వాస్తవ తనిఖీ: వైరల్ వీడియో 2017 డర్బన్ సముద్ర తుఫాను, టర్కీ భూపంకానికి సంబంధించినది కాదు
- By: Abhishek Parashar
- Published: Feb 17, 2023 at 11:29 AM
కొత్త ఢిల్లీ (విశ్వాస్ న్యూస్): ఇటీవలి టర్కీ మరియు సిరియా భూకంపానికి సంబంధించి అనేక వీడియోలు మరియు ఫోటోలు ఇంటర్నెట్ పై వైరల్ అవుతున్నాయి. అదే విధంగా, ఒక వీడియో సోషల్ మీడియా వేదికలపై వైరల్ అవుతోంది, ఈ వీడియోలో భారీ సునామీ-వంటి అలలు తీర ప్రాంతాలను తాకినట్టు చూడవచ్చు. సోమవారం 7.8 తీవ్రతతో భూకంపము తరువాత అదానాలో ఈ సునామీ సంభవించింది అనే ఒక క్లెయిమ్ తో ఈ వీడియో షేర్ చేయబడింది. విశ్వాస్ న్యూస్ ఈ వీడియో గురించి దర్యాప్తు చేసింది మరియు ఒక తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వీడియో షేర్ చేయబడింది అని కనుగొనింది. వైరల్ వీడియో దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో సంభవించిన 2017 సముద్ర తుఫానుకు సంబంధించినది.
క్లెయిమ్:
వైరల్ video (archive link) ను షేర్ చేస్తూ, సోషల్ మీడియా యూజర్ సల్మాన్ డి ఆలీ ఇలా వ్రాశారు, “Tsunami sa Adana, Turkey matpas ang napakalakas na lindol na tumama sa regioniyon kahapon. #టర్కీకొరకుప్రార్థించండి #సిరియాకొరకుప్రార్థించండి #సునామి #భూకంపము. వివిధ సోషల్ మీడియా వేదికలపై అనేక ఇతర యూజర్స్ కూడా ఇదే క్లెయిమ్ తో వీడియోను షేర్ చేశారు.
దర్యాప్తు:
వైరల్ వీడియో గురించి దర్యాప్తు చేయుటకు, విశ్వాస్ న్యూస్ బృందము వైరల్ వీడియో యొక్క అసలైన మూలాన్ని కనుగొనుటకు రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను ఉపయోగించింది. రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో, మాకు ఎక్స్ప్రెస్సో షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ పై ఇదే వీడియో లభించింది.
అయిదు సంవత్సరాల క్రితం ఒక వార్తా బులెటిన్ లో ఈ వీడియో పేజ్ పై అప్లోడ్ చేయబడింది.
మార్చ్ 14, 2017 నాడు అప్లోడ్ చేయబడిన వీడియో బులెటిన్ లో అందించబడిన సమాచారము ప్రకారము, వీడియో దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో ఉన్న బ్రహిమా ఫొఫానా బీచ్ లోని సముద్ర తుఫానుకు సంబంధించినది.
ఒక యూట్యూబ్ సెర్చ్ లో సన్ వార్తాపత్రిక యొక్క యూట్యూబ్ ఛానల్ పై, మార్చ్ 12, 2017 నాడు ఇదే సందర్భములో అప్లోడ్ చేయబడిన ఈ వీడియో ఉన్నట్లు కనుగొనింది.
వైరల్ వీడియోకు సంబంధించి మేము టర్కీ య్ ఒక్క వాస్తవ-తనిఖీ సంస్థ టీట్ ను సంప్రదించాము. అదానాలో ఎలాంటి సునామీ గురించిన సమాచారం లేదని ఆయన తెలిపారు మరియు వైరల్ అయిన వీడియో టర్కీ నుండి కాదని దక్షిణాఫ్రికాకు చెందినది అని కూడా ఆయన చెప్పారు.
వార్తా ఏజెన్సీ ఏఎఫ్పి ప్రకారము, టర్కీ మరియు సిరియాలో సంభవించిన విధ్వంసక భూకంపము కారణంగా ఇంతవరకు సుమారు 16,000మందికి పైగా చనిపోయారు.
టర్కీలో 14,000 మందికి పైగా మరియు సిరియాలో 3,000 మందికి పైగా చనిపోయారు.
టర్కీ-సిరియా భూకంపము తరువాత, ఇటీవలి భూకంపానికి ఎలాంటి సంబంధం లేని, చాలా పాత మరియు అసంబద్ధమైన వీడియోలు మరియు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయనేది గమనార్హము. తప్పుదోవపట్టించే క్లెయిమ్ తో వైరల్ వీడియోను షేర్ చేసిన యూజర్ కు ఫేస్బుక్ పై 4,000 మందికి పైగా ఫాలోయర్స్ ఉన్నారు.
ముగింపు: దక్షిణాఫ్రికాలోని డర్బన్ లో 2017 సముద్ర తుఫానుకు సంబంధించిన ఒక వీడియో, టర్కీలో తీవ్రమైన భూకంపము కారణంగా అదానాలో సంభవించిన సునామీగా షేర్ చేయబడింది.
- Claim Review : టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపము సంభవించిన తరువాత సునామి సంభవించింది.
- Claimed By : ఎఫ్బి యూజర్ సల్మాన్ డి ఆలీ
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.