X
X

నిజ నిర్దారణ: ఇండియా అనే పేరుకి పూర్తి నిర్వచనం ‘ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్’ అని కాదు

విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తెలుసుకుంది. ఇండియా అనే పేరుకి పూర్తి నిర్వచనం లేదు. ఈ పేరు సంస్కృతం మరియు పార్శీ పదం సింధూ నుంచి వచ్చింది, అంటే హిందువు అని అర్థము.

  • By: Pallavi Mishra
  • Published: Aug 24, 2022 at 01:00 PM
  • Updated: Aug 25, 2022 at 11:42 AM

న్యూఢిల్లీ (విశ్వాస్ న్యూస్). సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక మెసేజ్ లో, మన దేశానికి ఉన్న ఇండియా అనే పేరుకి పూర్తి నిర్వచనం ‘ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్’ అని ప్రకటించారు. విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ ప్రకటన తప్పు అని తెలుసుకుంది. ఇండియా అనే పేరుకి పూర్తి నిర్వచనం అనేది ఏమీ లేదు. ఈ పేరు సంస్కృతం ఇంకా పార్శీ పదాల నుంచి వచ్చింది.

వైరల్ అవుతున్నది విషయం ఏమిటి?

ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఇండియా అనే పదం ఎలా వచ్చిందో, 90 శాతం మంది భారతీయులకు తెలియదని ఫేస్‌బుక్ యూజర్ జీతూ లఖానీ ట్వీట్ చేశారు.
I ఇండిపెండెంట్
N నేషన్
D డిక్లేర్డ్
I ఇన్
A ఆగస్ట్”

పోస్ట్‌లోని ఆర్కైవ్ చేసిన వర్షన్ ను ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్చు.

విచారణ

వైరల్ మెసేజ్ లోని నిజాన్ని తెలుసుకోవడానికి విశ్వాస్ న్యూస్ మొదట కీవర్డ్ తో వెతికింది. 1947కు ముందే అనేక అధికారిక బ్రిటిష్ డాక్యుమెంట్లలో ఇండియా అనే పదాన్ని మేము చూశాము. స్వాతంత్ర్యానికి 89 సంవత్సరాల ముందు 1858 నాటి భారత ప్రభుత్వ చట్టంలో కూడా ఇండియా అనే పేరును ఉపయోగించారు.

ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ అనే పేరుని వైరల్ పోస్ట్ లో చెప్పడం జరిగింది అందుకని, మేము oxfordlearnersdictionaries.com లో ఇండియా అని వెతికాము. వైరల్ క్లెయిమ్ లో వివరించినట్లుగా ఆ సమాధానంలో ఎక్కడా చెప్పలేదు. దాని అర్ధం ఎలా ఉందంటే “బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న దక్షిణాసియాలోని ఒక దేశం. ఇది 1947 లో స్వతంత్ర మరియు కామన్వెల్త్ సభ్యదేశంగా మారింది.”

ఇప్పుడు మేము ఇప్పుడు అనే పేరుని ఎక్కడి నుండి తీసుకున్నారో తెలుసుకోవడానికి గూగుల్ లో వెతికాము. అనేక వెబ్ సైట్లలో ఈ సమాచారాన్ని మేము ఇలా చూశాము, “ఇండియా అనే పేరు ఇండస్ అనే పాత పర్షియన్ పదం నుండి వచ్చింది.”

ఈ విషయం గురించి మేము ప్రముఖ చరిత్రకారుడు మరియు రచయిత అయిన అక్షయ్ జోగ్ ను సంప్రదించాము. ఆయన మాకు ఇలా చెప్పారు “ఈ పోస్ట్ పూర్తిగా తప్పు. ఇండియా అనే పేరు సింధూ లోయ నుండి వచ్చింది.”

విచారణ ముగింపులో విశ్వాస్ న్యూస్ వైరల్ విషయాన్ని అందించిన వినియోగదారుడిని స్కాన్ చేసింది. ఫేస్‌బుక్ యూజర్ రవి రమేష్ పుంజానీ సోషల్ స్కానింగ్ లో ఆ యూజర్ ముంబై వాసి అని తెలిసింది.

निष्कर्ष: విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తెలుసుకుంది. ఇండియా అనే పేరుకి పూర్తి నిర్వచనం లేదు. ఈ పేరు సంస్కృతం మరియు పార్శీ పదం సింధూ నుంచి వచ్చింది, అంటే హిందువు అని అర్థము.

  • Claim Review : ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం ఇండియా అనే పదం ఎలా వచ్చిందో, 90% మంది భారతీయులకు తెలియదు. ఐ అంటే ఇండిపెండెంట్ ఎన్ అంటే నేషన్ అని డి డిక్లేర్డ్ ఐ ఇన్ ఎ అంటే ఆగస్ట్ అని
  • Claimed By : ఫేస్‌బుక్ యూజర్ జీతు లేఖిని
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later