వాస్తవ తనిఖీ: చైనీస్ పటాకులకు సంబంధించిన నకిలీ ఎంహెచ్ఏ సర్క్యులర్ మళ్ళీ వైరల్ అయ్యింది
- By: Pragya Shukla
- Published: Oct 24, 2022 at 11:29 AM
విశ్వాస్ న్యూస్ (కొత్త ఢిల్లీ): హోమ్ మంత్రిత్వ శాఖకు ఆపాదించబడిన ఒక సందేశము సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ పై చక్కర్లుకొడుతోంది. హోమ్ మంత్రిత్వ శాఖలో సీనియర్ దర్యాప్తు అధికారి, విశ్వజీత్ ముఖర్జీ ఈ దీపావళికి భారతదేశానికి ప్రమాదకరమైన రసాయనాలతో చైనా పటాకులు పంపిస్తోంది అని వెల్లడించారు అని క్లెయిమ్ చేయబడుతోంది.
ఈ పటాకుల ద్వారా, భారతదేశములో ఆస్తమా మరియు కంటి జబ్బులను వ్యాప్తి చేయాలని అనుకుంటోంది. విశ్వాస్ న్యూస్ ఈ క్లెయిమ్ గురించి దర్యాప్తు చేసి ఇది నిరాధారమైనది అని కనుగొనింది. హోమ్ మంత్రిత్వ శాఖ ఇలాంటి హెచ్చరిక ఏది జారీ చేయలేదు. ప్రజలు సోషల్ మీడియాపై అసత్యపు క్లెయిమ్స్ షేర్ చేస్తోంది.
క్లెయిమ్
ఫేస్బుక్ యూజర్ మొహిందర్ సింగ్ ఈ పోస్ట్ ను షేర్ చేసి ఇలా వ్రాశారు, “ఒక తీవ్రమైన హెచ్చరిక”…..ఇంటలిజెన్స్ విభాగము వారి నివేదికల ప్రకారము, కలతచెందిన మరియు నిరాశకు గురైన పాకిస్తాన్, భారతదేశముపై ప్రత్యక్షంగా దాడిచేసే సామర్థ్యం లేక, భారతదేశములో నష్టాలు/అలజడులు కలిగించుటకు చైనావారి సహాయం తీసుకుంటోంది…దయచేసి దీనిని జాగ్రత్తగా చదవండి మరియు ఆరోగ్యము లేదా ఇతర సమస్యల నుండి మీ కుటుంబాన్ని రక్షించుకొనుటకు సరైన జాగ్రత్తలు తీసుకోండి… దీనిని పీల్చిన వారిలో ఆస్తమా కలిగించే పొగను ఈ పటాకులు విడుదల చేస్తాయి. అంతేకాకుండా ఈ పటాకులు ప్రజలలో శ్వాసతీసుకోవడములో ఇబ్బందిని కలిగించే కార్బన్ మోనాక్సైడ్ ఉత్పత్తి చేసే విధంగా తయారుచేయబడ్డాయి. ఇంకా, చైనా అధిక పరిమాణములో పాదరసం ఉన్న అలంకరణాత్మక రంగుల ఎలెక్ట్రిక్ బల్బులను మరియు సీరియల్ బల్బులను ఉత్పత్తి చేస్తోంది. ఈ బల్బుల నుండి వచ్చే వెలుతురు అత్యంత హానికరమైనది మరియు ఈ వెలుతురుకు బహిర్గతం అయ్యేవారిలో, ముఖ్యంగా పిల్లలలో, చూపుకు సంబంధించిన ఇబ్బందులను కలిగించవచ్చు. జన్మాష్టమి నుండి దీపావళి మరియు క్రిస్టమస్ వరకు రాబోయే పండుగల వరకు ఈ ప్రమాదకరమైన ఉత్పత్తులతో భారతీయ మార్కెట్ లోకి తీసుకొనిరావాలని చైనా ప్రణాళిక చేస్తోంది. పైన పేర్కొనబడిన సమాచారాన్ని తీవ్ర్రంగా పరిగణించి ప్రజలు మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను కొనకూడదని సూచించబడుతోంది. భారతీయుల సంక్షేమం కొరకు ఈ చర్య చాలా ఆవశ్యకం. ప్రజలు మరియు దేశ ఆర్ధిక వ్యవస్థను పరిరక్షించేందుకు ఈ తీవ్రమైన హెచ్చరికను వీలైనంతవరకు మీ కాంటాక్ట్స్, స్నేహితులు మరియు బంధువులలో ఫార్వర్డ్ మరియు ప్రచారం చేయాలని పౌరులు అభ్యర్ధించబడుతున్నారు.. జైహింద్. పంపినది: బిస్వజీత్ ముఖర్జి, సీనియర్ దర్యాప్తు అధికారి, హోమ్ మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్) భారత ప్రభుత్వం. సోషల్ మీడియాలోని ఇతర యూజర్లు ఇలాంటి క్లెయిమ్స్ ను ఈ పోస్ట్ తో షేర్ చేస్తున్నారు. ఈ పోస్ట్ ను మరియు దీని ఆర్కైవ్ వర్షన్ ను ఇక్కడ చూడండి.
దర్యాప్తు:
విశ్వాస్ న్యూస్ కీవర్డ్ సెర్చ్ చేసి తన దర్యాప్తును ప్రారంభించింది. ఈ క్లెయిమ్ కు సంబంధించి ఎలాంటి విశ్వసనీయమైన మీడియా నివేదికలు మాకు లభించలేదు.
మేము హోమ్ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెబ్సైట్ ను మేము స్కాన్ చేయడం ప్రారంభించాము, కాని క్లెయిమ్ కు సంబంధించి ఈ వెబ్సైట్ పై కూడా మాకు ఎలాంటి సమాచారము లేదా పత్రికా ప్రకటన మాకు లభించలేదు.
దర్యాప్తు సమయములో, హోమ్ మంత్రిత్వ శాఖలో సీనియర్ దర్యాప్తు అధికారి అనే ఒక పదవి లేదు. దీని తరువాత మేము విశ్వజీత్ ముఖర్జీ గురించి శోధించడం ప్రారంభించాము, కాని మంత్రిత్వశాఖ వెబ్సిట్ పై అందుబాటులో ఉన్న దస్తావేజులలో ఇదే పేరుతో ఏ అధికారి ఉన్నట్టు మాకు కనిపించలేదు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో 2017 నుండి వైరల్ అయ్యింది మేము కనుగొన్నాము.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ఈ వైరల్ మెసేజ్ నకిలీది అని 2020లో ట్వీట్ చేసింది. ఎంహెచ్ఏ ఇటువంటి ప్రకటన ఏది చేయలేదు.
మరింత సమాచారము కొరకు, మేము దైనిక్ జాగరణ్ యొక్క జాతీయ బ్యూరో విలేఖరి అయిన నీలు రంజన్ గారిని సంప్రదించాము. ఈ క్లెయిమ్ అసత్యమని ఆయన మాతో చెప్పారు. ఈ మెసేజ్ సోషల్ మీడియా పై చాలా సంవత్సరాలుగా చక్కర్లు కొడుతోంది. ఇంతవరకు ప్రభుత్వము ఇలాంటి ప్రకటన చేయలేదు. హోమ్ మంత్రిత్వ శాఖ తానే ఈ క్లెయిమ్ ను ఖండించింది.
దర్యాప్తు చివరిలో, మేము ఈ పోస్ట్ షేర్ చేసిన ఫేస్బుక్ యూజర్ మొహిందర్ సింగ్ ప్రొఫైల్ ను స్కాన్ చేశాము. ఈ యూజర్ కు అయిదు వేలమందికి పైగా స్నేహితులు ఉన్నారని మేము కనుగొన్నాము. ఈ యూజర్ ఒక ప్రత్యేక భావజాలముచే ప్రభావితం అయ్యారు.
ముగింపు: హోమ్ మంత్రిత్వ శాఖ పెరున విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్ గురించి దర్యాప్తు చేసింది మరియు ఈ క్లెయిమ్ అసత్యమని కనుగొనింది. హోమ్ మంత్రిత్వ శాఖ ఇలాంటి పోస్ట్ జారీ చేయలేదు. ప్రజలు సోషల్ మీడియాపై అసత్య క్లెయిమ్స్ షేర్ చేస్తున్నారు.
- Claim Review : చైనా వారి పటాకులకు సంబంధించి హోమ్ మంత్రిత్వశాఖ ఒక సర్క్యులర్ ను జారీ చేసింది.
- Claimed By : మొహిందర్ సింగ్
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.