వాస్తవ తనిఖీ: షహీన్ భాగ్ లో మాజీ-ఎంఎల్ఏ మద్ధతుదారులు ‘ఆసిఫ్ ఖాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేశారు, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని కాదు.
- By: Abhishek Parashar
- Published: Dec 7, 2022 at 05:38 PM
- Updated: Dec 8, 2022 at 12:42 PM
మాజీ కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇటీవల పోలీసులను బెదిరించారని మరియు చెయ్యిచేసుకున్నారనే ఆరోపణలపై అరెస్ట్ చేయబడ్డారు. ఇప్పుడు, ఆయన ప్రసంగం యొక్క వీడియో క్లిప్ సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది. ఇందులో ఆయన షహీన్ భాగ్ ప్రాంతములో అనుమతి లేకుండా ఎంసిడి ఎన్నికల కొరకు ప్రచారం చేసే సమయములో, ఆయన మద్ధతుదారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేశారు అని క్లెయిమ్ చేయబడింది.
ఈ క్లెయిమ్ అసత్యము అని విశ్వాస్ న్యూస్ తన దర్యాప్తులో కనుగొనింది. వైరల్ వీడియోలో, ‘ఆసిఫ్ ఖాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేయబడ్డాయి, ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని కాదు.
క్లెయిమ్
సోషల్ మీడియా యూజర్, ‘జితేంద్ర హిందూ నేషనలిస్ట్’ ఈ వైరల్ వీడియో (ఆర్కైవ్ లింక్) షేర్ చేశారు మరియు ఇలా వ్రాశారు, “మన చట్టము, హై కోర్టు, సుప్రీం కోర్టు, హోమ్ మంత్రిత్వశాఖలు అన్నీ నపుంసకులా? ఈ పోలీసు దేశ రాజధాని, ఢిల్లీలో ఉన్నారు. అమానవీయ వైఖరి ప్రదర్శించారు, మనము పాకిస్తాన్ లో ఉన్నామా???
ఓఖ్లా జామియా నుండి ఈ కాంగ్రెస్ వ్యక్తి, మాజీ ఎంఎల్ఏ, ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ పై ఎలాంటి పోలీసు చర్య తీసుకోబడదా? పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు లేవనెత్తి నవ్వుతున్న ఈ గుంపులోని పిల్లలను చూడండి….. ఈ పిల్లలు ఎదిగి భారతదేశానికి అనుకూలంగా ఏపని అయినా చేస్తారా? అది జరుగుతుందా????? కొంతకాలం తరువాత ఈ పరిస్థితి దేశమంతటా జరుగుతుంది… నిద్రపోతున్న దేశ పౌరులారా మేల్కొనండి…. దయచేసి, అందరు షేర్ చేయండి.”
వివిధ సోషల్ మీడియా వేదికలపై ఇతర యూజర్లు ఇదే వీడియోను ఇటువంటి క్లెయిమ్స్ తో షేర్ చేశారు.
దర్యాప్తు
రిపోర్ట్స్ ప్రకారము, మాజీ కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ ఢిల్లీలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి అనుమతి లేకుండా ఒక సమావేశాన్ని (ఎంసిడి ఎన్నికల ప్రచారము) నిర్వహిస్తున్నారని ప్రశ్నించినందుకు పోలీసులతో దుష్ప్రవర్తనకు గాను అరెస్ట్ చేయబడ్డారు. రిపోర్ట్స్ ప్రకారము ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ తయ్యాబ్ మజీద్ ముందు 20 – 30 మంది ముందు ప్రసంగిస్తున్నారు, అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అక్షయ్ కే ఖాన్ సమావేశ అనుమతుల గురించి ఆయనను ప్రశ్నించారు. సబ్ ఇన్స్పెక్టర్ ప్రశ్నలను విన్న ఆయన ఆగ్రహించి గుంపులో అమర్యాదగా ప్రవర్తించారు.
వార్తా ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారము – ఢిల్లీ పోలీసులు తయ్యాబ్ మజీద్ సమీపములో పెట్రోలింగ్ సమయములో ఒక సభను చూశారు, అందులో ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ తన మద్ధతుదారులతో ఒక లౌడ్ స్పీకర్ ద్వారా ప్రసంగిస్తున్నారు.
ఆ సమూహానికి ఎన్నికల కమిషన్ ఆమోదము గురించి అడిగినప్పుడు, ఆసిఫ్ ఖాన్ దూకుడుగా మారారు మరియు అధికారులను దుర్భాషలాడటం ప్రారంభించారు. వెంటనే షహీన్ భాగ్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేయబడింది మరియు విచారణ చేపట్టబడింది, దాని తరువాత ఆయన అరెస్ట్ చేయబడ్డారు.
ఏఎన్ఐ యొక్క ట్వీట్ లో ఉపయోగించిన చిత్రము కొల్లాజ్ లో చూడబడే వైరల్ వీడియో యొక్క స్క్రీన్ షాట్ తో సరిపోలుతుంది.
ఏ వార్తా నివేదికలలో కూడా ఈ సమావేశములో ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాల గురించిన ప్రస్తావన మాకు లభించలేదు.
తరువాత, విశ్వాస్ న్యూస్ షహీన్ భాగ్ పోలీసు స్టేషన్ లో పోస్టింగ్ చేయబడిన సబ్-ఇన్స్పెక్టర్ అక్షయ్ దాగర్ ను సంప్రదించింది, ఆయన ఆ దృశ్యము జరిగినప్పుడు అక్కడ ఉన్నారు మరియు ఆయనపైనే చెయ్యిచేసుకోబడింది.
‘పాకిస్తాన్ జిందాబాద్; అనే నినాదాలు చేయబడ్డాయి అనే క్లెయిమ్ ను ఖండిస్తూ, ఆయన, తన సమక్షములో, ప్రజలు ‘ఆసిఫ్ ఖాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేశారు అని చెప్పారు.
సోషల్ మీడియాపై అనేకమంది యూజర్లు ఈ సంఘటన యొక్క వీడియో క్లిప్ ను షేర్ చేశారు మరియు ఎవరైనా ‘ఆసిఫ్ ఖాన్ జిందాబాద్’ అనే నినాదాన్ని వినవచ్చు. ఈ వీడియో అనేక వార్తా ఛానల్స్ యొక్క వీడియో బులెటిన్స్ లో కూడా చేర్చబడింది, వీటిల్లో మద్ధతుదారులు ‘ఆసిఫ్ ఖాన్ జిందాబాద్’ అని అరవడం వినవచ్చు.
సోషల్ స్కానింగ్ చేసిన తరువాత, ఈ యూజర్ కు ఫేస్బుక్ పై వేలమంది ఫాలో అవుతున్నారు మరియు ఒక ప్రత్యేక భావజాలం అతని ప్రొఫైల్ ను ప్రేరేపిస్తుంది అని మేము కనుగొన్నాము.
ముగింపు: ఎంసిడి ఎన్నికల ప్రచారముపై మాజీ కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆసిఫ్ మొహమ్మద్ ఖాన్ మరియు ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్ మధ్య వివాదము నకిలీ క్లెయిమ్స్ తో సోషల్ మీడియాపై వైరల్ అవుతోంది.
- Claim Review : షహీన్ భాగ్ లో మాజీ ఎంఎల్ఏ మద్ధతుదారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే నినాదాలు చేశారు.
- Claimed By : ఎఫ్బి యూజర్ జితేంద్ర హిందూ రాష్ట్రవాది
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.