కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఈ పోస్ట్‌లో చేసిన అన్ని వాదనలు విశ్వాస్ న్యూస్ పరిశోధనలో తప్పుదారి పట్టించేవిగా మరియు నకిలీ వాదనలుగా కనుగొనబడ్డాయి. కరోనా వైరస్‌కు పీహెచ్ విలువ లేదు. అంతేకాదు.. వేడి నీటితో కూడిన నిమ్మరసాన్ని తాగడం ద్వారా ఇది చంపబడుతుందన్న వాదన కూడా తప్పు. PMCHకి ఈ వైరల్ పోస్ట్‌తో ఎలాంటి సంబంధం లేదు. కరోనా సోకినప్పుడు స్వీయ-ఔషధాలను అనుసరించడం ప్రాణాంతకంగా మారతాయి.
హైదరాబాద్ (విశ్వాస్ న్యూస్): సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో, పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (PMCH) కు చెందిన ఒక డాక్టర్ పేరుతో కరోనా వైరస్‌కు సంబంధించి కొన్ని వాదనలు ప్రచారం చేస్తున్నారు. వేడి నీటితో నిమ్మరసం తాగడం వల్ల కరోనా వైరస్ మరణిస్తుందన్నది ఆ ప్రచారంలో ఒకటి. విశ్వాస్ న్యూస్ తన వాట్సప్ చాట్‌బాట్ (+ 91 95992 99372)లో ఫ్యాక్ట్ చెక్ కొరకు ఈ మెస్సేజ్‌ను అందుకుంది. విశ్వాస్ న్యూస్ దర్యాప్తులో ఈ పోస్ట్‌కు సంబంధించిన అనేక వాదనలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయి. పీఎంసీహెచ్ పేరును కూడా తప్పుడు వాదనతో పోస్టుల్లో వాడుతున్నారు.
వైరల్ అవుతున్న ది ఏమిటి ?
ఈ కరోనా పోస్టులు వాట్సప్‌తో పాటు ఫేస్‌బుక్‌లో కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పోస్ట్ మధ్యప్రదేశ్‌లోని బార్హి పేరుతో ఉన్న పేజీ లో షేర్ చేయడం జరిగింది. ఈ పోస్ట్‌లో చాలా వాదనలు ఉన్నాయి. ఇది చాలా పెద్ద పోస్ట్. ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు. విశ్వాస్ న్యూస్ తన వాట్సప్ చాట్‌బాట్‌లో కూడా ఫ్యాక్ట్‌చెక్ కొరకు సరిగ్గా అదే పోస్ట్‌ని అందుకుంది. ఈ పోస్ట్‌లోని స్క్రీన్‌షాట్‌లను కింద చూడవచ్చు:
దర్యాప్తు :
ఈ పోస్ట్‌లో చేసిన వాదనలను వివిధ భాగాలుగా విభజించడం ద్వారా విశ్వాస్ న్యూస్ తన పరిశోధనను ప్రారంభించింది. మొట్టమొదటగా కరోనా మెడికల్ కిట్‌ను ఇంటివద్ద ఉంచుకోవాలని ఈ పోస్ట్‌లో సలహా ఇచ్చారు. అలాగే పారాసెటమాల్, విటమిన్ సి-డి, పుక్కిలించడం కోసం బెటాడిన్‌ను, ఆక్సిజన్ సిలిండర్లను కూడా ఇంట్లో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈ విషయంలో రామ్ సాగర్ మిశ్రా కంబైన్డ్ హాస్పిటల్‌కు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ సుమిత్‌ను విశ్వాస్ న్యూస్ సంప్రదించింది. ఈ మొత్తం వైరల్ క్లెయింను ఆయనకు మేము పంపించాము.
ఈ పోస్ట్‌లో పేర్కొన్న అన్ని వాదనలు తప్పు అని డాక్టర్ సుమిత్ పేర్కొన్నారు. కరోనా ఇన్ఫెక్షన్ సోకినవారికి స్వీయ-చికిత్స చేసుకోవాలని సలహా ఇవ్వబడదని ఆయన అన్నారు. రోగికి ఒకవేళ ఆక్సిజన్ అవసరమైతే.. ఆక్సిజన్ సిలిండర్లను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని చెప్పారు. అలాగే, ఈ పోస్టులో మూడు దశల్లో కరోనా వ్యాపిస్తుందని, మొదట ముక్కుకు, ఆ తర్వాత గొంతుకు, ఆ తర్వాత ఊపిరితిత్తులు వంటి వాటి ద్వారా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకైతే కరోనాకు సంబంధించిన మందులు లేవని, అంతేకాకుండా అది వ్యాప్తి చెందడానికి వైరల్ పోస్టులో పేర్కొన్న మాదిరి దశలు ఏవీ లేవని డాక్టర్ సుమిత్ పేర్కొన్నారు. సాధారణ స్థితిలో 10 రోజుల చికిత్స అనే ప్రోటోకాల్ ప్రస్తుతం కొనసాగుతోందన్నారు.
రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు విటమిన్లను ఉపయోగించడం వంటివి వైద్యులు సలహా ఇస్తారు. కానీ, అవి కరోనాను నివారిస్తాయని మాత్రం ఎవరూ చెప్పలేరు.
ఈ పోస్ట్‌లో ఉన్న అనేక క్లెయిమ్‌లలో మరొకటి ఏంటంటే, ‘కరోనావైరస్ యొక్క pH 5.5 నుంచి 8.5.5 వరకు ఉంటుంది.’ వైరస్ యొక్క ఆమ్లత్వం స్థాయి కంటే ఎక్కువ క్షార పదార్థాలు తీసుకోవాలని చెప్పబడింది. తరువాత, కొన్ని ఆహార పదార్థాల పిహెచ్ లెవల్స్ యొక్క జాబితా కూడా ఈ పోస్ట్‌లో షేర్ చేశారు. విశ్వాస్ న్యూస్ ఇప్పటికే ఈ వాదనను పరిశీలించింది. ఈ వాదన పూర్తిగా తప్పు. డాక్టర్ సుమిత్ కూడా ఆ వాదనను తప్పుగా కొట్టిపారేశారు. కరోనా వైరస్‌కు పీహెచ్‌లు లేవని చెప్పారు. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ స్టోరీని కింద లింకులో చదవవచ్చు :
వైరల్ పోస్ట్‌లో ఇంకా ఇలా పేర్కొన్నారు, ‘ వేడి నీటితో నిమ్మరసాన్ని తాగడం వల్ల ఊపిరితిత్తులకు చేరే లోగానే వైరస్‌ను నిర్మూలిస్తుంది.’ ఈ వాదన కూడా పూర్తిగా తప్పు. కరోనా వైరస్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి చికిత్స కనుగొనబడలేదు లేదా ఎలాంటి ఔషధం లేదా వ్యాక్సిన్ కూడా కనుగొనబడలేదు. డబ్యూహెచ్‌ఓ ప్రకారం, కొన్ని పాశ్చాత్య, సంప్రదాయ లేదా గృహ నివారణ చికిత్సలు కరోనా వైరస్ యొక్క తేలికపాటి సంక్రమణ లక్షణాలను మాత్రం సడలించవచ్చు, కానీ ఈ వ్యాధిని నివారించడానికి ఎటువంటి ఔషధం లేదు.
PMCHకు చెందిన వైద్యనిపుణులు డాక్టర్ దీపాలి ఈ సూచనలు చేశారని వైరల్ అవుతున్న పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ విషయంపై, పి.ఎం.సి.హెచ్ పాట్నాకు చెందిన కోవిడ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎన్.ఝాతో విశ్వాస్ న్యూస్ మాట్లాడింది. ఈ వైరల్ సందేశానికి PMCH తో సంబంధం లేదని, డాక్టర్ దీపాలి అనే పేరుతో కూడా ఎవరూ లేరిన ఆయన తెలిపారు. గత కొన్ని నెలలుగా ఈ మెసేజ్ వైరల్‌గా మారిందని, తప్పుడు ఆరోపణలు చేశారని ఆయన విశ్వాస్ న్యూస్‌కు చెప్పారు.
విశ్వాస్ న్యూస్ ఈ వైరల్ పోస్ట్‌ను షేర్ చేసిన ‘బార్హి మధ్యప్రదేశ్’ అనే ఫేస్‌బుక్ పేజీని సోషల్ స్కానింగ్ చేసింది. ఈ పేజీని 603 మంది ఫాలో అవుతున్నారు.
disclaimer : విశ్వస్ న్యూస్ యొక్క కరోనా వైరస్ (COVID-19) కు సంబంధించిన ఫాక్ట్ చెక్ స్టోరీని చదివేటప్పుడు లేదా షేర్ చేసుకునేటప్పుడు, ఉపయోగించిన డేటా లేదా పరిశోధన డేటా ఎప్పటికప్పుడు మారుతుందని అని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకు మారుతుందంటే ఈ అంటువ్యాధికి సంబంధించిన గణాంకాలు (వైరస్ సోకిన మరియు నయం చేయబడిన రోగుల సంఖ్య, మరణాల సంఖ్య) నిరంతరం మారుతూ ఉంటాయి. అదే సమయంలో, ఈ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనుగొనే దిశలో కొనసాగుతున్న పరిశోధనల యొక్క ఖచ్చితమైన ఫలితాలు ఇంకా రాలేదు. ఈ కారణంగా, చికిత్స మరియు నివారణకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటా కూడా మారవచ్చు. అందువల్ల కథనంలో ఉపయోగించిన డేటాను దాని తేదీ సందర్భంలో చూడటం చాలా ముఖ్యం.
निष्कर्ष: కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఈ పోస్ట్‌లో చేసిన అన్ని వాదనలు విశ్వాస్ న్యూస్ పరిశోధనలో తప్పుదారి పట్టించేవిగా మరియు నకిలీ వాదనలుగా కనుగొనబడ్డాయి. కరోనా వైరస్‌కు పీహెచ్ విలువ లేదు. అంతేకాదు.. వేడి నీటితో కూడిన నిమ్మరసాన్ని తాగడం ద్వారా ఇది చంపబడుతుందన్న వాదన కూడా తప్పు. PMCHకి ఈ వైరల్ పోస్ట్‌తో ఎలాంటి సంబంధం లేదు. కరోనా సోకినప్పుడు స్వీయ-ఔషధాలను అనుసరించడం ప్రాణాంతకంగా మారతాయి.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923