X
X

వాస్తవ తనిఖీ : ముఖేశ్ అంబానీ నకిలీ ట్విట్టర్ అకౌంట్‌లో కిసాన్ ఆందోళనకు సంబంధించిన తప్పుడు ట్వీట్‌

విశ్వాస్‌ న్యూస్ దర్యాప్తులో, ముఖేష్ అంబానీ పేరుతో వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. ముఖేష్ అంబానీ యొక్క నకిలీ ట్విట్టర్ ఖాతాను సృష్టించి ఎవరో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు.

హైదరాబాద్‌ (విశ్వాస్ న్యూస్) : ఢిల్లీ సరిహద్దులో జరుగుతున్న రైతు ఉద్యమం పేరిట చాలా నకిలీ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇలా నకిలీ పోస్టుల్లో ఫోటోల నుంచి మొదలుకొని వీడియోల దాకా వైరల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ముఖేష్ అంబానీకి సంబంధించిన నకిలీ ట్విట్టర్ హ్యాండిల్‌ పోస్ట్ వైరల్ అవుతోంది.

విశ్వాస్‌ న్యూస్ ఈ వైరల్ పోస్టులపై దర్యాప్తు చేసింది. ముఖేష్ అంబానీ పేరు పెట్టబడిన ఈ సోషల్ మీడియా అకౌంట్‌ నకిలీదని మాకు తెలిసింది. అంబానీ కుటుంబ సభ్యులెవరూ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ యాక్టివ్‌గా లేరు.

వైరల్ అవుతున్నది ఏంటి?
ముఖేష్ అంబానీ (@i_mukeshambani) ట్విట్టర్ హ్యాండిల్‌పై రైతుల ఉద్యమానికి మద్దతుగా ఒక పోస్ట్‌ను అప్‌లోడ్ చేశారు. అందులో, ఒక వ్యక్తి పోస్టర్ పట్టుకొని నిల్చున్నాడు. ఈ పోస్టర్‌ పట్టుకున్న ప్రదర్శన డిసెంబర్ 14వ తేదీన జరిగింది. ఈ పోస్ట్‌ను నిజమని భావించి, చాలా మంది యూజర్లు దీన్ని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ చేస్తున్నారు.

ఈ పోస్ట్ అర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు.

దర్యాప్తు :
రైతుల ఉద్యమానికి, ముఖేష్ అంబానీకి సంబంధించిన కీలకపదాలను టైప్ చేసి విశ్వాస్ న్యూస్ మొదట గూగుల్‌లో శోధించింది. రైతు ఉద్యమం గురించి ముఖేష్ అంబానీ ప్రకటన ఇచ్చిన ఒక్క వార్త కూడా మాకు దొరకలేదు. ఒకవేళ, ముఖేష్ అంబానీ ఈ అంశంలో ఏదో ఒక ప్రకటన చేసి ఉంటే, అది మీడియాలో ముఖ్యాంశం అయ్యేది.

తదుపరి దశ దర్యాప్తులో, మేము ఆ అకౌంట్‌ను ట్విట్టర్‌లో కనుగొన్నాము, ఇది ముఖేష్ అంబానీ పేరుతో వైరల్ అవుతోంది. @i_mukeshambani అనే ట్విట్టర్ హ్యాండిల్‌ను విశ్వాస్‌ న్యూస్ సోషల్ స్కాన్ చేసింది. దీనిని అక్టోబర్ 2020లో ప్రారంభించారు. దీనికి ఒకే ఒక ఫాలోవర్‌ ఉన్నాడు. ఇది ముఖేష్ అంబానీ నిజమైన ట్విట్టర్‌ అకౌంట్‌ కాదని స్పష్టమైంది.

దర్యాప్తు చివరి దశలో, విశ్వాస్ న్యూస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రజా సంబంధాల అధికారిని సంప్రదించింది. అంబానీ కుటుంబ సభ్యులెవరూ ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ లేరని ఆయన మాకు చెప్పారు. వైరల్ ట్విట్టర్ హ్యాండిల్‌కు, ముఖేష్ అంబానీతో సంబంధం లేదు, ఇది నకిలీ.. అని వివరించారు.

निष्कर्ष: విశ్వాస్‌ న్యూస్ దర్యాప్తులో, ముఖేష్ అంబానీ పేరుతో వైరల్ అవుతున్న పోస్ట్ నకిలీదని నిరూపించబడింది. ముఖేష్ అంబానీ యొక్క నకిలీ ట్విట్టర్ ఖాతాను సృష్టించి ఎవరో నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించారు.

  • Claim Review : కిసాన్ ఉద్యమానికి ముఖేష్‌ అంబానీ మద్దతు
  • Claimed By : Mukesh Ambani's fake Twitter account
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ట్యాగ్స్

Post your suggestion

No more pages to load

సంబంధిత వ్యాసాలు

Next pageNext pageNext page

Post saved! You can read it later