నావల్ కరోనా వైరస్ నివారణకు ముఖ కేశాలంకరణ గైడ్‌ను సీడీసీ జారీచేయలేదు. వైరల్ గ్రాఫిక్స్ పాతది మరియు COVID-19 తో సంబంధం లేదు.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్) : కరోనావైరస్ నివారణలో భాగంగా ప్రజలు తమ ముఖంపై జుట్టును (మీసాలు, గడ్డం) తీసివేయాలని సిడిసి సిఫారసు చేస్తున్నట్లు పేర్కొన్న వాదన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ముఖంపై జుట్టు మరియు శ్వాసక్రియకు సంబంధించిన గ్రాఫిక్స్ ఇమేజ్‌లు కూడా వైరల్ పోస్ట్‌లో షేర్ చేస్తున్నారు. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ గ్రాఫిక్స్ రెండేళ్ళ క్రితం నుంచి ఇంటర్నెట్‌లో ఉందని మరియు COVID-19 తో ఈ గ్రాఫిక్స్‌కు సంబంధం లేదని కనుగొనడం జరిగింది.
దావా :
వాస్తవ తనిఖీ కోసం విశ్వాస్ న్యూస్ వాట్సాప్ చాట్‌బాట్‌లో ఈ పోస్ట్‌ను అందుకుంది. కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రజలు తమ ముఖంపై జుట్టును (మీసాలు, గడ్డం) తీసివేయాలని సిడిసి సిఫారసు చేస్తుందని పేర్కొన్న వాదనతో పాటు ముఖంపై జుట్టు మరియు శ్వాసక్రియకు తోడ్పడే సాధనాలకు సంబంధించిన గ్రాఫిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ పోస్ట్ ఫేస్‌బుక్‌లో కూడా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ఆర్కైవ్ వెర్షన్‌ను ఇక్కడ చూడవచ్చు,
దర్యాప్తు :
విశ్వాస్ న్యూస్ వైరల్ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో శోధించింది. అదే గ్రాఫిక్స్ ఇమేజ్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్స్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) వెబ్‌సైట్‌లో నవంబర్ 2017లోనే పోస్ట్ చేసినట్లు కనుగొంది. శ్వాసక్రియకు తోడ్పడే సాధనాలను ధరించడం గురించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ (NIOSH) నిపుణులు ఈ బ్లాగ్‌పోస్ట్ చేశారు.
నావల్ కరోనా వైరస్‌ను కనుగొనటానికి రెండు సంవత్సరాల కంటే ముందే ఈ గ్రాఫిక్స్ షేర్ చేయబడ్డాయి,
ఈ బ్లాగ్ పోస్ట్ పైన సిడిసి ఒక హెచ్చరికను కూడా జోడించింది : ‘పనిలో శ్వాసక్రియకు తోడ్పడే సాధనాలను ధరించే కార్మికుల కోసం ఉద్దేశించిన ఈ బ్లాగ్, ఇన్ఫోగ్రాఫిక్ 2017 నుండి అందుబాటులో ఉంది. కరోనా వైరస్ 2019 (COVID-19)కు సంబంధించిన అత్యంత తాజా సమాచారం కోసం, దయచేసి CDC యొక్క COVID-19 వెబ్‌సైట్‌ను సందర్శించండి.’ అనే వివరాలు హైలైట్ చేసింది.
NIOSH కూడా దీనికి సంబంధించి 2020 ఫిబ్రవరిలో ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌ను పరిశీలిస్తే… : ‘@CDCgov ప్రస్తుతం # COVID19 కోసం సాధారణ ప్రజలకు శ్వాసక్రియకు తోడ్పడే సాధనాలను ధరించాలని సిఫారసు చేయలేదు. 2017లో రూపొందించిన ఈ గ్రాఫిక్స్ వాయు ప్రమాద రక్షణకు ధరించాల్సిన కార్మికుల కోసం ఉద్దేశించబడింది, ఎందుకంటే ముఖంపై ఉండే జుట్టు బలంగా ఉండాల్సిన సీల్ లీక్ కావడానికి కారణమవుతుంది.’ అని వివరించారు.
విశ్వాస్ న్యూస్ అపోలో ఆసుపత్రిలో పల్మోనాలజిస్ట్ అయిన డాక్టర్ నిఖిల్ మోడీతో మాట్లాడటం జరిగింది. “ప్రధానంగా COVID-19 సోకిన వ్యక్తి దగ్గడం లేదా తుమ్మడం వల్ల వెలువడే బిందువుల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా COVID-19 వ్యాపిస్తుంది. ముఖ కేశాలంకరణ ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందనడానికి ఆధారం లేదు. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి, మరియు మంచి పరిశుభ్రత పాటించాలి.’ అని డాక్టర్ నిఖిల్ చెప్పారు.
ఈ పోస్ట్‌ను జోయెల్ విన్సెంట్ బ్రౌన్ అనే యూజర్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. మేము వినియోగదారు యొక్క ప్రొఫైల్‌ను స్కాన్ చేసినప్పుడు, వినియోగదారు వర్జీనియాకు చెందిన వాడిగా తెలిసింది.
DISCLAIMER: విశ్వాస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశగా కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.
निष्कर्ष: నావల్ కరోనా వైరస్ నివారణకు ముఖ కేశాలంకరణ గైడ్‌ను సీడీసీ జారీచేయలేదు. వైరల్ గ్రాఫిక్స్ పాతది మరియు COVID-19 తో సంబంధం లేదు.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923