాజినగర్ లో జరిగింది. సౌజన్యం సుదర్శన్ న్యూస్.”

వైరల్ వీడియో వెంబడి ఈ వచనము కూడా ఉంది, “ఛత్రపతి సాంబాజినగర్ లో జిహాదీ ఖాటూన్. స్కూటీ ఆపి శ్రీరాముని పోస్టర్ పై గ్రుడ్డు విసింది”. దీనిని నిజమని భావించి, ఇతర యూజర్లు కూడా దీనిని వైరల్ చేశారు. పోస్ట్ లో ఉన్న కంటెంట్ యథాతథంగా వ్రాయబడింది.

దర్యాప్తు:

విశ్వాస్ న్యూస్ వైరల్ పోస్ట్ గురించి వాస్తవ తనిఖీ చేసింది. సుదర్శన్ న్యూస్ యొక్క లోగో వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి, మేము ముందుగా, మేము మతపరమైన క్లెయిమ్ తో మే 20, 2023 నాడు అసలైన వీడియో పోస్ట్ చేయబడిన  సుదర్శన్ న్యూస్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ను స్కాన్ చేశాము. బుర్ఖాధారి మహిళ మరియు జిహాది ఖాటూన్ వంటి పదాలు ఆ వచనములో ఉపయోగించబడ్డాయి.

దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, మేము ఛత్రపతి సాంబాజినగర్ పోలీసు కమిషనర్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ను స్కాన్ చేశాము మరియు మే 20 తేదీ నాటి ఒక ప్రెస్ నోట్ ను కనుగొన్నాము. మరాఠిలో ఉన్న ఈ రెండు పేజీల ప్రెస్ నోట్ లో, ఆ మహిళ పేరు శైలజ విశాల్ ఉదావెత్ అలియాస్ శిల్ప రామారావ్ గారుడ్ అని పేర్కొనబడింది. ఈ 38-సంవత్సరాల-మహిళ మానసిక అనారోగ్యముతో బాధపడుతూ ఉంది. అంతేకాకుండా, ఆ మహిళ వ్యాకులతతో బాధపడుతూ ఉందని, ఆ కారణంగానే ఆమె ఇటువంటి చర్యకు పాల్పడిందని ఆ ప్రెస్ నోట్ లో పేర్కొనబడింది.

సెర్చ్ సమయములో, పోలీసు కమిషనర్ మనోజ్ లోహియా యొక్క ఒక వీడియో కూడా లభించింది. ఆ వీడియోలో, ఆయన తప్పుదోవపట్టించే పోస్ట్ ను వైరల్ చేయవద్దని అభ్యర్ధిస్తూ కనిపించారు. ఆమె ఒక హిందూ మహిళ అని, వ్యాకులత కారణంగా ఇలా ప్రవర్తించిందని ఆయన తెలిపారు.

దర్యాప్తును ముందుకు కొనసాగిస్తూ, మేము దివ్య మరాఠి యొక్క ఈ-పేపర్ ఛత్రపతి సాంభాజినగర్ ఎడిషన్ ను స్కాన్ చేశాము మరియు ఈ సంఘటనకు సంబంధించి ఒక వార్తా నివేదిక మాకు లభించింది. మే 22 నాడు ప్రచురించిన వార్తలలో, ఒక మతపరమైన ప్రదేశాన్ని మరియు మతపరమైన చిత్రాన్ని అవమానించినందుకు శైలజ అలియాస్ శిల్ప అరెస్ట్ చేయబడిందని పేర్కొనబడింది. షరతులతో కూడిన బెయిల్ పై ఆమె విడుదల చేయబడింది. సంఘటనలో ఉపయోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళ మానసిక అనారోగ్యముతో బాధపడుతోందని పోలీసులు చెప్పారు.

దర్యాప్తును ముందుకు తీసుకెళ్తూ, విశ్వాస్ న్యూస్, ఛత్రపతి సాంభాజినగర్ నుండి ఒక సీనియర్ విలేఖరి అయిన మనోజ్ టాక్ ను సంప్రదించింది మరియు ఈ వైరల్ వీడియోను ఆయనతో షేర్ చేసుకుంది. ఈ సంఘటనలో ఏ ముస్లిం మహిళ ప్రమేయం లేదని ఆయన చెప్పారు. నిందితురాలైన మహిళ పేరు శైలజ. ఆమె మానసికంగా ఆందోళన చెందింది.
మేము ఈ నకిలీ క్లెయిమ్ చేసిన యూజర్ యొక్క ఖాతాను కూడా స్కాన్ చేశాము. ఫేస్‎బుక్ యూజర్ రణవీర్ సింగ్ నేగి యొక్క ఖాతాపై ఎలాంటి ప్రత్యేక సమాచారము అందుబాటులో లేదు, కాని ఆ యూజర్ రాజకీయ భావజాలముతో ఖచ్ఛితంగా ప్రభావితం అయ్యాడని తెలుస్తోంది.

ముగింపు: విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో శ్రీరాముని పోస్టర్ పై గ్రుడ్లు విసిరిన మహిళ మానసిక అనారోగ్యముతో బాధపడుతోందని తెలిసింది. ఆ మహిళ ముస్లిం కాదు, ఆమె పేరు శైలజ విశాల్.

  • Claim Review : మహారాష్ట్రలో బుర్ఖా-ధరించిన మహిళ శ్రీరాముని పోస్టర్ పై గ్రుడ్లు విసిరింది
  • Claimed By : ఎఫ్‎బి యూజర్: రణవీర్ సింగ్ నేగి
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later